Navya : ఆహారంతో చక్కెర అదుపు
ABN, Publish Date - Jun 18 , 2024 | 12:19 AM
ఆహార వర్గాల మధ్య తేడాలు, గ్లైసెమిక్ మోతాదుల మీద వాటి ప్రభావాలు, వాటిలోని పోషక విలువల మీద అవగాహన ఏర్పరుచుకుని అందుకు తగిన ఆహారాన్ని ఎంచుకోగలిగితే చక్కెర అదుపు తప్పకుండా ఉంటుంది.
డయాబెటిక్ కేర్
ఆహార వర్గాల మధ్య తేడాలు, గ్లైసెమిక్ మోతాదుల మీద వాటి ప్రభావాలు, వాటిలోని పోషక విలువల మీద అవగాహన ఏర్పరుచుకుని అందుకు తగిన ఆహారాన్ని ఎంచుకోగలిగితే చక్కెర అదుపు తప్పకుండా ఉంటుంది.
కుటుంబ చరిత్ర: కుటుంబ చరిత్ర, జెనెటిక్ మేకప్‌లను అర్థం చేసుకోగలిగితే, మన శరీరం పనితీరు అవగతమవుతుంది. పరిసరాలు, జీవనశైలి, ఆహారపుటలవాట్ల ఆధారంగా మధుమేహం అదుపులో ఉండే ఆహారశైలీ, వ్యాయామాలను రూపొందించుకోవాలి.
కార్బొహైడ్రేట్ కౌంట్: తీసుకునే ఆహారం ద్వారా అందుతున్న పిండిపదార్థాలు, వాటితో పెరిగే చక్కెర మోతాదుల పట్ల కూడా అవగాహన ఏర్పరుచుకోవాలి. చక్కెరను క్రమం తప్పకుండా ఉంచగలిగే కార్బొహేడ్రేట్ల మోతాదును, అందుకోసం తీసుకోవలసిన ఆహార మోతాదును నిర్ణయించుకోవాలి.
గ్లైసెమిక్ ఛాయిస్: రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేసే పదార్థాలను ఎంచుకోవాలి. అందుకోసం వీలైనంత తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండే చిక్కుళ్లు, నాన్ స్టార్చీ కూరగాయలు, పాలిష్ పట్టని ధాన్యాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
పోర్షన్ కంట్రోల్: చక్కెర అదుపులో ఉండడం కోసం తీసుకుంటున్న ఆహార పరిమితి మీద నియంత్రణ ఉండాలి. లీన్ ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండే పదార్థాలను పరిమితిలో తీసుకుంటూ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి.
Updated Date - Jun 18 , 2024 | 12:19 AM