ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గింజల్లో రాజా రాజ్‌మా

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:23 AM

‘‘రాజమాషో గురుర్భూరిశకృద్‌ రూక్షోతివాతలః కషాయానురసః స్వాదురవృష్య శ్లేష్మపిత్తజిత్‌’’ అంటాడు శాస్త్రకారుడు.

‘‘రాజమాషో గురుర్భూరిశకృద్‌ రూక్షోతివాతలః

కషాయానురసః స్వాదురవృష్య శ్లేష్మపిత్తజిత్‌’’

అంటాడు శాస్త్రకారుడు. ఈ శ్లోకంలో రాజమాష అనే పేరున్న గింజ వల్ల కలిగే ప్రయోజనాలను వర్ణించాడు. రాజమాష అంటే పెద్ద మినపగింజ అని అర్థం. అదే జనవ్యవహారంలో రాజ్‌మా అయ్యింది. ఇది మినపగింజ కన్నా పెద్దగా- మూత్రపిండాల ఆకారంలో ఉంటుంది కాబట్టి- దీనిని ఇంగ్లీషులో కిడ్నీబీన్‌ అని కూడా అంటారు.

ఏ అవయవ ఆకారంలో ఉన్న ద్రవ్యాలు- ఆ అవయవాన్ని బలసంపన్నం చేస్తాయనేది ఒక సహజ సూత్రం. హృదయం ఆకారంలో ఉండే మామిడిపండు హృదయానికి మేలు చేస్తుంది. మెదడు ఆకారంలో ఉండే ఆక్రూట్స్‌ మెదడుని బలసంపన్నం చేస్తాయి. ఇదే విధంగా రాజ్‌మా మూత్రాశయ వ్యవస్థను శుభ్రపరిచి.. మూత్రపిండాలపై అదనపు భారం పడుకుండా అడ్డుకుంటుంది. అంతే కాదు.. మూత్ర పిండాల్లో రాళ్లను వెళ్లగొట్టే స్వభావం కూడా దీనికి ఉంటుంది. ఇంతే కాదు. రాజ్‌మా వల్ల అనేక ప్రయోజాలు ఉన్నాయి. ఇది కండరాల బలాన్ని పెంచుతుంది. చెడ్డుకొవ్వును తొలగిస్తుంది. దీనిలో ఉండే అధిక పీచుపదార్థం కారణంగా సులభంగా జీర్ణమవుతుంది. చెడ్డుకొవ్వు పెరగకుండా కూడా కాపాడుతుంది. దీనిలో కేలరీలు తక్కువ . అందువల్ల స్థూలకాయులు దీనిని నిస్సంకోచంగా తినవచ్చు. దీనిలో విటమిన్‌ కె అదనంగా లభిస్తూ ఉంటుంది. ఇక కొన్ని ద్రవ్యాలకు ద్వంద్వ ప్రవృత్తి ఉంటుంది. ఒక మంచి ఒక చెడుకలగలసి ఉంటాయి. చెడుని తట్టుకోగల శరీర దారుఢ్యం ఉన్నవారికి, బలమైన జీర్ణశక్తి ఉన్నవారికి రాజ్‌’మా ఉత్తమంగా పనిచేస్తుంది. జీర్ణశక్తి మధ్యస్థంగా ఉన్నవారికి దీని గుణాలు మధ్యస్థంగానే అందుతాయి. జాఠరాగ్ని అల్పంగా వారికి దీని వలన ఇబ్బందులు సిద్ధిస్తాయి. అంతే కాదు. భోజనకుతూహలం గ్రంధంలో ఈ రాజమాష గుణాలను ’స్వాదురవృష్యం‘ అని వర్ణించారు. అంటే ఇది రుచికరమే కానీ లైంగిక శక్తిని నశింపచేస్తుందని అని అర్థం. అంటే రాజ్‌మాను అతిగా కాకుండా పరిమితంగా తింటేనే మంచిదని అర్ధం.


  • రకరకాల వంటల్లో...

రాజ్‌మాను ఉత్తరభారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే పచ్చిగింజలను కనీసం 8 గంటలు నానబెట్టి అప్పుడు మాత్రమే తినాలి. లేకపోతే అజీర్ణ సమస్యలు రావచ్చు. అంతే కాదు. రాజ్‌మాను ఇతర ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తింటేనే ఎక్కువ రుచికరంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రాజ్‌మాను బాగా నానబెట్టి.. పెసరపప్పుతో కలిపి వడలు వేస్తారు. దీని వల్ల పెసరపప్పులోను, రాజ్‌మాలోను ఉంటే లక్షణాలన్నీ లభిస్తాయి. మరి కొన్ని ప్రాంతాల్లో రాజ్‌మాను మంటపై కాల్చి తింటారు. మరి కొందరు నానబెట్టి వేయించి తింటారు. ఈ మధ్యకాలంలో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, రాజ్‌మా, ఎండు మిరపకాయలను వేయించి.. దానిలో సైంధవ లవణాన్ని వేసి పొడి చేస్తున్నారు. దీనిని కంది పొడికి బదులుగా తినవచ్చు.

Updated Date - Nov 16 , 2024 | 05:23 AM