ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Littles : సత్య వ్రతం

ABN, Publish Date - Jul 13 , 2024 | 12:29 AM

కేశవ పురంలో నివసించే మాధవుడికి ఎపుడూ అసత్యం చెప్పడని మంచి పేరుండేది. ఆ దేశపు రాజుగారికి ఈ విషయం తెలిసి, ‘ఒక్కసారి కూడా అబధ్దం చెప్పకుండా ఉండటం ఎలా సాధ్యంఅని...

కేశవ పురంలో నివసించే మాధవుడికి ఎపుడూ అసత్యం చెప్పడని మంచి పేరుండేది. ఆ దేశపు రాజుగారికి ఈ విషయం తెలిసి, ‘ఒక్కసారి కూడా అబధ్దం చెప్పకుండా ఉండటం ఎలా సాధ్యంఅని, అతనితో నేను అబధ్దం ఆడిస్తాను’ అన్నాడు రాజు‘ అదెలా మహారాజా?’అని అడిగిన మంత్రితో, ‘నేను ఒక చోటికి వస్తున్నాను అని మాధవుడితో ఆ చోటికి కబురు పంపుతాను. నేను చెప్పిన ప్రకారం వెళ్లక పోతే అతను అసత్యం ఆడినట్లే కదా ఈ విధంగా అతని సత్య వ్రతంచెడిపోయినటే’్ల అని నవ్వాడు రాజు.

అనుకున్న ప్రకారమే తాను ఒక మారుమూల పల్లెకు రాబోతున్నట్టు మాధవుడి చేత ఆ ఊరికి వర్తమానం పంపాడు కానీ చెప్పిన సమయానికి వెళ్లలేదు ఆ మర్నాడు మంత్రిని పిలిచి ఆ పల్ల్లెప్రజలు మాధవుడి అసత్యం గురించి ఏం అనుుకుంటున్నారో తెలుసుకోమని చెప్పాడు. మంత్రి సాయంకాలం తిరిగి వచ్చి, ‘మహారాజా. మాధవుడు ఆ ప్రజలకు మీరు ఆ పల్లెకు రావాలి అని అనుకున్నట్టు మాత్రమే చెప్పాడట కానీ ఖచ్చితంగా రాజుగారు వస్తారు అని మాట ఇవ్వలేదట కాబట్టి అక్కడ ఎవరూ మాధవుడిని అసత్య వాది అనుకోవడంలేదు’ అని చెప్పాడు. ఈ మాటలు విన్న రాజుగారు మాధవుడి లౌక్యానికి, ముందు జాగ్రత్తకు సంతోషించి, మాధవుడికి విలువైన కానుకలు ఇచ్చాడు.

Updated Date - Jul 13 , 2024 | 12:29 AM

Advertising
Advertising
<