ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : వేసవారం... విషదోషాలకు విరుగుడు

ABN, Publish Date - Aug 24 , 2024 | 05:08 AM

ఇప్పుడైతే అన్ని రకాల పొడులు మనకు మార్కెట్లో దొరికేస్తున్నాయి. కానీ ఒకప్పుడు వీటిని ఇళ్లలోనే తయారు చేసుకొనేవారు. ఇలా తయారు చేసుకున్న పొడినే వేసవారం అంటారు.

ప్పుడైతే అన్ని రకాల పొడులు మనకు మార్కెట్లో దొరికేస్తున్నాయి. కానీ ఒకప్పుడు వీటిని ఇళ్లలోనే తయారు చేసుకొనేవారు. ఇలా తయారు చేసుకున్న పొడినే వేసవారం అంటారు. దీన్ని అన్ని రకాల కూరల్లోనూ వాడుకోవచ్చు. కూరలకు రుచినివ్వడమే కాదు... ఆరోగ్యదాయిని కూడా.

క్షేమశర్మ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో వేసవారాన్ని ఆరు సుగంధ ద్రవ్యాల మిశ్రమంగా అభివర్ణించాడు. ఇంగువ, అల్లం, మిరియాలు, జీలకర్ర, పసుపు, ధనియాలతో చేసిన ఈ మిశ్రమాన్ని చాలా శ్రద్ధతో.. జాగ్రత్తగా చేయాలని ఆయన సూచించాడు. ఈ మిశ్రమంలో ఏఏ పదార్థాన్ని ఎంత పాళ్లలో వేయాలో కూడా చెప్పాడు. ‘క్షేమకుతూహలం’ గ్రంధం ప్రకారం... ఒక చెంచా ఇంగువపొడి తీసుకుంటే.. దానికి రెట్టింపు అల్లం ముద్ద తీసుకోవాలి.

ఆ అల్లం ముద్దకు రెట్టింపు మిరియాల పొడి తీసుకోవాలి. ఆ మిరియాల పొడికి రెట్టింపు జీలకర్ర పొడి, దానికి రెట్టింపు పసుపు, దీనికి రెట్టింపు ధనియాల పొడిని వేసి బాగా నూరాలి. ఇలా నూరిన మిశ్రమంలో తగినంత సైంధవ లవణం వేసి కలపాలి. ఈ వేసవారం చాలా కాలం నిల్వ ఉంటుంది.


విషదోషాల నివారణ...

మనం రోజూ తినే ఆకుకూరలు, కూరగాయాల్లో రకరకాల రసాయనాలు కలుస్తున్నాయి. వీటివల్ల మన శరీరంలో అనేక విషాలు ప్రవేశించవచ్చు. ఈ విషాలన్నింటినీ వేసవారం తొలగిస్తుందని క్షేమశర్మ పేర్కొన్నాడు.

అంతే కాకుండా వేసవారంవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీనిని మసాలాలకు బదులుగా కూరలు, పచ్చళ్లు, పులుసుల్లోనూ వాడవచ్చు. కూరగాయాలను ఉడికించి.. దానిలో పెరుగు, వేసవారం వేస్తే అది సుగంధభరితమైన పెరుగుపచ్చడి అవుతుంది. పప్పులో కానీ.. పులుసులో కానీ వేస్తే, తాళింపు పెట్టుకొనే అవసరం ఉండదు.


మాంసం శుద్ధి...

మాంసం, చేపలు మొదలైన వాటిలో వాసన ఉంటుంది. ఈ వాసన పోవటానికి వేసవారం ఉపకరిస్తుంది. మాంసం లేదా చేపలను తీసుకొని వాటిని వేసవారం వేసిన నీళ్లలో ఉడికించాలి.

ఇలా ఉడికించిన తర్వాత మళ్లీ ఆ మాంసం లేదా చేపలను మజ్జిగలో ఉడికించాలి. దీనివల్ల మాంసం లేదా చేపల్లో ఉన్న విష పదార్థాలేమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఒకవేళ మజ్జిగ లేకపోతే దానిమ్మ రసంలోనైనా వీటిని ఉడికించవచ్చు.

- గంగరాజు అరుణాదేవి

Updated Date - Aug 24 , 2024 | 05:08 AM

Advertising
Advertising
<