ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : పిల్లల దంతారోగ్యం

ABN, Publish Date - Jun 27 , 2024 | 12:42 AM

డాక్టర్‌! మా అబ్బాయి వయసు ఆరేళ్లు. పిల్లల దంతాలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎత్తు పళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! మా అబ్బాయి వయసు ఆరేళ్లు. పిల్లల దంతాలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎత్తు పళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

  • పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు వల్ల దంతాలు, దవడల నిర్మాణంలో పొరపాట్లు చోటుచేసుకుంటాయి. కాబట్టి ఆ అలవాటును మాన్పించాలి.

  • కొంతమంది పిల్లలకు నాలుకతో దంతాలను నెట్టే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును కూడా మాన్పించాలి.

  • పాల దంతాలు సమయానికి ఊడకపోవడం వల్ల, ఆ ప్రదేశంలో వచ్చే శాశ్వత దంతాలు వంకరగా పెరుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే పాల దంతాలు సరైన సమయంలో ఊడిపోయేలా చూసుకోవాలి. ఇందుకోసం పిల్లలను దంత వైద్యుల చేత పరీక్ష చేయిస్తూ ఉండాలి.

  • వంకర పళ్లను సరిచేయించుకోకపోతే, భవిష్యత్తులో వాటిలో ప్లేక్‌ పేరుకుని పుచ్చిపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

ఓరల్‌ హెల్త్‌ ఇలా క్షేమం

  • పిల్లలకు చిన్నప్పటి నుంచే పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేయాలి. యాపిల్‌ లాంటి పండ్లతో దంతాలు, చిగుళ్లు శుభ్రపడతాయి.

  • క్యాల్షియం సప్లిమెంట్లతో దంతాలు దృఢంగా ఉంటాయి.

  • తీపి పదార్థాలను తగ్గించాలి. తిన్న వెంటనే దంతాలు శుభ్రం చేసుకోవాలి.

  • శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.

  • రోజుకు రెండు సార్లు బ్రష్‌ చేసుకోవాలి.

  • మెత్తని బ్రిసిల్స్‌ బ్రష్‌నే దంత ధావనానికి ఉపయోగించాలి.

  • ప్రతి మూడు నెలలకోసారి టూత్‌బ్రష్‌ను మారుస్తూ ఉండాలి.

  • ప్రతి ఆరు నెలలకోసారి దంత వైద్యుల చేత దంతాల ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి.

డాక్టర్‌ కడియాల రాజేంద్ర,

ఓరల్‌ అండ్‌ మ్యాక్సిలోఫేసియల్‌ సర్జన్‌,

హైదరాబాద్‌.

Updated Date - Jun 27 , 2024 | 12:43 AM

Advertising
Advertising