ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రంగం ఏదైనాకృషి ‘అనన్యం'

ABN, Publish Date - Oct 02 , 2024 | 05:16 AM

ప్రపంచంలోని సంపన్న వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన ‘ఆదిత్య బిర్లా గ్రూప్‌’కు వారసురాలు... ఆ వారసత్వాన్ని నిలబెడుతూనే... తానేంటో నిరూపించుకున్నారు. సొంత కంపెనీలు ప్రారంభించి... వాటిని లాభాల బాట పట్టించారు. గాయనిగా పాటల తోటలో విహరిస్తూనే... తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగారు. నవతరం నారి అనన్యా బిర్లా జర్నీ ఇది.

శ్రీశక్తి

ప్రపంచంలోని సంపన్న వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన ‘ఆదిత్య బిర్లా గ్రూప్‌’కు వారసురాలు... ఆ వారసత్వాన్ని నిలబెడుతూనే... తానేంటో నిరూపించుకున్నారు. సొంత కంపెనీలు ప్రారంభించి... వాటిని లాభాల బాట పట్టించారు. గాయనిగా పాటల తోటలో విహరిస్తూనే... తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగారు. నవతరం నారి అనన్యా బిర్లా జర్నీ ఇది.

దిత్య బిర్లా గ్రూప్‌’ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా పెద్ద కుమార్తె అనన్యా బిర్లా. తల్లి నీరజ. బిర్లా వంశంలో ఐదో తరానికి చెందిన 30 ఏళ్ల అనన్య... చిన్నప్పుడే సంగీతంతో ప్రేమలో పడ్డారు. పదకొండేళ్లకు సంతూర్‌ వాయిద్యంపై సాధన మొదలుపెట్టారు. గాత్ర సంగీతంతో పాటు గిటార్‌, పియానో అభ్యసించారు. ముంబయి ‘అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ బాంబే’లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె... బ్రిటన్‌ వెళ్లి ‘ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం’ నుంచి ఎకనామిక్స్‌ అండ్‌ మేనేజిమెంట్‌లో డిగ్రీ పట్టా పొందారు. స్వతంత్ర భావాలతో పెరిగిన అనన్య... స్వయంకృషితో ఎదగాలనే పట్టుదలతో అడుగులు వేశారు.

‘ఒక వారసురాలిగా వంశం పేరు నిలబెట్టడం ఎంత ముఖ్యమో... నేను నేనుగా ఉండడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే మనం చేసే పనికి అర్థం ఉండదు’ అంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన అనన్య... అందుకు తగినట్టే రెండు పడవల మీద కాలు పెట్టారు. అభిరుచికి తగినట్టు అటు సంగీత ప్రపంచంలో తనను తాను నిరూపించుకున్నారు. అలాగే అవకాశం ఉంది కదా అని వ్యాపార రంగంలో ఒక్కసారిగా అందలం అందుకోవాలని అనుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, అన్నింటా పట్టు సాధించారు. అదే ఆమె విజయానికి బలమైన పునాదులు వేసింది.


  • సంగీతం వైపు పయనం...

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివే రోజుల్లోనే అనన్య తన సంగీతాభిరుచికి పట్ట కట్టారు. అక్కడి క్లబ్‌లు, పబ్బుల్లో పాటలు పాడేవారు. గిటార్‌ వాయించేవారు. కొంతకాలానికి సొంతంగా లిరిక్స్‌ రాయడం కూడా మొదలుపెట్టారు. అమెరికా పాప్‌ గాయకుడు, నిర్మాత జిమ్‌ బీన్జ్‌తో కలిసి తొలి సింగిల్‌ ‘లివిన్‌ ది లైఫ్‌’ రూపొందించారు. ‘పీఎం-ఏఎం రికార్డింగ్స్‌’ ద్వారా భారత్‌కు చెందిన గాయకుల ఆల్బమ్‌ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడం అదే మొదటిసారి. యూట్యూబ్‌లో సూపర్‌ హిట్‌.

