Navya : మీకు తెలుసా?
ABN, Publish Date - May 20 , 2024 | 11:53 PM
కొమ్ములు కొమ్మల్లా ఉండే ఈ జింకను ‘రెన్ డీర్’ అని పిలుస్తారు. ఉత్తర అమెరికాలో ఉండే వీటిని కరిబు(ఫ్రెంచ్ భాషలో) అంటారు. ఇవి ఆర్కిటిక్, సైబీరియా, ఉత్తర యూరప్ దగ్గరి ప్రాంతాల్లో నివసిస్తాయి
కొమ్ములు కొమ్మల్లా ఉండే ఈ జింకను ‘రెన్ డీర్’ అని పిలుస్తారు. ఉత్తర అమెరికాలో ఉండే వీటిని కరిబు(ఫ్రెంచ్ భాషలో) అంటారు. ఇవి ఆర్కిటిక్, సైబీరియా, ఉత్తర యూరప్ దగ్గరి ప్రాంతాల్లో నివసిస్తాయి.
మగ జంతువులు కొట్లాడుకున్నప్పుడు కొమ్ములతోనే ఫైట్ ఉంటుంది.
దీని శరీరంపై రెండు కోట్స్ ఉన్నట్లుంటాయి. లోపల ఉన్నితో అయితే పైన జుట్టు కనిపిస్తాయి.
రష్యాలో కొన్ని లక్షల రెన్‌డీర్స్ ఉంటాయి. గుంపులు గుంపులుగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తాయి.
ఆడ, మగ జంతువులు రెండింటికీ కొమ్ములు ఉంటాయి.
యూరోపియన్ రెన్‌డీర్స్ తక్కువ దూరానికి వలసలు వెళ్తాయి. గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి. రోజుకు కనీసం 55 కిలోమీటర్లు వెళ్తాయి. ఆగుతూ, నడుస్తూ ఏడాదికి 5000 కి.మీ. ప్రయాణిస్తాయివి. ఇవి ఒకచోట కుదురుగా ఉండవు. మంచి ఆహారం, ప్రాంతం కోసం వెళ్తూనే ఉంటాయి.
యూర్‌పలో కొందరు చలిలో దూరప్రాంతాలకు వెళ్లాలనుకుంటే బరువును వీటిపై మోసుకెళ్తుంటారు.
వీటిలో ఎనిమిది రకాల జాతులు ఉన్నాయి.
పచ్చిక, మొక్కలు, పండ్లను తిని బతుకుతాయి. వీటి జీవనకాలం కనీసం 15 ఏళ్లనుంచి 20 ఏళ్ల వరకూ ఉంటుంది.
ఇవి నదులు అడ్డు వచ్చినప్పుడు అతవేగంగా ఈతకొట్టగలవు.
Updated Date - May 21 , 2024 | 12:01 AM