Littles: ఒక అడవిలో చిక్కూ అనే కుందేలు ఉండేది.
ABN, Publish Date - Jun 08 , 2024 | 01:07 AM
ఒక అడవిలో చిక్కూ అనే కుందేలు ఉండేది. దనాకా వాళ్ల అమ్మ నీతి కథలు మంచి మంచి విష యాలు చెబుతూ ఉండేది. ఒక రోజు చిక్కూకి వాళ్లమ్మ ఎవరైనా ఆపదలో ఉంటే చేతనైన సాయం చే యాలని, తిరిగి వారు మనకు ఏమీ సాయం చేయలేక పోయినా మనం మాత్రం మన సాయపడే గుణాన్ని వదలకూడదని మన వల్ల సాయం పొందిన వారే కాకుండా ఎక్కడో ఒక చోటనుండి మనకు సహాయం లభిస్తుందని చెప్పింది.
ప్రత్యుపకారం

తల్లి మాటలు జాగ్రత్తగా విన్న చిక్కూ ఎవరైనా ఇబ్బందిలో ఉంటే చేతనైన సాయం చేసి ఆదుకోవడం మొదలు పెట్టింది. అడవిలో ఒక మేకకు .బ్బు చేసి ఆహారం వెతుక్కునే ఓపిక లేక అలాగే ఉండిపోతే చిక్కూ వెళ్లి ఆ మేకకు విశ్రాంతి తీసుకోమని చెప్పి తన చిన్నారి నోటితో మోయగలిగినంత మేత తీసుకొచ్చి పెట్టి మేకకు సాయం చేసింది. ఒక గుర్రం కాలిలో ముల్లు గుచ్చుకుని నడవలేక పోతుంటే తన పదునైన పళ్లతో దాని కాలిలో నుండి ముల్లును పెకలించివేసింది.
ఒక డేగ రెక్కలకు దెబ్బ తగిలి ఎగరలేక పోతుంటే, ఏ మందు వేయాలో వాళ్ల అమ్మను అడిగి తెలుసుకుని, ఆ ఆకు పసరు తెచ్చి పూసి డేగ గాయాన్ని మాన్పింది తర్వాత ఒక రోజు చిక్కూ వెంట ఒక వేట కుక్క పడి తరమడం మొదలు పెట్టింది. చిక్కూ తాను అంత క్రితం ఆదుకున్న మేకను, గుర్రాన్ని పిలిచి సాయం అడిగింది, అవన్నీ మేము పనిలో ఉన్నాము. ఇపుడు నిన్ను కాపాడలేము అన్నాయి.
ఈలో గా ఎక్కడినుండో వేట కుక్క కుందేలును తరమడం గమనించిన ఒక పెద్ద గద్ద వేగంగా ఎగురుతూ వచ్చి కుందేలును ఉన్నపళంగా ఎత్తుకుపోయి మరొక చోట దింపేసింది. వెంటనే చిక్కూ వాళ్లమ్మ దగ్గరికి వెళ్లి నువ్వు చెప్పింది నిజం అమ్మా మనం ఎదఉ టి వారికి చేతనైన సాయం మానకుండా చేస్తూ ఉంటే వారు కాకున్నా ఎవరో ఒకరు మనల్ని ఆదుకుంటారు అని ఇవాళ తెలుసుకున్నాను అని చెప్పింది.
Updated Date - Jun 08 , 2024 | 01:09 AM