ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : కళతో వికాసం

ABN, Publish Date - Jul 15 , 2024 | 05:55 AM

‘‘నేను పుట్టింది, పెరిగింది ఢిల్లీలో. అమ్మ స్కూల్‌ టీచర్‌ నాన్న నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌ఎ్‌సజి)లో పని చేసేవారు. మా అమ్మకు డ్యాన్స్‌ అంటే ఆసక్తి. నన్ను మంచి డ్యాన్సర్‌గా తీర్చిదిద్దాలనుకుంది.

‘‘కళకు వివక్ష ఉండకూడదు. కులం, మతం, ప్రాంతం లాంటివే కాదు...

వైకల్యాలు ఉన్నవారికీ కళా శిక్షణ ద్వారా వికాసాన్ని పొందే అవకాశం అందించాలి’’ అంటారు విశాఖ వర్మ. దుబాయ్‌లో డ్యాన్స్‌ అకాడమీ ఏర్పాటు చేసి... పదిహేడేళ్లుగా

ఆటిజంలాంటి సమస్యలున్న వందలమంది పిల్లలకు నృత్యంలో శిక్షణ ఇచ్చారు.

ఇతర దేశాల్లో ప్రదర్శనలు నిర్వహించి... వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.

‘‘నేను పుట్టింది, పెరిగింది ఢిల్లీలో. అమ్మ స్కూల్‌ టీచర్‌ నాన్న నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌ఎ్‌సజి)లో పని చేసేవారు. మా అమ్మకు డ్యాన్స్‌ అంటే ఆసక్తి. నన్ను మంచి డ్యాన్సర్‌గా తీర్చిదిద్దాలనుకుంది. నాకూ ఇష్టమే కాబట్టి... ఏడేళ్ళ వయసు నుంచి కథక్‌ నేర్చుకోవడం ప్రారంభించాను. ఆ తరువాత కొన్ని ప్రదర్శనలు కూడా ఇచ్చాను. తీరిక సమయాల్లో కొందరు పిల్లలకు డ్యాన్స్‌ నేర్పాను. డ్యాన్సర్‌గా కెరీర్‌ ఎంచుకోవాలనేది నా కోరిక. కానీ కళలనేవి హాబీగా మాత్రమే ఉండాలనేది మా వాళ్ళ అభిప్రాయం. దాంతో నా కోరికను వదులుకొని, సివిల్‌ ఇంజనీరింగ్‌ చేశాను. ఆ తరువాత ఉద్యోగంలో చేరాను. కొన్నాళ్ళకు... వివాహమయ్యాక... నా భర్త ఉద్యోగరీత్యా దుబాయ్‌ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ జరిగిన ఒక సంఘటన మళ్ళీ నన్ను నృత్య ప్రపంచంవైపు తీసుకువచ్చింది.


‘ఏం ప్రయోజనం’ అన్నారు...

నాకు పరిచయం ఉన్న ఒక మహిళ దుబాయ్‌లోని ఒక పాఠశాలలో ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. అక్కడ.. సెరెబ్రల్‌ పాల్సీ, ఆటిజం లాంటి సమస్యలున్న పిల్లలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కానీ వారు నేపథ్యంలో వస్తున్న సంగీతాన్ని వింటున్నట్టు కానీ, సరిగ్గా స్పందిస్తున్నట్టు కానీ నాకు కనిపించలేదు. శరీరాన్ని కదిలించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ‘ఆ పిల్లలకు సరైన రీతిలో నాట్యం ఎందుకు నేర్పకూడదు?’ అనిపించింది. అదే విషయం నన్ను ఆహ్వానించిన వ్యక్తిని అడిగాను. వాళ్ళకు ఉన్న సమస్యలను ఆమె వివరిస్తూ... ‘‘వారిలో బెరుకు పోయి, నలుగురి ముందుకూ రావాలనే ఆలోచనతోనే వారిని స్టేజి మీదకు తీసుకువచ్చాం. అంతేతప్ప వాళ్ళ ప్రతిభను ప్రదర్శించడానికి కాదు. వాళ్ళకు నాట్యం ఎందుకు నేర్పకూడదని మీరంటున్నారు. మీరు ఉచితంగా నేర్పుతారా?’’ అని అడిగారు. ‘‘నేర్పుతాను’’ అని వెంటనే చెప్పాను. నా భర్త కూడా నా ఆలోచనకు మద్దతు ఇచ్చారు. ముందుగా.. ఆటిజం లాంటి సమస్యలున్న పిల్లల గురించి నిపుణులు, పుస్తకాల ద్వారా తెలుసుకున్నాను. డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ థరెపీలో రెండేళ్ళ శిక్షణ తీసుకున్నాను. మానసిక వైద్యులతో మాట్లాడాను.


