ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lung Cancer Awareness : లంగ్స్‌కు లక్ష ముప్పులు

ABN, Publish Date - Nov 05 , 2024 | 12:42 AM

ఊపిరితిత్తులకు ప్రధమ శత్రువు ధూమపానం ఒక్కటే కాదు. వాతావరణ కాలుష్యం మొదలు ఎన్నో రకాల ముప్పులు లంగ్స్‌కు పొంచి ఉంటాయి. వాటిని తొలగించుకుంటూ ప్రధానంగా లంగ్‌ కేన్సర్‌ ముప్పు నుంచి లంగ్స్‌ను కాపాడుకోవడం అవసరం.

లంగ్‌ కేన్సర్‌ అవేర్‌నెస్‌ మంత్‌

ఊపిరితిత్తులకు ప్రధమ శత్రువు ధూమపానం ఒక్కటే కాదు. వాతావరణ కాలుష్యం మొదలు ఎన్నో రకాల ముప్పులు లంగ్స్‌కు పొంచి ఉంటాయి. వాటిని తొలగించుకుంటూ ప్రధానంగా లంగ్‌ కేన్సర్‌ ముప్పు నుంచి లంగ్స్‌ను కాపాడుకోవడం అవసరం.

ప్రపంచంలో రెండవ అత్యంత సాధారణ కేన్సర్‌... లంగ్‌ కేన్సర్‌. లంగ్‌ కేన్సర్‌ ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువ. కానీప్రారంభంలోనే లక్షణాలను గుర్తించి, చికిత్స మొదలుపెడితే ఈ కేన్సర్‌ నుంచి సురక్షితంగా బయటపడవచ్చు. అంతకంటే ముఖ్యంగా ఈ కేన్సర్‌కు గురి కాకుండా ఉండడం కోసం ముందస్తు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. లంగ్‌ కేన్సర్‌ ముప్పును తెచ్చిపెట్టే కారకాలు కోకొల్లలు. అవేంటంటే...

  • గాలి కాలుష్యం: అత్యధిక ట్రాఫిక్‌, పారిశ్రామిక కార్యకలాపాలు జరుగుతూ ఉండే నగరాల్లో గాలి కలుషితమవుతూ ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో ధూళి కణాలు, రసాయనాలు లాంటివి కలిసిపోయి ఉంటాయి. ఇవి శ్వాసకోస సమస్యలు, కేన్సర్‌ ముప్పును పెంచుతాయి. నైట్రోజన్‌ డయాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌లు దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల్లోని కణజాలాన్ని దెబ్బతీసి, కేన్సర్‌ వ్యాధికి ఆస్కారం కల్పిస్తాయి. కాబట్టి ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టిన ప్రతిసారీ మాస్క్‌ ధరించాలి.

  • సెకండ్‌హ్యాండ్‌ స్మోక్‌: ధూమపానం అలవాటు లేకపోయినా, ఆ అలవాటున్న వాళ్లు వదిలే పొగ పీల్చడం వల్ల కూడా లంగ్‌ కేన్సర్‌ సోకుతుంది. సిగరెట్‌ పొగలోని రసాయనాలు ఊపిరితిత్తుల్లోని కణాలను దెబ్బతీసి కేన్సర్‌ ముప్పును పెంచుతాయి. సెకండ్‌హ్యాండ్‌ స్మోక్‌కు క్రమంతప్పక బహిర్గతమయ్యేవాళ్లలో లంగ్‌ కేన్సర్‌ ముప్పు 30 శాతం మేరకు ఉంటుంది.

  • రాడాన్‌ గ్యాస్‌: ఈ అణుధార్మిక వాయువు సహజసిద్ధంగానే గాలిలో కలిసిపోయి ఉంటుంది. వాసన లేని ఈ వాయువును ప్రత్యేకమైన పరీక్షతో తప్ప పసిగట్టే వీలుండదు. ఈ వాయువు, లంగ్‌ కేన్సర్‌కు రెండవ ప్రధాన కారణం. కాబట్టి ఇంట్లో రాడాన్‌ గ్యాస్‌ పేరుకుపోకుండా, గాలి ధారాళంగా చొరబడేలా చూసుకోవాలి. ఎగ్జాస్ట్‌ ఫ్యాన్స్‌ వాడుకోవాలి.

  • వృత్తుల్లో: వృత్తిలో భాగంగా ప్రమాదకరమైనరసాయనాలు, అణువులకు బహిర్గతమయ్యేవారు కూడా లంగ్‌ కేన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. గనుల్లో పని చేసేవారు, భవన నిర్మాణ పనులు చేసేవారు, ఫ్యాక్టరీ వర్కర్లు యాస్‌బెస్టాస్‌, సిలికా డస్ట్‌, ఫార్మాల్డిహైడ్‌ రసాయనాలకు బహిర్గతమవుతూ ఉంటారు. ఈ పదార్థాలు లంగ్స్‌లోకి చేరుకకుని, తీవ్రమైన ఇరిటేషన్‌ తలెత్తేలా చేసి, దీర్ఘకాలంలో లంగ్స్‌ గట్టిపడి, కేన్సర్‌కు దారి తీయడానికి దోహదపడతాయి.

  • స్మోకింగ్‌, వేపింగ్‌: ధూమపానంతో లంగ్‌ కేన్సర్‌ సోకుతుందనే విషయం అందరికీ తెలిసిందే! ధూమపానంతో కేన్సర్‌ కారకాలు లంగ్స్‌లోకి నేరుగా ప్రవేశించి అక్కడి నుంచి రక్తప్రవాహంలోకి చేరుకుంటాయి. ధూమపానంతో లంగ్స్‌లోని కణాలు దెబ్బతిని ఉత్పరివర్తనాలకు దారి తీస్తాయి. వేప్స్‌లోని ద్రవాల్లోని రసాయనాలు ఇన్‌ఫ్లమేషన్‌కు దారి తీస్తాయి.

  • కుటుంబ చరిత్ర: కుటుంబ చరిత్రలో కేన్సర్‌ ఉన్నప్పుడు, వారి సంతానానికి లంగ్‌ కేన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. టాక్సిన్లను ప్రాసెస్‌ చేయడంలో, దెబ్బతిన్న కణాలను మరమ్మతు చేయడంలో జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యంగా సంక్రమించిన జన్యు ఉత్పరివర్తనాలు లంగ్‌ కేన్సర్‌ వృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి.

  • తీవ్ర శ్వాసకోస ఇన్‌ఫెక్షన్లు: బ్రాంఖైటిస్‌, న్యుమోనియాలతో దీర్ఘకాలంలో లంగ్స్‌ బలహీనపడతాయి. ఇలాంటి ఇన్‌ఫెక్షన్లతో ఊపిరితిత్తుల్లోని కణజాలం దెబ్బతినడం వల్ల, పలురకాల వ్యాధులు, మరీ ముఖ్యంగా లంగ్‌ కేన్సర్‌ ముప్పు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మొనరీ డిసీజ్‌తో బాధపడేవాళ్ల ఊపిరితిత్తులు అప్పటికే బలహీనపడిపోయి ఉంటాయి కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లకు లంగ్‌ కేన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

Updated Date - Nov 05 , 2024 | 12:42 AM