ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దొరికిన దొంగ

ABN, Publish Date - Nov 10 , 2024 | 10:31 AM

రత్నశెట్టి ఓ వ్యాపారి. అక్బర్‌ పాదుషాకి మాయమాటలు చెబుతూ, విలువైన కానుకలు పంపిస్తూ తన పరపతి పెంచుకునేవాడు. రత్నశెట్టి వ్యవహార శైలిని క్షుణ్ణంగా తెలుసుకున్న బీర్బల్‌, ఆయన గురించి అక్బర్‌కి చూచాయగా చెప్పినా పట్టించుకోక పోవడంతో సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు.

రత్నశెట్టి ఓ వ్యాపారి. అక్బర్‌ పాదుషాకి మాయమాటలు చెబుతూ, విలువైన కానుకలు పంపిస్తూ తన పరపతి పెంచుకునేవాడు.

రత్నశెట్టి వ్యవహార శైలిని క్షుణ్ణంగా తెలుసుకున్న బీర్బల్‌, ఆయన గురించి అక్బర్‌కి చూచాయగా చెప్పినా పట్టించుకోక పోవడంతో సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు.

రత్నశెట్టికి రాజధానిలో బోలెడు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన దగ్గర యుద్ధ విద్యలు తెలిసిన మెరికల్లాంటి మనుషులు ఉండేవారు. రత్నశెట్టి కఠినమైన పనులకు మాత్రమే వీరిని వినియోగిస్తూ ఉండేవాడు. వీరిని ధనవంతుల ఇళ్లు దోచుకోవడానికి కూడా వినియోగిస్తున్నాడని గూఢచారులు బీర్బల్‌కి ఉప్పందించారు.


ఓ ఏడాది అక్బర్‌ సామంత రాజులు పంపిన కప్పంతో ధనాగారం

నిండిపోయింది. అక్బర్‌ మంత్రులను సమావేశపరచి, ‘ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం

చేయండి’ అని ఆజ్ఞాపించాడు.

దురదృష్టవశాత్తు అదే రోజు రాత్రి పకడ్బందీ ప్రణాళికతో ధనాగారం ఎవరో లూటీ చేశారు. దొంగల ఆచూకీ తెలిపిన వారికి భారీ నజరానా ప్రకటించాడు పాదుషా. ఎన్ని ప్రయత్నాలు చేసినా, దొంగల ఆచూకీ తెలియరాలేదు. దాంతో అక్బర్‌ బీర్బల్‌ సలహా అడిగాడు.


రత్నశెట్టి ఈ మధ్య, తన తోట మధ్యలో చిన్నపాటి సొరంగం తన వీరులతో తవ్వించాడని వేగులు బీర్బల్‌కి మరో వార్త అందించారు. దీంతో బీర్బల్‌కి రత్నశెట్టి మీద ఉన్న అనుమానం రెట్టింపు అయింది.

‘‘జహాపనా, ధనాగారం లూటీ అయిన పద్ధతి చూస్తే, దొంగల నాయకుడు చాలా తెలివైనవాడని ఇట్టే అర్థం అవుతోంది. వాణ్ణి పట్టుకోడానికి అంతే తెలివిగా వ్యవహరించాలి’’ అన్నాడు.

అక్బర్‌, బీర్బల్‌ మారువేషాలు ధరించి, రాత్రి వేళల్లో రాజధాని నగరంలో సంచారం చేయసాగారు. ఓరోజు రాత్రి వారిద్దరు రత్నశెట్టి ఉండే వీధిలో అడుగు పెట్టారు. తమ ముందుగా వెళ్తున్న కొంతమంది ముసుగు మనుషులను చూశారు. నిండుగా ఉన్న సంచులతో, రత్నశెట్టి ఇంటి దగ్గర ఆగడం చూశారు. కొంతసేపటికి ముసుగు మనుషులు సంచులు లేకుండా, ఖాళీ చేతులతో బయటికి వచ్చి, అదృశ్యమయ్యారు. అదే క్షణంలో రత్నశెట్టి తలుపు మూస్తూ కనిపించాడు.


జరిగినదంతా చూసి అక్బర్‌కి విపరీతమైన కోపం వచ్చింది. బీర్బల్‌ సలహాతో తోట మధ్యలో తవ్వించడంతో, సొరంగం బయట పడింది. ధనాగారంలో దోచుకోబడ్డ సొమ్మంతా బయట పడింది. రత్నశెట్టి జీవిత ఖైదీగా శిక్షింపబడ్డాడు.

‘‘పాదుషాకు రత్నశెట్టి మీద అనుమానం వచ్చేలా ఎలా చేయగలిగారు?’’ అంటూ బీర్బల్‌ భార్య ప్రశ్నించింది.

బీర్బల్‌ నవ్వి, ‘‘మారు వేషాలలో మేమిద్దరం రత్నశెట్టి ఇల్లున్న వీధిలోకి ప్రవేశించగానే, ముసుగు వేషాలు ధరించి రత్నశెట్టి ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లేలా కొందరిని ముందుగానే పురమాయించాను.


నేను రాజుగారిని సందులోకి తీసుకుని వెళ్ళేలోపుల, వాళ్లు రత్నశెట్టి ఇంటిని గట్టిగా తట్టి, చల్లగా జారుకున్నారు. తలుపు చప్పుడుకు మెలకువ వచ్చిన రత్నశెట్టి తలుపు తీసి, ఎవ్వరూ లేకపోవడంతో తలుపు వేసుకున్నాడు. దీనిని సందు చివరినుంచి చూసి, దొంగలు డబ్బు తస్కరించి రత్నశెట్టికి ఇస్తున్నట్లు అనుమానించారు. అంతకు ముందే, రత్నశెట్టి తోటలో సొరంగం తవ్వించినట్టు వేగులు నాకు చెప్పారు. దాంతో ఆ సొరంగం బయటపడి రత్నశెట్టికి శిక్ష పడింది’’ అన్నాడు.

బీర్బల్‌ తెలివికి భార్య మురిసిపోయింది.

- పాట్నీడి వీ. వీ. సత్యనారాయణ

Updated Date - Nov 10 , 2024 | 10:31 AM