Navya: కనురెప్పలు ఒత్తుగా....
ABN, Publish Date - May 26 , 2024 | 02:37 AM
ఒత్తైన కనురెప్పలు కళ్ల అందన్ని పెంచుతాయి. ఆర్టిఫిషియల్ ఐ ల్యాషెస్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్లు ఇదిగో ఇలా సహజసిద్ధంగా కను రెప్పలను ఒత్తుగా పెంచుకోవచ్చు.
బ్యూటీ
ఒత్తైన కనురెప్పలు కళ్ల అందన్ని పెంచుతాయి. ఆర్టిఫిషియల్ ఐ ల్యాషెస్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్లు ఇదిగో ఇలా సహజసిద్ధంగా కను రెప్పలను ఒత్తుగా పెంచుకోవచ్చు.
రాత్రి నిద్రపోయే ముందు తాజా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం తీసుకుని, దాన్లో ఇయర్ బడ్ ముంచి కనురెప్పల మీద అద్దుకోవాలి. ఇలా వారంపాటు క్రమం తప్పక చేస్తే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.
నిమ్మ తొక్కును ఆలివ్ ఆయిల్ లేదా ఆముదంలో వేసి, ఒక వారం తర్వాత ఆ నూనెను కనురెప్పలకు పూసుకున్నా ఫలితం ఉంటుంది.
పెట్రోలియం జెల్లీలో మస్కారా బ్రష్ ముంచి, దాంతో కను రెప్పలు అద్దుకోవాలి. ఇలా వారంపాటు చేస్తే ఫలితం దక్కుతుంది.
చల్లబరిచిన గ్రీన్ టీలో దూది ముంచి కను రెప్పల మీద అద్దుకోవాలి.
మూసిన కళ్లను మునివేళ్లతో సున్నితంగా మర్దన చేసుకున్నా, రక్తప్రసరణ పెరిగి కను రెప్పలు పెరుగుతాయి.
కను రెప్పలను ట్రిమ్ చేసుకున్నా, కుదుళ్లు ప్రేరేపితమై కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.
Updated Date - May 26 , 2024 | 02:42 AM