Nutritionists : వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్
ABN, Publish Date - Sep 28 , 2024 | 01:02 AM
శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడేవి యాంటీ ఆక్సిడెంట్లే. ఇవి పండ్లు, నట్స్ వంటి వాటిలో పుష్కలంగా లభిస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు.
శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడేవి యాంటీ ఆక్సిడెంట్లే. ఇవి పండ్లు, నట్స్ వంటి వాటిలో పుష్కలంగా లభిస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు.
బెర్రీలు: బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీలలో ప్రొయాంథోసియానిడిన్స్ అనే యాంటీఆక్సిడెంటు ఉంటుంది. ఇది గుండెజబ్బులు, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఉదయాన్నే స్మూతీగా తీసుకోవచ్చు. యోగర్ట్ లేక తృణధాన్యాలతో కలిపి తీసుకోవచ్చు.
గ్రేప్స్ : వీటిలో సి విటమిన్‌తో పాటు మెగ్నీషియం లభిస్తుంది. సాధారణ కెరోటినాయిడ్‌గా పిలిచే బీటా కెటోరిన్ నుంచి రెస్‌వరా్ట్రల్ వరకు బోలెడు యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో లభిస్తాయి.
వాల్‌నట్స్ : యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే వాల్‌నట్స్ పది, పదిహేను తీసుకుంటే చాలు. వంద గ్రాముల వాల్‌నట్స్‌లో 15.2 గ్రాముల ప్రొటీన్, 65.2గ్రాముల ఫ్యాట్, 6.7గ్రాముల ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమైన ఎమైనో యాసిడ్స్ లభిస్తాయి.
గ్రీన్ టీ : ఇందులో కెట్‌చిన్ ఫాలిఫెనాల్స్ అనే మిశ్రమం ఉంటుంది. ఇది శరీరంలో ఇతర రసాయనాలతో కలిసి పని చేసి ఽథర్మోజెనెసిస్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. క్యాన్సర్, గుండెజబ్బులు దరిచేరకుండా చూస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యకు పరిష్కారం చూపుతుంది.
కివీ పండు : విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నీటిలో కరిగే యాంటీ ఆక్సిడెంటు ఉంటుంది. కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్‌ను ఇది నూట్రలైజ్ చేస్తుంది. విటమిన్ సి తగినంత తీసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్తమా వంటి జబ్బుల తీవ్రత తగ్గుతుంది. కోలన్ క్యాన్సర్, ఎథెరోస్క్లెరోసిస్, డయా బెటిక్ హార్ట్ డిసీజ్ వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది.
రెడ్ యాపిల్స్ : ఇందులో ఫైటోన్యూట్రియెంట్స్, ఫ్లావనాయిడ్స్, పాలీఫెనొలిక్స్ వంటివి పుష్కలం. 100గ్రాముల యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెంత్ (ఓఆర్‌ఏసీ వాల్యూ) 5900 టీఈగా ఉంటుంది. క్వెర్‌సెటిన్, ఎపికెట్‌చిన్, ప్రొసినాడిన్ బి2 వంటి ముఖ్యమైన ఫ్లావనాయిడ్లు లభిస్తాయి. ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
స్ట్రాబెర్రీలు : వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ న్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి కార్డియోవాస్క్యులర్ జబ్బుల నుంచి కాపాడతాయి. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్, సెర్వికల్, కోలన్, ఇసియోఫేగల్ వంటి క్యాన్సర్లు రాకుండా రక్షిస్తాయి.
Updated Date - Sep 28 , 2024 | 01:02 AM