Navya : సాఫ్ట్ లుక్ కోసం...
ABN, Publish Date - Jul 20 , 2024 | 05:31 AM
మేకప్ ఎంత సహజంగా ఉంటే అంత ఆకర్షణీయంగా కనిపిస్తాం! కాబట్టే కొత్త పెళ్లికూతురు, అంబానీ కోడలు, రాధిక మర్చంట్ సాఫ్ట్ మేక్‌పను ఎంచుకుంది.
మేకప్
మేకప్ ఎంత సహజంగా ఉంటే అంత ఆకర్షణీయంగా కనిపిస్తాం! కాబట్టే కొత్త పెళ్లికూతురు, అంబానీ కోడలు, రాధిక మర్చంట్ సాఫ్ట్ మేక్‌పను ఎంచుకుంది. అలాంటి న్యాచురల్ లుక్‌ను మరిపించే సాఫ్ట్ మేకప్ టిప్స్ ఇవే!
చర్మం ఇలా సిద్ధం
చర్మం తగినంత తేమగా ఉంటేనే సహజత్వం ఉట్టిపడుతుంది. కాబట్టి ఎస్‌పిఎఫ్ లేదా మాయిశ్చరైజర్ కలిగి ఉండే బ్రైటెనింగ్ సీరమ్ ఎంచుకోవాలి. లేదంటే పిగ్మెంట్ కలిసి ఉండే, అలా్ట్రలైట్ లోషన్, యాంటీఆక్సిడెంట్ విటమిన్ ఇ కలిసి ఉండే బిబి క్రీమ్‌ను కూడా అప్లై చేసుకోవచ్చు.
అండర్ ఐ కన్‌సీలర్
కళ్ల కింద నలుపును కవర్ చేయడం కోసం, ఇన్‌వర్టెడ్ ట్రయాంగిల్ ఆకారంలో కన్‌సీలర్‌ను అప్లై చేసి, మునివేలితో చర్మంలో కలిసిపోయేలా అద్దుకోవాలి. ఈ కన్‌సీలర్‌తో కళ్ల కింది వాపు, నలుపు చర్మంలో కలిసిపోయి, కళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.
మెరిసే బుగ్గల కోసం...
సాఫ్ట్ మేక్‌పతో ముఖం చదునుగా కనిపించకుండా ఉండడం కోసం చెక్కిళ్లకు గులాబీ రంగు బ్లష్ అద్దుకోవాలి. ఇందుకోసం రోజీ క్రీమ్ బ్లష్‌ను అప్లై చేసి బుగ్గల నుంచి కణతల వైపు బఫ్ చేసుకోవాలి. న్యాచురల్ లుక్ కోసం, బ్లష్ కోసం ముదురు రంగు గులాబీ రంగుకు బదులుగా వీలైనంత లేత గులాబీ రంగు బ్లష్‌ను ఎంచుకోవాలి.
గ్లాసీ హైలైట్
హైలైటర్ అనగానే షిమ్మర్ కలిసిన పౌడర్లు, క్రీమ్స్ గుర్తుకొస్తాయి. కానీ చర్మానికి షిమ్మర్ లుక్‌కు తెప్పించడానికి బదులుగా, గ్లాసీ హైలైట్‌ను ఎంచుకోవాలి. ఇందుకోసం చీక్‌బోన్స్, కనురెప్పలు, ముక్కుకు ఇరుపక్కల హైలైటర్‌ను అప్లై చేసుకోవాలి. ఒకవేళ గ్లాస్ లేకపోతే, దానికి బదులుగా నచ్చిన లిప్‌గ్లా్‌సను కూడా అప్లై చేసుకోవచ్చు.
ఐలైనర్ ఇలా...
ముచ్చటగా తీర్చిదిద్దినట్టుండే ఐలైనర్ ఫ్యాషన్‌కు కాలం చెల్లింది. స్మడ్జ్ లుక్ లేటెస్ట్ ఫ్యాషన్. అందుకోసం కుదురుగా గీసుకోడానికి బదులుగా కనురెప్పల అంచుల్లో వీలైనంత మామూలుగా లైనర్ గీసుకుని, స్మడ్జ్ బ్రష్ లేదా దూది ఉండతో స్మడ్జ్ చేసుకోవాలి.
మస్కారా ముద్దుగా
కనురెప్పల కుదుళ్ల నుంచి అంచుల వరకూ మస్కారా అప్లై చేసుకోవాలి. మస్కారా అప్లై చేయడంలో ఈ చిన్న టెక్నిక్ పాటిస్తే, ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. కనురెప్పలు మరింత చిక్కగా కనిపించడం కోసం, రెండో కోట్ కూడా అప్లై చేసుకోవాలి.
లిప్‌స్టిక్ ఇలా...
లిప్ బ్రష్ ఉపయోగించి, లిప్‌స్టిక్ పెదవులు దాటకుండా కుదురుగా వేసుకోవచ్చు. గ్లిట్టర్, గ్లాస్ కలిగిన లిప్‌స్టిక్‌కు బదులుగా మ్యాట్ లిప్‌స్టిక్‌ను ఎంచుకుంటే న్యాచురల్ లుక్ సొంతమవుతుంది. బ్లాటింగ్ పేపర్‌తో అదనపు రంగును తొలగించుకుంటే పెదవులు సహజసిద్ధమైన గులాబీ రంగును సంతరించుకుంటాయి.
Updated Date - Jul 20 , 2024 | 05:31 AM