నేటి అలంకారం శ్రీ బాలాత్రిపురసుందరీదేవి
ABN, Publish Date - Oct 03 , 2024 | 06:04 AM
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, గురువారం శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజున శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదనీ, శ్రీ బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకెల్లా అత్యున్నతమైనదనీ ఆధ్యాత్మికులు చెబుతారు.
దుర్గా నవరాత్రులు
శ్రీ బాలాత్రిపురసుందరీదేవి
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, గురువారం శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజున శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదనీ, శ్రీ బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకెల్లా అత్యున్నతమైనదనీ ఆధ్యాత్మికులు చెబుతారు. అందుకే శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదటగా ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. షోడశ విద్యలకు ఆమె అధిష్ఠాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. త్రిపురాత్రయంలో బాలాత్రిపుర సుందరీదేవి మొదటి స్వరూపం. మహాత్రిపురసుందరీ దేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో తొలి ఆమ్నాయంలో ఉండే తొలి దేవత బాలాదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని పెద్దలు చెబుతారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం బాలాత్రిపురసుందరీదేవి. ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయనీ, సర్వ సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. ‘లలితా త్రిశతి’ పారాయణ చేస్తారు.
నైవేద్యం: పాయసం, పులగం
అలంకరించే చీర రంగు: లేత గులాబీ రంగు
అర్చించే పూల రంగు: అన్ని రకాలు
పారాయణ: లలితా త్రిశతి
Updated Date - Oct 03 , 2024 | 08:25 AM