ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : ముక్దుం జ్ఞాపకాలు..

ABN, Publish Date - Aug 25 , 2024 | 01:04 AM

మనకున్న గొప్ప రచయితలలో ముక్దుం ఒకరు. ఆయనతో నాన్నకు మంచి స్నేహం ఉండేది. నిన్న పాత పుస్తకాలు తిరగేస్తుంటే ముక్దుం పుస్తకాలు బయటకు వచ్చాయి. అనేక జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.

అలనాటి కథ

మనకున్న గొప్ప రచయితలలో ముక్దుం ఒకరు. ఆయనతో నాన్నకు మంచి స్నేహం ఉండేది. నిన్న పాత పుస్తకాలు తిరగేస్తుంటే ముక్దుం పుస్తకాలు బయటకు వచ్చాయి. అనేక జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.

నాన్న రాజాఽ ధన్‌రాజ్‌గిరి ఉర్దు, పర్షియన్‌ పుస్తకాలు చదువుతూ ఉండేవారు. అలా ఆయనకు ముక్దుంతో పరిచయం ఏర్పడింది. నాన్నకు ఆయన కవిత్వం పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడి ఆయనను కలవాలనుకున్నారు.

ఒక స్నేహితుడి ఇంట్లో కలుసుకున్నారు. ఒక రోజు నాన్న- ముక్దుంను, ఇతర స్నేహితులను ఇంటికి డిన్నర్‌కి పిలిచారు. నేను డైనింగ్‌ రూమ్‌ దగ్గరకు వెళ్లేసరికి- నాన్న స్నేహితులందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒక వ్యక్తి దూరంగా కూర్చుని చార్మినార్‌ సిగరెట్‌ తాగుతున్నాడు. నేను నాన్న స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతూ - ‘‘కమ్యూనిస్టులు చాలా చెడ్డవాళ్లు’’ అన్నాను. అప్పుడు దూరంగా కూర్చుని వ్యక్తి నా పైపు చూసి - ‘‘నీకు కమ్యూనిజం గురించి ఏం తెలుసు?’’ అన్నాడు.

నాకు అప్పటి దాకా ఆయనే ముక్దుం అనే విషయం తెలియదు. ‘‘నాకు కమ్యూనిజం గురించి ఎక్కువ తెలియదు. నేను నిన్నే వియన్నా నుంచి వచ్చాను. అక్కడ నా కెమెరా లాగేసుకున్నారు.. మ్యూజియంకి వెళ్తే అక్కడ నన్ను తనిఖీ చేశారు’’ అని చెప్పా. ఆయన నావైపు నిరసనగా చూశాడు.


ఎందుకో తెలియదు కానీ ఆయనంటే నాకు మంచి అభిప్రాయం ఏర్పడలేదు. నాన్న ఇంకెప్పుడు ఆయనను ఇంటికి పిలవకపోతే బావుండుననుకున్నాను. కానీ రెండు రోజుల తర్వాత మళ్లీ ముక్దుం మా ఇంటికి వచ్చాడు.

నాన్న ఆయన కవిత్వం చదువుతుంటే రికార్డు కూడా చేశారు. ‘‘ప్రాణాన్ని తీసుకుందాం.. విశ్వాన్ని తీసుకుందాం.. పదండి.. మొత్తం ప్రపంచాన్ని మనతో తీసుకువెళ్దాం..’’ అనే ఆయన కవితా పంక్తులు నాలో ఆసక్తి కలిగించింది. ఆ తర్వాత కాలంలో ముక్దుం మా ఇంటిలో జరిగే అనేక పార్టీలకు వస్తూ ఉండేవాడు. ఇలా ముక్దుంతో పరిచయం పెరిగింది.

ఒక రోజు ముక్దుం నాకు ఫోన్‌ చేసి- ‘‘నా పుస్తకం ముద్రించాలి.. ఒక వెయ్యి రూపాయలు ఇస్తావా?’’ అని అడిగాడు. ఆ సమయంలో నా పాకెట్‌ మనీ 300రూపాయలే! దాంతో నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పాను. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు తను డబ్బుల గురించి నాతో మాట్లాడలేదు. మా చెల్లిని స్విట్జర్లాండ్‌లో స్కూల్లో చేర్చటానికి నేను కూడా వెళ్లాను.

