makeup kit : కిట్ టిప్‌టాప్‌గా..
ABN, Publish Date - Sep 09 , 2024 | 04:39 AM
మేకప్ కోసం ఉపయోగించే సాధనాలు నాణ్యంగా ఉన్నప్పుడే, సౌకర్యంగా మేకప్ వేసుకోవడం సాధ్యపడుతుంది. మేకప్ ఉత్పత్తులతో ముఖ చర్మం దెబ్బ తినకుండా ఉండాలన్నా, వేసుకున్న మేకప్ చెక్కుచెదరకుండా ఉండాలన్నా కొన్ని నాణ్యమైన సాధనాలకు తప్పనిసరిగా మేకప్ కిట్‌లో చోటు కల్పించాలి.
మేకప్
మేకప్ కోసం ఉపయోగించే సాధనాలు నాణ్యంగా ఉన్నప్పుడే, సౌకర్యంగా మేకప్ వేసుకోవడం సాధ్యపడుతుంది. మేకప్ ఉత్పత్తులతో ముఖ చర్మం దెబ్బ తినకుండా ఉండాలన్నా, వేసుకున్న మేకప్ చెక్కుచెదరకుండా ఉండాలన్నా కొన్ని నాణ్యమైన సాధనాలకు తప్పనిసరిగా మేకప్ కిట్‌లో చోటు కల్పించాలి.
క్రమో స్టిక్స్: చర్మం నునుపుగా, బిగుతుగా ఉంటే, మేకప్ ముఖం మీద సమంగా పరుచుకుంటుంది. కాబట్టి చర్మపు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, మృదువుగా, బిగుతుగా మార్చే క్రయో స్టిక్స్‌తో మేకప్‌కు ముందు చర్మాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీది సన్నని గీతలు తొలగిపోయి, ముడతలు లేని నున్నని చర్మం సొంతమవుతుంది.
మేకప్ అప్లికేటర్: అప్లికేటర్ మేకప్ ఉత్పత్తిని పీల్చుకునేలా ఉండకూడదు. మేకప్‌ను ముఖ చర్మం మీద బ్లెండ్ చేసేలా ఉండాలి. కాబట్టి కాంపాక్ట్ అద్దుకోవడం కోసం సాధారణ స్పాంజ్‌కు బదులుగా మేకప్ అప్లికేటర్‌ను ఎంచుకోవాలి. నాణ్యమైనదాన్ని ఎంచుకుంటే ఎక్కువ కాలం మన్నడంతో పాటు ఫలితం కూడా మెరుగ్గా ఉంటుంది.
ఫౌండేషన్ బ్రష్: ఫౌండేషన్ అద్దుకోవడానికి డ్యుయల్ ఎండెడ్ బ్రష్‌ను ఉపయోగించడం వల్ల ఫౌండేషన్ ముఖమంతా సమంగా పరుచుకుంటుంది. రెండు పరిమాణాల్లో ఉండే ఈ బ్రష్‌ను అవసరాన్ని బట్టి ముఖంలోని వేర్వేరు ప్రదేశాల్లో ఉపయోగించుకోవచ్చు. బుగ్గల మీద బ్లషర్ కోసం పెద్ద బ్రష్‌నూ, కనురెప్పల మీద ఐషాడో అప్లికేషన్ కోసం చిన్న బ్రష్‌నూ వాడుకోవాలి.
ఐల్యాష్ కర్లర్: కనురెప్పలు వింజామరల్లా ఒత్తుగా మారాలంటే ఐల్యాష్ కర్లర్‌ను తప్పక ఉపయోగించాలి. కనురెప్పల్లోని వెంట్రుకలన్నీ సమంగా వంపు తిరిగడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది.
బాడీ బ్రష్: బాడీ బ్రాంజర్ అద్దుకోడానికి స్పాంజ్, సాధారణ బ్రష్‌లకు బదులుగా బాడీ బ్రష్‌ను ఉపయోగించాలి. ఇలా చేస్తే బ్లష్‌తో చర్మం సహజసిద్ధ మెరుపును సంతరించుకుంటుంది.
బ్లాటింగ్ పేపర్స్: మేకప్ చెదిరిపోకుండా అదనపు మేకప్ మెరుపును తొలగించడానికి బ్లాటింగ్ పేపర్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటినెప్పుడూ వెంట ఉంచుకోవాలి.
మేకప్ రిమూవర్ ప్యాడ్స్: రీయూజబుల్ మైక్రోఫైబర్‌తో తయారైన మేకప్ రిమూవర్ ప్యాడ్స్‌తో చర్మ రంధ్రాల్లో ఇంకిపోయిన మేకప్ సైతం చక్కగా తొలగిపోతుంది.
Updated Date - Sep 09 , 2024 | 04:40 AM