ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mounashree Mallick : అలాంటి పాటలురాసేందుకు ఇష్టపడతా!

ABN, Publish Date - Sep 15 , 2024 | 05:09 AM

దాదాపు 100 సినిమా పాటలు.. 750కి పైగా సీరియల్స్‌కి పాటలు రాసిన గీత రచయిత ఆయన. ఇటీవలే ‘ఇండియా ఫైల్స్‌’ చిత్రం కోసం ఆయన రాసిన ‘తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని... కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషి’ పాట అనేక మంది హృదయాలను గెలుచుకుంది. సాహిత్య విలువలు ఉన్న పాటలు రాయడానికి ఇష్టపడే ఆ రచయిత మౌనశ్రీ మల్లిక్‌.

దాదాపు 100 సినిమా పాటలు.. 750కి పైగా సీరియల్స్‌కి పాటలు రాసిన గీత రచయిత ఆయన. ఇటీవలే ‘ఇండియా ఫైల్స్‌’ చిత్రం కోసం ఆయన రాసిన ‘తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని... కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషి’ పాట అనేక మంది హృదయాలను గెలుచుకుంది. సాహిత్య విలువలు ఉన్న పాటలు రాయడానికి ఇష్టపడే ఆ రచయిత మౌనశ్రీ మల్లిక్‌. ‘‘ఇండియా ఫైల్స్‌’’ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ఆయనతో ‘నవ్య’ ముచ్చటించింది.

  • మీ సాహిత్య ప్రయాణం ఎలా మొదలైంది?

మాది వరంగల్‌లోని వర్ధన్నపేట. నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికైనా సినీ పాటల రచయితగా మారాలనే సంకల్పంతో రచనలు చేసేవాడిని. జర్నలిస్టుగా కొన్నాళ్లు పనిచేశాను. నేను రాసిన ‘దిగంభర’, ‘గరళం’, ‘తప్తసృహ’ కవితా సంకలనాలకు 30కి పైగా పురస్కారాలు వచ్చాయి. సినిమా పాటలు రాయాలని ఇండస్ట్రీకి వచ్చి.. మొదట సీరియల్స్‌కు పని చేశాను. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ప్రోత్సాహంతో ‘కోయిలమ్మ’ అనే సీరియల్‌లో 550కి పైగా పాటలు రాశాను. ‘కృష్ణ తులసి’ అనే సీరియల్‌లో 200కి పైగా భక్తి పాటలు రాశాను. ఆ తర్వాత 2010లో ‘చేతిలో చెయ్యేసి’ సినిమాలో ‘చిలిపి చిలిపి’ అనే పాటను రాశాను. ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాల్లో.. 100కు పైగా పాటలు రాశాను.

  • మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాటలు...

నేను రాసిన పాటల్లో ‘చేతిలో చెయ్యేసి’ చిత్రంలోని పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ‘గుడ్‌ మార్నింగ్‌’ చిత్రంలో నేను రాసిన ‘ఎదలో నదిలాగ కదిలిన భావాలు’ పాటను ఆలపించినందుకు గీతా మాధురికి నంది అవార్డు వచ్చింది. ‘ఐపీసీ సెక్షన్‌ భార్య బంధు’.. ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’.. ‘చెంబు చిన సత్యం’ సినిమాల్లోని పాటలకు సాహితీపరమైన ప్రశంసలు వచ్చాయి. ‘ఇండియా ఫైల్స్‌’ చిత్రంలో రాసిన ‘తిరిగి చూడు’, ‘జై ఇండియా’ సాంగ్‌కు విశేషమైన స్పందన వస్తోంది.

  • గుర్తుండిపోయే ప్రశంసలు

నా ఆరాధ్య దైవం..దివంగత గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం.. సంగీత దర్శకులు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి, సాలూరి కోటేశ్వరరావు (కోటి)లు నా పాటల్లోని సాహిత్యాన్ని మెచ్చుకోవడం.

  • నటుడిగానూ కొన్ని సినిమాల్లో చేసినట్లున్నారు....

అవునండీ! నాలుగైదు చిత్రాల్లో నటించాను. అదీ దర్శక నిర్మాతల కోరిక మేరకు.

  • ఎలాంటి పాటలు రాయడమంటే ఇష్టం?

రచనకు అలాంటి పరిధులు ఏవీ పెట్టుకోలేదు. అవసరానికి తగినట్లు అన్ని రకాల పాటలు రాయాలనుంది. సాహిత్య విలువలు ఉన్న పాటలు రాసేందుకు ఎక్కువ ఇష్టపడతా.

  • ‘ఇండియా ఫైల్స్‌’ చిత్రం గురించి చెప్పండి?

దేశంలోనే కల్చరల్‌ డీ.ఎన్‌.ఏ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న మొదటి చిత్రమిది. సామాజిక స్పృహను మేల్కొలిపేలా ఉంటుంది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్య లు.. వాటి పరిష్కారాలను ఇందులో చూపించాము. బొమ్మకు మురళీ దర్శకత్వ పటిమ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్‌ కథానాయకుడి పాత్రకు జీవం పోశారు. ఇందులో ఆయన పోషించిన పాత్ర గుర్తుండిపోతుంది.

- మోహన్‌ వర్మ

Updated Date - Sep 15 , 2024 | 05:09 AM

Advertising
Advertising