Technology : ‘లాగిటెక్’ కొత్త కీ బోర్డు
ABN, Publish Date - Jun 22 , 2024 | 01:12 AM
లాగిటెక్ కొత్త కీబోర్డును ప్రకటించింది. పదేళ్ళ నాటి కీస్-టు-గో కీబోర్డ్ స్థానే కొత్తది ‘కీస్-టు-గో 2’ ఈ నెల మార్కెట్లోకి వస్తోంది.
లాగిటెక్ కొత్త కీబోర్డును ప్రకటించింది. పదేళ్ళ నాటి కీస్-టు-గో కీబోర్డ్ స్థానే కొత్తది ‘కీస్-టు-గో 2’ ఈ నెల మార్కెట్లోకి వస్తోంది. డిజైన్ నుంచి ఫీచర్ల వరకు అన్నింటినీ ఆధునీకరించారు. లాగిటెక్ కీబోర్డ్ మొదట 2014లో విడుదలైంది. రెండేళ్ళ క్రితం కొద్దిపాటి మార్పులు కూడా చేశారు. ఇప్పుడు మరిన్ని మార్పులతో విడుదల అవుతోంది. ప్లాస్టిక్ డెక్‌పై సక్రమంగా కీ, స్విచ్‌లు ఉన్నాయి.
కీ బోర్డ్‌పై పనిచేస్తునప్పుడు దాని చుట్టూ ఉన్న కవర్ మూసుకునేలా ఏర్పాటు చేశారు. తయారీలో 36 శాతం మేర రీసైక్లిడ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించారు. సూపర్ థిన్ అంటే 4.57 ఎంఎం ఉంది. మూసినప్పుడు 8.77 ఎంఎం అంటే కవర్‌తో కలిపి ఉంటుంది. కాయిన్ సెల్ బ్యాటరీలతో పనిచేస్తుంది. 36 నెలలు వస్తుంది. లాగిటెక్‌కు చెందిన ‘ఈజీ-స్విచ్’ కీ సపోర్ట్ ఉంది. వివిధ డివైజ్‌ల మధ్య స్వైపింగ్ అవకాశం ఉంది. రమారమి 80 డాలర్లకు రెండు వెరైటీలు అంటే ఒకటి యాపిల్ డివైజ్‌ల కోసం మరొకటి అన్ని రకాలకు ఉపయోగపడేలా రూపొందించారు. లిలాక్, పేల్ గ్రే, గ్రాఫైట్ కలర్‌వేస్ రంగుల్లో రెండు వెరైటీలు లభ్యమవుతాయి.
Updated Date - Jun 22 , 2024 | 01:12 AM