ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెరుపు తీగ

ABN, Publish Date - Sep 04 , 2024 | 04:15 AM

‘‘చక్కని ఆకృతిని పొందడం, దాన్ని అలాగే కొనసాగించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. అందుకు ఎంతో అంకితభావం, క్రమశిక్షణ అవసరం. క్రమంతప్పని వ్యాయామాలు, కచ్చితమైన ఆహార నియమాలు...

సెలబ్‌ ఫిట్‌

అందంగా కనిపిస్తే సరిపోదు... ఆరోగ్యంగానూ ఉండాలంటుంది బాలీవుడ్‌ తార దిశా పటాని. అద్భుతమైన అభినయమే కాదు... చూడచక్కని రూపంతో వరుస అవకాశాలు దక్కించుకొంటున్న దిశ... తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ గురించి ఇలా చెబుతోంది.

‘‘చక్కని ఆకృతిని పొందడం, దాన్ని అలాగే కొనసాగించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. అందుకు ఎంతో అంకితభావం, క్రమశిక్షణ అవసరం. క్రమంతప్పని వ్యాయామాలు, కచ్చితమైన ఆహార నియమాలు పాటించాను కాబట్టే అభిమాన నటిగా ఇంతటి పేరు తెచ్చుకోగలిగాను.

రోజుకు రెండుసార్లు

చదునైన పొట్ట, బలమైన చేతులు నాకు ప్లస్‌ పాయింట్లు. ఇలాంటి ఫిట్‌నెస్‌ దక్కించుకోవాలంటే రెండింతలు కష్టపడాలి. నేను రోజుకు రెండుసార్లు జిమ్‌కు వెళ్తాను. ఉదయం గుండె వేగాన్ని పెంచే కార్డియో, సాయంత్రం బరువులతో కూడిన వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తాను. డ్యాన్సింగ్‌, కిక్‌బాక్సింగ్‌, జిమ్నాస్టిక్స్‌ కూడా నా వ్యాయామంలో భాగాలే. సైకిల్‌ తొక్కడం, ట్రెడ్‌మిల్‌ మీద పరుగెత్తడం నాకు నచ్చదు. వాటికి బదులుగా డ్యాన్స్‌ చేస్తాను. అదీ అత్యధిక తీవ్రతతో కూడిన హై ఇంటెన్సిటీ డ్యాన్సులు. వాటితో శరీరం మొత్తానికీ చక్కని వ్యాయామం దొరుకుతుంది. సాయంత్రం వెయిట్స్‌ చేస్తాను. దీనివల్ల శరీరాకృతి చక్కగా మారుతుంది. బరువులతో కూడిన వ్యాయామాలు చేస్తే కండలు తిరిగి, అందం పోతుంది అనుకుంటాం. కానీ ఇది అపోహ మాత్రమే! ముఖ్యంగా మహిళలు బరువులతో కూడిన వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం.


నియమిత ఆహారశైలి...

మనం తినే ఆహారం మీదే మన ఆకారం ఆధారపడి ఉంటుంది. రోజుకు రెండుసార్లు వ్యాయామాలు చేస్తాను కాబట్టి నా ఆహారంలో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను. అలాగే ప్రతి వర్కవుట్‌లోనూ సరిపడా నీళ్లు తాగుతాను. నా ఆహారంలో బ్రౌన్‌ రైస్‌, పప్పు, కూరగాయలు, పండ్ల రసాలు ఉంటాయి. ఉదయం తృణధాన్యాలు, పాలు తీసుకుంటాను. బాదం, వేరుశనగపప్పు, తాజా పండ్లు తింటాను. వారంలో ఒకరోజు నాకు నచ్చినదల్లా తినేస్తాను.

వ్యాయామానికి ముందు...

వ్యాయామం చేసినంతసేపు శక్తి తగ్గకుండా నిలకడగా కొనసాగాలంటే, దానికి ముందు అందుకు తోడ్పడే పదార్థాలు తినాలి. మొదట్లో ఖాళీ కడుపుతో, ఏమీ తినకుండానే వ్యాయామం చేసే అలవాటు ఉండేది. తిని వ్యాయామాలు చేస్తే, కడుపు బరువుగా ఉంటుందనే భావనతో అలా చేసేదాన్ని. అయితే వ్యాయామానికి ముందు ఎంతోకొంత పోషకభరిత ఆహారం తినడం అవసరం అని తర్వాత తెలుసుకున్నాను. పన్నీర్‌ లాంటి మాంసకృత్తులతో కూడిన ఆహారం వ్యాయామానికి ముందు తప్పక తినాలి. అలాగే వ్యాయామం ముగిసిన తర్వాత అలసిన కండరాలు బలం పుంజుకోవడం కోసం కూడా మాంసకృత్తులు అవసరమే.


