Heroine Soundarya : అభినయంతోనే రాణించారు

ABN, Publish Date - Jul 07 , 2024 | 12:41 AM

తెలుగు సినిమా కథానాయికల్లో సౌందర్యది ప్రత్యేక స్థానం. గడచిన రెండు దశాబ్దాల కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు లభించిన అరుదైన నటి. హీరోయిన్‌ అనగానే పరిశ్రమలో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి.

Heroine Soundarya : అభినయంతోనే రాణించారు

తెలుగు సినిమా కథానాయికల్లో సౌందర్యది ప్రత్యేక స్థానం. గడచిన రెండు దశాబ్దాల కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు లభించిన అరుదైన నటి. హీరోయిన్‌ అనగానే పరిశ్రమలో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ అందాలు ప్రదర్శిస్తేనే నాయికగా కొనసాగుతారు. లేకపోతే ఇంటి దారి పట్టక తప్పదు అంటుంటారు. అయితే ఆ విషయంలో సౌందర్యకు మినహాయింపు లభించింది. ఎక్స్‌పోజింగ్‌ జోలికి పోకుండా కేవలం అభినయంతోనే రాణించవచ్చని ఆమె నిరూపించారు. అగ్రస్థానం అందుకున్నారు. కన్నడ చిత్రపరిశ్రమ నుండి తెలుగులోకి వచ్చారు సౌందర్య. ఆమె తండ్రి సత్యనారాయణ రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. తెలుగులో ఆమె అంగీకరించిన తొలి సినిమా ‘రైతు భారతం’. ఈ సినిమాలో హీరో కృష్ణ మరదలిగా, భానుచందర్‌ సరసన నటించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఆమెకు ‘మనవరాలి పెళ్లి’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. రైతు భారతం చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడంతో మనవరాలి పెళ్లి మొదట విడుదలైంది.


సొందర్య అసలు పేరు సౌమ్య. ఆమె గురించి విని రైతు భారతంలో బుక్‌ చేయడానికి ఆ చిత్ర దర్శకుడు త్రిపురనేని శ్రీ ప్రసాద్‌ బెంగళూరు వెళ్లారు. సౌమ్య ఇంటికి వెళ్లి ఆమెను చూసారు. ఆయనకు నచ్చడంతో ఆమె తండ్రి సత్యనారాయణతో మాట్లాడారు. సౌమ్య పేరు బాగానే ఉందా.. మార్చమంటారా అని అడిగారు సత్యనారాయణ. ఏదన్నా మూడు అక్షరాల పేరు బాగుంటుందేమో.. సావిత్రి, వాణిశ్రీ లా గుర్తింపు పొందడానికి.. అన్నారు శ్రీప్రసాద్‌. వెంటనే సత్యనారాయణ ఏవో లెక్కలు వేసి జాతకం ప్రకారం సౌందర్య అని పెడితే బాగుంటుంది..మీరేం అంటారు అని అడిగారు. బాగుంది. మంచి పేరు..అన్ని భాషలకు సరిపోతుంది అన్నారు శ్రీప్రసాద్‌. ఆ తర్వాత 5 వేలు అడ్వాన్స్‌ ఇచ్చారు. ఆ డబ్బు తీసుకొంటూ రేపటి అగ్ర నటికి మీరు ఇప్పుడు అడ్వాన్స్‌ ఇచ్చారు. మా అమ్మాయి జాతకం ఇప్పుడే చెబుతున్నాను వినండి. తను అగ్ర హీరోలందరి సరసన నటిస్తుంది. 8 ఏళ్ళు చాలా బిజీగా ఉంటుంది. 2004లో ఆమె కెరీర్‌ ఎండ్‌ అవుతుంది అని చెప్పారు సత్యనారాయణ. కూతురు మీద, ఆమె జాతకం మీద ఆయనకు అంత నమ్మకం. సత్యనారాయణ చెప్పినట్లే జరిగింది. అయితే కెరీర్‌ ఎండ్‌ అవుతుంది అని చెప్పారు కానీ 2004 ఏప్రిల్‌ 17న సౌందర్య జీవితం ముగుస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు.

Updated Date - Jul 07 , 2024 | 12:41 AM

Advertising
Advertising
<