ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : ఫిట్‌నెస్‌ వ్యాయామం ఎంత సేపు?

ABN, Publish Date - Jun 18 , 2024 | 12:43 AM

వ్యక్తిగత ప్రాథామ్యాలు, లక్ష్యాలు, ఫిట్‌నెస్‌ మోతాదుల మీదే వ్యాయామ సమయం ఆధారపడి ఉంటుంది. అయితే గాయాలకూ, ప్రమాదాలకూ తావు లేని వ్యాయామ నిడివిని ఏ అంశాల ఆధారంగా ఎంచుకోవాలో తెలుసుకుందాం!

వ్యక్తిగత ప్రాథామ్యాలు, లక్ష్యాలు, ఫిట్‌నెస్‌ మోతాదుల మీదే వ్యాయామ సమయం ఆధారపడి ఉంటుంది. అయితే గాయాలకూ, ప్రమాదాలకూ తావు లేని వ్యాయామ నిడివిని ఏ అంశాల ఆధారంగా ఎంచుకోవాలో తెలుసుకుందాం!

  • వ్యాయామం చేయడం వెనకున్న లక్ష్యాన్ని బట్టి ఎలాంటి వ్యాయామం ఎంత సమయం పాటు చేయాలనేది తెలుసుకోవాలి. బరువు తగ్గడం, కండరాలను పెంచడం, కార్డియోవ్యాస్క్యులర్‌ ఆరోగ్యాన్ని పెంచుకోవడం.. ఇలా వ్యాయామ లక్ష్యాల ఆధారంగా అందుకు తగిన వ్యాయామాలనూ, నిడివినీ కేటాయించుకోవాలి.

  • తక్కువ సమయం పాటు ఎక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయడం లేదా ఎక్కువ సమయం పాటు తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయడం వ్యక్తుల శరీర దారుఢ్యం, వయసు, ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందుకు తగిన వ్యాయామ ప్రక్రియను ఎంచుకోవాలి.

  • కొత్తగా వ్యాయామం మొదలుపెట్టేవాళ్లు తక్కువ నిడివితో, తేలికపాటి వ్యాయామాలు చేయాలి. వ్యాయామం అనుభవం ఉన్న వాళ్లు క్రమేపీ తీవ్రతను, వ్యాయామ నిడివినీ పెంచుకుంటూ పోవచ్చు.

  • కొందరికి వారంలో ఒకటి రెండు రోజుల పాటు సుదీర్ఘమైన వ్యాయామాలను ఎంచుకుంటారు. ఇంకొందరు వారంలో ఐదు రోజుల పాటు తక్కువ సమయాలను వ్యాయామాలకు కేటాయిస్తూ ఉంటారు. తీరిక దొరికే సమయాల ఆధారంగా, ఈ రెండింటిలో ఎవరికి ఏది సూటవుతుందో తెలుసుకోవాలి.

Updated Date - Jun 18 , 2024 | 12:44 AM

Advertising
Advertising