అక్కడ నుంచి లండన్‌కు కూడా వెళ్లాను. నేను లండన్‌లో ఉన్న సమయంలో ముక్దుం నాకు ‘‘గుల్‌ ఏ తార్‌’’ (తాజా పువ్వులు) అనే పుస్తకాన్ని పంపించాడు. ముక్దుం రాసిన గజల్స్‌ పుస్తకమిది. ఒకో గజల్‌ ఒకో అద్భుతంలా అనిపించింది. ‘‘నాకు కూడా గజల్స్‌ రాయటం నేర్పుతారా?’’ అని ముక్దుంను అడిగాను.


‘‘నువ్వు రాసి పంపించు.. వాటిని నేను సరిచేస్తాను’’ అన్నాడు. నేను లండన్‌ నుంచి ముంబాయి వచ్చాను. అక్కడ నుంచి తనకు ఒక గజల్‌ రాసి పంపాను. దానిలో మూడు చరణాలు- ఇతర కవులవి. రెండు నావి. అవి చదివిన తర్వాత ముక్దుం- ఇతర కవులు రాసి మూడు చరణాలకు టిక్‌ పెట్టి పంపాడు. నేను రాసిన రెండు చరణాలు కొట్టేసి- ‘‘ఇది రాసే పద్ధతి కాదు’’ అని రాసి పంపాడు.

ఆ సమయంలో ముక్దుం సిటీ కాలేజీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాడు. ఒక సారి ముక్దుం, ప్రముఖ ఇంగ్లీషు రచయిత ముల్కరాజ్‌ ఆనంద్‌తో కలిసి రష్యా వెళ్లాడు. అక్కడ వారిద్దరు ఒక చోట కూర్చుని కవిత్వం గురించి మాట్లాడుకుంటుంటే - ముల్కరాజ్‌ ఆనంద్‌ వ్యంగంగా- ‘‘ప్రతి భారతీయ కవి ఇంగ్లీషు రాయాలనుకుంటాడు..’’ అన్నాడుట.

అప్పుడు ముక్దుం- ‘‘నువ్వే ఇంగ్లీషులో రాస్తున్నప్పుడు- ఇతరులు అనుకుంటే తప్పేముంది?’’ అన్నాడట. ఈ విషయాన్ని నాకు ముక్దుం స్వయంగా చెప్పాడు. ఆ తర్వాతి కాలంలో ముక్దుం కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేసే కవుల్లో అగ్రగామిగా నిలిచాడు.


ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్‌లో జేషిన్‌ ఈ ముక్దుం అనే కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న కవులందరూ వచ్చారు. ముక్దుంకు ఘన సన్మానం చేశారు. ఆ తర్వాత ముక్దుం ప్రజల హక్కుల కోసం జరిగిన ఒక కార్యక్రమంలో నిరాహార దీక్షకు కూర్చున్నాడు. దాని తర్వాత అతని ఆరోగ్యం పాడైపోయింది.. తనకు ఆరోగ్యం పాడైన సమయంలో నేను మారిష్‌సలో ఉన్నా.

మారిషస్‌ నుంచి బొంబాయికి వచ్చిన వెంటనే నాన్న పర్సనల్‌ సెక్రటరీ వచ్చి - ‘‘మీకో చెడు వార్త. ముక్దుం చనిపోయాడు’’ అని చెప్పాడు. నాకు విపరీతమైన దుఖం కలిగింది. ముక్దుం బతుకున్న రోజుల్లో- ‘‘నన్ను మసీదులో కాకుండా ఒక పొలంలో సమాధి చేయండి. నా సమాధి మీద గులాబీ పూల మొక్కలు, ద్రాక్ష మొక్కలు నాటండి’’ అని చెబుతూ ఉండేవాడు.

నేను హైదరాబాద్‌కు వచ్చే సరికే అతనిని ఖననం చేసేశారు. ఆ తర్వాత నేను తన సమాధి దగ్గరకు వెళ్లి గులాబీ పూలతో శ్రద్ధాంజలి ఘటించి వచ్చాను. ముక్దుం లేకపోయినా అతని రచనలను ఈనాటికి ప్రజలు చదువుతున్నారు. గుర్తు చేసుకుంటున్నారు.

-రాజకుమారి ఇందిరాదేవి ధన్

Updated Date - Aug 25 , 2024 | 01:04 AM

Advertising
Advertising
<