14 మిలియన్ల మంది వీక్షించారు. అదే ఏడాది మరో ఇంగ్లీష్‌ సింగిల్‌ ‘మెంట్‌ టూ బీ’ వదిలారు. ఈ పాట కూడా విశేషంగా ఆకట్టుకుంది. అలా ఇప్పటికి దాదాపు ముప్ఫై ఆల్బమ్స్‌ చేశారు. చివరగా ఈ ఏడాది ‘24’ పేరుతో రీమిక్స్‌ విడుదలైంది. అజయ్‌దేవ్‌గణ్‌ ‘రుద్ర’ వెబ్‌సిరీ్‌సలో తొలిసారి తెరపై మెరిసిన అనన్య... ‘ష్లోక్‌: ది దేశీ షెర్లాక్‌’లో పూర్తి నిడివి గల పాత్ర పోషించారు. ప్రముఖ పాప్‌ గాయకులతో కలిసి ఎన్నో స్టేజ్‌ షోలు ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్‌ కోసం భారత అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు రూపొందించిన అధికారిక పాట ‘హిందుస్థానీ వే’ను ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌తో కలిసి ఆలపించారు. సాహిత్యంలో కూడా భాగం అయ్యారు. ఇలాంటి అరుదైన ఘట్టాలెన్నో ఆమె సంగీత జీవితంలో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తిపు తెచ్చాయి.


  • పదిహేడేళ్లకే సొంత కంపెనీ...

పాటల ప్రపంచంలో తనను తాను నిరూపించుకున్న అనన్య... 17 ఏళ్లకే పారిశ్రామికవేత్తగా తన ప్రస్థానం ప్రారంభించారు. 2012లో ‘స్వతంత్ర మైక్రోఫిన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో కంపెనీ ఒకటి ప్రారంభించారు. గ్రామీణ మహిళలకు చిన్నమొత్తాల్లో రుణాలు ఇచ్చే సంస్థ ఇది. దీనికి గానూ ఉత్తమ అంకుర సంస్థగా నాడు అవార్డును కూడా అందుకున్నారు అనన్య. ‘స్వతంత్ర’ గత ఏడాది 1,479 కోట్లకు ‘చైతన్య ఇండియా ఫిన్‌ క్రెడిట్‌ లిమిటెడ్‌’ను హస్తగతం చేసుకుంది. అనతికాలంలో దేశంలోనే రెండో అతిపెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ మైక్రోఫైనాన్స్‌ కంపెనీ స్థాయికి దాన్ని తీసుకువెళ్లారు. మైక్రో ఫైనాన్స్‌ రంగంలో ఆమె సాధించిన విజయాలు ఎన్నో. ఈ ఏడాది ‘ఫార్చూన్‌ ఇండియా’ ప్రకటించిన ‘40 అండర్‌ 40’లో ఆమెకు చోటు దక్కింది.


  • ఉద్యోగిగా మొదలై...

ఆక్స్‌ఫర్డ్‌లో చదివేటప్పుడు మానసిక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ ఉండేది. ఆ స్ఫూర్తితో బ్రిటన్‌ నుంచి తిరిగి వచ్చాక ‘అనన్యా బిర్లా ఫౌండేషన్‌’ స్థాపించారు. భారత్‌లోని యువతలో మానసిక భయాందోళనలు తొలగించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. అలాగే ‘ఐకాయ్‌ అసాయ్‌’ పేరుతో డిజైనింగ్‌ కంపెనీ ఒకటి నెలకొల్పారు. అంతేకాదు... మాతృ సంస్థ బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో, గ్రాసిమ్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌, మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌’లకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. తమ కంపెనీలో ఒక ఉద్యోగిగా చేరిన ఆమె... క్రమంగా అన్ని విషయాలనూ ఆకళింపు చేసుకున్నారు.

‘‘మా నాన్నకు ముందే చెప్పాను... ‘మన గ్రూప్‌లో నాకు అధికారిక హోదా ఏదీ వద్దని. ఎందుకంటే ఆ హోదా నన్ను నియంత్రిస్తుంది. అది నాకు సంతోషాన్ని ఇవ్వదు. నేను కష్టపడి పని చేయాలని అనుకొంటున్నాను. నా పని ప్రభావవంతంగా ఉండాలి. అది చూసి నా చుట్టూ ఉన్నవారు స్ఫూర్తి పొందాలి’ అని’’... ఇదీ అనన్యకు వృత్తి పట్ల ఉన్న నిబద్ధత. ఆమె మార్గదర్శకత్వంలోనే ‘ఆదిత్య బిర్లా గ్రూప్‌ డిజిటల్‌’ ఫిన్‌టెక్‌ యాప్‌ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం మూడున్నర కోట్ల మందికి పైగా కస్టమర్లకు ఆర్థిక సేవలు అందిస్తోందంటే అది అనన్య కృషి ఫలితమే. ‘తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో ఎదిగాను. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే ఇప్పటికీ నేను అదే వ్యక్తిని. నేను ఏంటనేది నేను కాదు... నా పనితనమే చెప్పాలి’’ అంటున్న అనన్య మరికొన్ని కొత్త ప్రాజెక్టుల పనిలో మరింత బిజీ అయ్యారు.

Updated Date - Oct 02 , 2024 | 05:19 AM