Navya : దేవుడిచ్చిన వరం
ABN, Publish Date - Jun 08 , 2024 | 11:42 PM
అనగనగా ఒక అడవిలో రాణి అనే పేరు గల కాకి ఉండేది. దానికి ఆ అడవిలో ఆడుకోవ డానికి బోలెడు మంది స్నేహితులు ఉండే వారు. ఒక రోజు ఆ కాకి సరస్సు దగ్గర ఒక హంసను చూసింది. ఆ హంస ఎంతో అందంగా ఉందని అనిపించింది. అదే మాట హంసతో చెప్పింది. అప్పుడు హంస- ‘‘ ఆ చెట్టు మీద ఉండే చిలుకను చూసే దాకా నేను కూడా నేనే అందరికంటే అందమైన దాన్ని అనుకుంటూ వచ్చాను.
అనగనగా ఒక అడవిలో రాణి అనే పేరు గల కాకి ఉండేది. దానికి ఆ అడవిలో ఆడుకోవ డానికి బోలెడు మంది స్నేహితులు ఉండే వారు. ఒక రోజు ఆ కాకి సరస్సు దగ్గర ఒక హంసను చూసింది. ఆ హంస ఎంతో అందంగా ఉందని అనిపించింది. అదే మాట హంసతో చెప్పింది. అప్పుడు హంస- ‘‘ ఆ చెట్టు మీద ఉండే చిలుకను చూసే దాకా నేను కూడా నేనే అందరికంటే అందమైన దాన్ని అనుకుంటూ వచ్చాను. కానీ ఆ చిలుక ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో ఎంతో అందంగా ఉంది’’ అంటూ బాధ పడింది. కాకి ఇదే మాట వెళ్లి చిలుకతో చెప్పింది.
ఆ మాటలకు చిలుక- ‘‘ నాదేమి అందం నాకు రెండే రంగులున్నాయి కానీ నేనుచూసిన నెమలికి ఎన్ని రంగుల ఈకలో తెలుసా? సృిష్టి లో అందరికంటే నెమలే చాలా అందమైనది’’ అని చెప్పింది. కాకి నెమలిని వెతుకుతూ వెళ్లింది. కానీ నెమలి కనసడలేదు. అలా వెతుకుతూ కాకి ఒక ఊరు చేరింది. అక్కడ నెమలి ఒక జంతు ప్రదర్శనశాలలో ఉంది. అప్పుడు నెమలి ఆ కాకి దగ్గరకు వెళ్లి - ‘‘నువ్వు ఎంత అందమైనదానివో.. అందరికీ నువ్వంటే ఇష్టం.
అందువల్ల నువ్వు చాలా సంతోషంగా ఉండాలి’’ అంది. అప్పుడు ఆ నెమలి- ‘‘నా అందమైన ఈకలే నాకు స్వేచ్ఛ లేకుండా చేశాయి. నేను పురి విప్పి ఆడుతున్నప్పుడు మనుషులు చూశారు. నన్ను బంధించారు. అందరూ నేను అందంగా ఉంటానంటారు. కానీ ఏం ప్రయోజనం? మీరు ఎంతో స్వేచ్ఛగా ఉన్నారు’’ అని బాధపడింది. అప్పుడు కాకికి అందం కన్నా స్వేచ్ఛగా ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తుందనే విషయం అర్థమయింది.
Updated Date - Jun 08 , 2024 | 11:42 PM