ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Littles : కాకి-పిచ్చుక

ABN, Publish Date - Aug 05 , 2024 | 11:59 PM

అడవిలో ఉండే ఒక కాకికి తాను మిగతా పక్షులకన్నా ఎత్తులో వేగంగా ఎగరగలననే పొగరు, అతి విశ్వాసం ఉండేవి. ఒక రోజు చిన్న పిచ్చుక ఒకటి నెమ్మదిగా ఎగురుకుంటూ కాకి గూడు దగ్గరగా వెళుతుంది.

Littles : అడవిలో ఉండే ఒక కాకికి తాను మిగతా పక్షులకన్నా ఎత్తులో వేగంగా ఎగరగలననే పొగరు, అతి విశ్వాసం ఉండేవి. ఒక రోజు చిన్న పిచ్చుక ఒకటి నెమ్మదిగా ఎగురుకుంటూ కాకి గూడు దగ్గరగా వెళుతుంది. కాకి దాన్ని చూసి, నీకు కనీసం అందంగా వేగంగా ఎగరడం కూడా రానట్లు ఉన్నది కదా. ఏదో పురుగు గెంతినట్టు ఎగురుతున్నావు నన్ను చూసి, ఎలా ఎగరాలో నేర్చుకుందువులే అంటూ ఎగతాళిగా మాట్లాడింది.

ఆ మాటలకు చిన్న పిచ్చుక నొచ్చుకున్నా, ఎవరి శక్తి, ఎవరి పద్ధతి వారిది, అందరూ నీలాగే ఉండాలంటే ఎలా? అని వెళ్లిపోయింది. కానీ కాకి అక్కడితో ఆగలేదు పిచ్చుకను అదేపనిగా ఎగతాళి చేస్తూనే ఉంది. ఇదంతా చూసిన తోటి పక్షులు ఇతర జంతువులు అన్నీ కాకితో ఇలా అన్నాయి. ‘మీ ఇద్దరిలో ఎవరు బాగా ఎగరగలరో తేల్చుకోడానికి ఒక పోటీ పెడదాం.

మీ ఇద్దరిలో ఎవరైతే ఆ దట్టమైన ఊడలున్న మర్రి చెట్టును ముందుగా చుట్టి వస్తారో వారే పోటీలో విజేత అన్నాయి జంతువులన్నీ. కాకి తన మీద తనకు గల అతి నమ్మకంతో ముందూ వెనుక చూసుకోకుండా వేగంగా ఎగిరిపోయి, దట్టంగా చిక్కుగా ఉన్న ఆ మర్రి ఊడల్లో తన రెక్కలు చిక్కుకుని అలాగే కదలకుండా ఉండిపోయింది.

చిన్న రెక్కలు, చిన్న శరీరం ఉన్న పిచ్చుక తేలికగా ఆ గుబురు ఊడల మధ్య నుంచి ఎగురుతూ, కాకి కంటే ముందే చెట్టును చుట్టి వచ్చి, పోటీలో గెలిచింది. ఎపుడూ ఎవరిశక్తి సామర్థ్యాలను తక్కువ చేసి అవమానించి మాట్లాడకూడదు.

Updated Date - Aug 05 , 2024 | 11:59 PM

Advertising
Advertising
<