ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : చిట్టి చిట్కాలు

ABN, Publish Date - Aug 27 , 2024 | 02:44 AM

ఒత్తిడి వేధిస్తుంటే, యాలకులు నమలడం లేదా వాటితో టీ తయారుచేసుకుని తాగడం చేయాలి. ఇలా చేస్తే, మెదడులోని హార్మోన్ల విడుదల సమమై ఒత్తిడి అదుపులోకొస్తుంది.

మీకు తెలుసా?

ఒత్తిడి వేధిస్తుంటే, యాలకులు నమలడం లేదా వాటితో టీ తయారుచేసుకుని తాగడం చేయాలి. ఇలా చేస్తే, మెదడులోని హార్మోన్ల విడుదల సమమై ఒత్తిడి అదుపులోకొస్తుంది.

  • 8 బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి మరుసటి ఉదయం తోలు తీసి మెత్తగా పేస్ట్‌లా తయారుచేసి, ఆ ముద్దను పాలల్లో కలుపుకుని తాగాలి. లో బిపితో బాధపడేవారికి ఇది చక్కని విరుగుడుగా పని చేస్తుంది.

  • రాత్రి నిద్రకు 3 నుంచి 4 గంటల ముందు వరకూ పొట్టను ఖాళీగా ఉంచుకుంటే, గ్రోత్‌ హార్మోన్‌ వృద్ధి అవుతుంది. కొవ్వు కరుగుతుంది. పొట్ట చదును అవుతుంది. కంటి నిండా నిద్ర పడుతుంది.

  • నిద్ర పట్టకపోతే మెగ్నీషియం తగ్గిందని అర్థం. కాబట్టి మెగ్నీషియం ఎక్కువగా ఉండే పాలకూర, అవకాడోలు తినాలి.


  • ఉదయం నిద్రలేవగానే అలసటగా ఉంటే పొటాషియం లోపం ఉందని అర్థం. అరటి పండు, కొబ్బరినీళ్లు ఈ సమస్యకు విరుగుడు.

  • తలనొప్పి తరచూ వేధిస్తుంటే, సోడియం లోపంగా భావించవచ్చు. కీర దోస రసం సోడియం లోపాన్ని భర్తీ చేస్తుంది.

  • పచ్చ అరటిలో రెసిస్టెంట్‌ స్టార్చ్‌ సమృద్ధిగా ఉంటుంది. ఈ స్టార్చ్‌ రక్తంలో చక్కెర మోతాదు, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను నియంత్రిస్తుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు కూడా స్టార్చ్‌ ఆహారంగా ఉపయోగపడుతుంది.

  • గుమ్మడి విత్తనాలను దంచినప్పుడు టెట్రాసైక్లిక్‌ ట్రైటెర్పీన్స్‌ అనే కాంపౌండ్లు విడుదలవుతాయి. ఇవి శరీరంలోని పరాన్నజీవులను విసర్జించడానికి సహాయపడతాయి.

  • రోజుకు మూడు ఖర్జూరాలు తింటే, జీర్ణశక్తి పెరిగి, శక్తి నిల్వలు వృద్ధి అవుతాయి. మెదడు చురుగ్గా మారుతుంది. ఎముకలు బలపడతాయి..

Updated Date - Aug 27 , 2024 | 02:44 AM

Advertising
Advertising
<