2007లో... దుబాయ్‌లో ‘విశాఖ డ్యాన్స్‌ అకాడమీ’ని ప్రారంభించాను. అయితే తల్లితండ్రుల్ని ఒప్పించడం కష్టమయింది. ‘‘వాళ్ళ పరిస్థితి చూశారు కదా! ఇంకా కష్టపెట్టడం ఎందుకు? డ్యాన్స్‌ వల్ల ఏం ప్రయోజనం?’’ అని ప్రశ్నించారు. ‘‘నృత్యమంటే మాటలు లేకుండా భావాన్ని వ్యక్తీకరించే ఒక విధానం. ఈ పిల్లలు మాట్లాడలేరు. కానీ, నేను నేర్పాలనుకొనేది వాళ్ళు అర్థం చేసుకోగలరు’’ అని చెప్పాను. మొదట ఒక తొమ్మిదేళ్ళ అమ్మాయి చేరింది. తనను చూసి మరికొందరు... అలా విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఎడిహెచ్‌డి, ఆటిజం, సెరెబ్రల్‌ పాల్సీ, డౌన్‌ సిండ్రోమ్‌, రెట్‌ సిండ్రోమ్‌... ఇలా పలు సమస్యలున్న పిల్లలను చేర్చుకున్నాను. అయితే మా అకాడమీని వారికే పరిమితం చెయ్యలేదు. సాధారణ పిల్లలకు కూడా శిక్షణ ఇస్తున్నా.

వారే నా గురువులు...

ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నృత్యం నేర్పడం ఒక సవాల్‌ అయితే... వారికి మనం చేరుకావడం, వారికోసం మనం ఉన్నామనే నమ్మకం కలిగించడం మరో సవాల్‌. డ్యాన్స్‌ థెరపీ అంటే మానసిక స్పందనలకు శారీకమైన కదలికలను అనుసంధానించడం. పిల్లల్లో శారీరకమైన లాఘవాన్ని పెంచడానికి దోహదపడుతుంది. వారిలో ఆత్రుతను, ఒత్తిడిని తగ్గిస్తుంది. వివిధ వైకల్యాలున్న 300మందికి పైగా పిల్లలకు ఇప్పటివరకూ శిక్షణ ఇచ్చాను.


పలు దేశాల్లో ప్రదర్శనలు ఇప్పించాను. వారి నైపుణ్యం, భావవ్యక్తీకరణ సామర్థ్యంలో పెరుగుదల, ఆత్మవిశ్వాసం... చూసి నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. నేను చేస్తున్న కార్యక్రమాలను గుర్తించిన భారత ప్రభుత్వం... 2021లో ‘గ్లోబల్‌ డిజేబిలిటీ ఎంపవర్‌మెంట్‌ అవారు’్డతో నన్ను సత్కరించింది.

ఇక మా పిల్లలతో నేను చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రాచుర్యం పొంది, మాకు ఎంతో పేరు తెస్తున్నాయి. కళలకు ఎలాంటి వివక్షా ఉండకూడదనేది నా తపన. వైకల్యాలున్న పిల్లల్లో డ్యాన్స్‌ థెరపీ అద్భుతాలు చేస్తుందనేది ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తోంది. నా దగ్గర శిక్షణ పొందిన పిల్లల్లో సానుకూలమైన మార్పు ఎంతో సంతోషం కలిగిస్తోంది. వారిని నేను గురువులుగా భావిస్తాను. ఎందుకంటే... సహనంగా, ప్రశాంతంగా ఉండడం, బేషరతుగా ప్రేమ అందించడం... ఎన్నో విషయాలు వారి నుంచి నేర్చుకున్నాను. నా కృషిని కొనసాగించడానికి ప్రేరణ వారి నుంచే నాకు లభిస్తోంది.’’

Updated Date - Jul 15 , 2024 | 06:06 AM

Advertising
Advertising
<