ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మై లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌

ABN, Publish Date - May 05 , 2024 | 01:10 AM

సినీ రంగంలో రెండు దశాబ్దాలు హీరోయిన్‌గా కొనసాగటం అంత సులభమైన విషయం కాదు. అలాంటి అరుదైన హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు.

సినీ రంగంలో రెండు దశాబ్దాలు హీరోయిన్‌గా కొనసాగటం అంత సులభమైన విషయం కాదు. అలాంటి అరుదైన హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు.

కొవిడ్‌ సమయంలో పెళ్లి చేసుకుని... ఆ తర్వాత మళ్లీ కొన్ని ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కాజల్‌ను ‘నవ్య’ పలుకరించింది. ఆ విశేషాలలోకి వెళ్తే...

మీరు మీడియా ముందుకు వచ్చి చాలా కాలమయింది. ఎలా ఉన్నారు? పెళ్లి తర్వాత జీవితం ఎలా మారిపోయింది?

మా అబ్బాయి... ఫ్యామిలీ... షూటింగ్‌లు... ఈ మూడింటితో చాలా బిజీగా ఉంటున్నా. ప్రస్తుతం ‘ఇండియన్‌-2’, ‘సత్యభామ’ చిత్రాలు పూర్తి చేశా. ఇంకొన్ని షూటింగ్‌లు చివరి దశలో ఉన్నాయి. పెళ్లికి ముందు కేవలం షూటింగ్‌లపైనే దృష్టి ఉండేది. ఒక షూటింగ్‌ నుంచి మరొక షూటింగ్‌కు వెళ్తూ ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. కుటుంబం కోసం సమయమే ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. షూటింగ్‌లు.. ఫ్యామిలీ.. మా బాబు... మై లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌.

ఒక వర్కింగ్‌ యంగ్‌ మదర్‌గా మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయి?

పిల్లలు పుట్టిన తర్వాత ఒక మహిళ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముందుగా తన జీవితం మారిపోయిందనే విషయాన్ని గమనించాలి. దానిని అంగీకరించాలి. ఇదొక పెద్ద సవాల్‌. ఆ తర్వాత పిల్లల అవసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారికి అవసరమైనవి గుర్తుంచుకొంటూ ఉండాలి. ఇవి సహజంగానే కొంత ఆందోళన , ఒత్తిడి కలగిస్తాయి. అంతే కాదు... నాకు తెలిసి వర్కింగ్‌ యంగ్‌ మదర్స్‌లో కొంత గిల్ట్‌ ఉంటుంది. పనికి వెళ్లినప్పుడు... బేబీని సరిగ్గా చూసుకోవటం లేదనే గిల్ట్‌. బేబీతో సమయం గడుపుతున్నప్పుడు... పని ఎగ్గొడుతున్నామనే గిల్ట్‌. ఈ భావోద్వేగాల సయ్యాటలో ఏర్పడే సందిగ్ధత పెద్ద సవాల్‌గా మారుతుంది. నాకైతే రోజుకు 24 గంటలు చాలవనిపిస్తోంది!

మీరు మంచి ఆర్గనైజరా?

కాదు. మా ఆయన మంచి ఆర్గనైజర్‌. నేను కూడా నెమ్మదిగా నేర్చుకుంటున్నా. గతంలో కేవలం నా జీవితాన్ని, నా షెడ్యూల్స్‌ను ప్లాన్‌ చేసుకుంటే సరిపోయేది. మిగిలినవారు నా షెడ్యూల్స్‌ ఆధారంగా ప్లాన్‌ చేసుకొనేవారు. కానీ ఇప్పుడు నేను నా షెడ్యూల్స్‌ మాత్రమే కాదు, పిల్లాడినీ, కుటుంబాన్నీ చూసుకోవాలి.దీనికోసం కనీసం రెండు వారాల ముందే నా షెడ్యూల్స్‌ అన్నీ ఫిక్స్‌ చేసుకొంటా.


మీ బలాలు, బలహీనతలేమిటి?

తల్లి... భార్య... నటి... ఎంటర్‌ప్రెన్యూర్‌... ఇలా రకరకాల పాత్రలను ఒకేసారి పోషించగలగటమనేది నా బలం. అయితే ఈ మధ్యకాలంలో మా అబ్బాయి విషయంలో కొంత ఆందోళన, భయం పట్టుకున్నాయి. వాడు లేకుం డా షూటింగ్‌కు కానీ, ఏదైనా పని మీద కానీ వెళ్తే... వాడు ఎలా ఉన్నాడో అనే ఆలోచనలు భయపెడుతున్నాయి. అందువల్ల ఎప్పటికప్పుడు ఇంటికి ఫోన్‌ చేస్తూ ఉంటా. గతంలో నాకు ఇలాంటి ఆందోళనలు లేవు. రిలాక్స్‌డ్‌గా ఉండేదాన్ని. నా మీద నాకు నమ్మకం ఉండేది. బహుశా యంగ్‌ మదర్స్‌ అందరికీ ఈ ఆందోళన ఉంటుందనుకొంటా.