ఇవీ అవసరమే!

ఆహారంలో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, పీచు సమపాళ్లలో ఉండాలి. ఇందుకోసం నేను అవన్నీ ఉండే పదార్థాలన్నీ మధ్యాహ్న భోజనంలో ఉండేలా చూసుకుంటాను. భోజనంలో అన్నం కూడా తింటాను. రాత్రివేళ భోజనంలో ఎక్కువ మాంసకృత్తులు ఉండేలా చూసుకుంటాను. రోజుకు ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్ర పోతాను. నిద్రతో శరీరం పునరుత్తేజం పొందుతుంది. తీసుకున్న ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకునేది నిద్రలోనే.

ఇవి తప్పనిసరి...

వ్యాయామాలకు తోడ్పడే వస్తువులన్నీ జాగ్రత్తగా ఎంచుకోవాలి. నా వర్కవుట్‌ బ్యాగ్‌లో బ్రూనోమార్స్‌ పాటలు వినడం కోసం ఇయర్‌ఫోన్స్‌, నీళ్ల బాటిల్‌ తప్పనిసరిగా ఉంటాయి. మన పాదాలను బట్టి సరైన షూ ఎంచుకోవాలి. ఇక వ్యాయామం కోసం ధరించే దుస్తులు సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ, నప్పే రంగులు ఎంచుకోవాలి. సాగే గుణం ఉండి, చమటను పీల్చుకునే దుస్తులే ధరించాలి.


ఎంపిక ఇలా...

అందరి శరీర తీరులూ ఒకేలా ఉండవు. ఒకరికి నప్పిన వ్యాయామాలు అందరికీ నప్పుతాయని చెప్పలేం. కాబట్టి తీసుకునే క్యాలరీలు, జీవనశైలి, శరీర తీరులను బట్టి వ్యాయామాలను ఎంచుకోవాలి. కొవ్వు శరీరంలో పేరుకునే ప్రదేశాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరికి పొట్ట, పిరుదుల్లో కొవ్వు పేరుకోవచ్చు. మరికొందరికి నడుము పైభాగం లావుగా ఉండవచ్చు. ఇలాంటి భిన్న శరీర తత్వాలు కలిగిన వాళ్లందరికీ ఒకే రకమైన వ్యాయామాలు ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాబట్టి నడుము కింద భాగంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవాళ్లు కాళ్లు, పిరుదులు, నడుముకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. నడుము పైభాగంలో... అంటే, చేతులు, భుజాలు, ఛాతీ, మెడ ప్రదేశాలు లావుగా ఉన్నవాళ్లు బరువులతో కూడిన వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. శరీరం మొత్తానికి వ్యాయామాన్ని అందించే వర్కవుట్లు రెండు రకాల వాళ్లకూ ఉపయోగకరమే.


వారంలో ఐదు రోజులు...

క్రమంతప్పక జిమ్‌కు వెళ్లాలని ఉన్నా, అన్నిసార్లూ వీలుపడకపోవచ్చు. అయితే వారంలో కనీసం 5 రోజులపాటు జిమ్‌కు వెళ్లగలిగితే వ్యాయామ ఫలం దక్కుతుంది. రెండు రోజులకు మించి విరామం ఇచ్చినా శరీరం ఫిట్‌నె్‌సను కోల్పోతుంది. కాబట్టి వీలైతే వారానికి ఒక్కరోజు లేదా తప్పనిసరి పరిస్థితుల్లో వారానికి రెండు రోజులు వ్యాయామానికి విరామం ఇవ్వవచ్చు. అలాగే ఆరోగ్యం అనుకూలించని సందర్భాల్లో ఎక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలకు బదులు తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. సాఽధ్యమైనంతవరకూ వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగంగా భావించడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి ఆలోచన వ్యాయామం పట్ల ఆసక్తి కొనసాగడానికి తోడ్పడుతుంది.

Updated Date - Sep 04 , 2024 | 04:15 AM

Advertising
Advertising