Littles : చిన్న కప్ప అజాగ్రత్త
ABN, Publish Date - Aug 10 , 2024 | 02:52 AM
అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చేదబావిలో కొన్ని కప్పలు నివసిస్తూ ఉండేవి. వాటిలో ఒక తల్లి కప్ప తన పిల్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. చిన్న కప్పకు బావి బయటకు వెళ్లి చుట్టూఉన్న ప్రపంచం ఎలా ఉందో చూడాలని ఉండేది.
Littles : అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చేదబావిలో కొన్ని కప్పలు నివసిస్తూ ఉండేవి. వాటిలో ఒక తల్లి కప్ప తన పిల్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. చిన్న కప్పకు బావి బయటకు వెళ్లి చుట్టూఉన్న ప్రపంచం ఎలా ఉందో చూడాలని ఉండేది. తల్లి కప్ప ‘బయట చాలా ప్రమాదాలు ఉంటాయి బయటకు వెళ్లకూడద’ు అని ఆపుతూ ఉండేది.
ఓ రోజు ఆ బావి దగ్గరకు నీళ్ల కోసం వచ్చిన ఒకావిడ బిందెను బావిలోకి జార విడిచింది. చిన్న కప్ప తన పక్కనే ఉన్న మిగతా కప్పలు ఎంత చెప్పినా వినకుండా, బయటకు పోయి చూడాలన్న ఆతృతతో ఆ బిందెలోకి వెళ్లిపోయింది. బిందెను పైకి తీసుకున్న ఆవిడ నీటిలో కప్పను గమనించి, ఆ నీటినికింద పారబోసింది. కప్ప ఆ నీటితో పాటుకింద పడిపోయి, చుట్టూ ఉన్న చెట్లు, పొదలను పువ్వులను ఆకాశాన్ని ఆనందంగా చూడసాగింది. ఈ లోగాఆ పొదల్లోకి, ఒక పెద్దపాము వచ్చి, కప్పనుచూసింది.
ఇంకేముంది? పామునుచూసి, గడగడా వణికిన కప్ప అలాగే గెంతుకుంటూ వెళ్లి, తనబావిలో దూకేసింది దానిని చూసిన కప్ప తల్లి, మిగతా కప్పలు చిన్నకప్పతో చూసావా వద్దంటే బయటకు వెళితే ప్రమాదాలు ఎలా ఉంటాయో?అన్నాయి.ుు‘.నిజమే మరోసారి ఒంటరిగ ఎక్కడికీ వెళ్లను అమ్మా’అని ఏడ్చి బుధ్ది తెచ్చుకుంది చిన్న కప్ప.
Updated Date - Aug 10 , 2024 | 02:52 AM