కెరీర్‌ బాగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా పెళ్లెందుకు చేసుకున్నారు?

జీవితాన్ని ఎలా జీవించాలనే విషయంలో చిన్నప్పటి నుంచి నాకు అనేక కలలు ఉండేవి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచించే సమయం కూడా లేకుండా పోయింది. ఒక దశలో ఏడాదికి 9 సినిమాలు చేశాను. ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. నా గురించి నేను ఆలోచించుకోవటానికి కూడా సమయం ఉండేది కాదు. అలాంటి సమయంలో కొవిడ్‌ వచ్చింది. ప్రపంచమంతా స్తంభించిపోయింది. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మా ఆయన నాకు చాలా కాలంగా తెలుసు. కొద్ది కాలం డేటింగ్‌కు వెళ్లాం. ఆ తర్వాత తను బిజినె్‌సలో, నేను నా సినిమాల్లో మునిగిపోయాం. కొవిడ్‌ సమయంలో మళ్లీ మేమిద్దరం కనెక్ట్‌ అయ్యాం. తను వచ్చి మా అమ్మనాన్నలను అడిగాడు. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. పెళ్లయిన ఏడాదికి పిల్లాడు పుట్టాడు. వాడు పుట్టిన మూడు నెలలకు మళ్లీ షూటింగ్‌లకు వెళ్లటం మొదలుపెట్టా. ఇది నా జీవితంలో చాలా ఛాలెంజింగ్‌ ఫేజ్‌ అని చెప్పాలి.

పిల్లవాడు పుట్టిన వెంటనే షూటింగ్‌కు రావటం కష్టమనిపించలేదా?

చాలా కష్టమనిపించింది. కానీ ఒక సవాల్‌గా తీసుకున్నా. బాబు పుట్టాక ‘ఇండియన్‌-2’, ‘సత్యభామ’ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నా. ఇవి రెండూ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌. నా కెరీర్‌లో ఈ తరహా పాత్రలు చేయలేదు. నా శరీరాకృతిని మళ్లీ అదుపులోకి తెచ్చుకోవాలి. యాక్షన్‌ సీక్వెన్స్‌ల కోసం ట్రైనింగ్‌ తీసుకోవాలి. ఇలా చాలా కష్టపడ్డాను.

నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ కొన్నింటినే ఎంచుకొంటున్నా. షూటింగ్‌ సమయంలో పిల్లాడికి దూరంగా ఉండాలి. అలాంటప్పుడు నాకు తృప్తి ఇచ్చే పాత్రలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నా.

షెడ్యూల్‌ ప్రకారం పనులు జరగకపోతే నాకు చాలా చికాకుగా అనిపిస్తుంది. నేను చాలా క్రమశిక్షణగా ఉంటా. ఉదాహరణకు నేను నా షెడ్యూల్‌ను ఒక వారం రోజులకు ముందే ఫిక్స్‌ చేసుకొంటా. నా పనులన్నిటినీ వాటిలో జాగ్రత్తగా అమర్చుకుంటా.

రకరకాల పాత్రలు చేయాలని ఉంది. నేను నా ఐడెంటిటీని ఎప్పుడూ వదులుకోను. మా అబ్బాయికి కూడా... ‘మా అమ్మ నటి. వర్కింగ్‌ మదర్‌’ అనే విషయం తెలియాలి. అయితే ప్రస్తుతం మాత్రం నా ప్రాధాన్యత మా అబ్బాయి మాత్రమే.

యంగ్‌ మదర్స్‌ తమ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. నేను వారంలో కొంత సమయాన్ని నా కోసమే కేటాయించుకొంటా.

నేను చాలా ఎమోషనల్‌. కొన్ని విషయాలకు నాకు వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. కానీ అదే సమయంలో నేను చాలా స్ట్రాంగ్‌ కూడా.

మా ఆయన, నేను... మా లైఫ్‌ గోల్స్‌ను ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొంటూ ఉంటాం. మా కోసం కొంత సమయాన్ని పెట్టుకొంటాం. అప్పుడప్పుడూ డిన్నర్స్‌కు వెళతాం. మా భవిష్యత్తును ముందే ప్లాన్‌ చేసుకొంటాం.

- సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - May 06 , 2024 | 01:03 AM

Advertising
Advertising