Winter Care : చలి పులికి దూరంగా...
ABN, Publish Date - Oct 29 , 2024 | 05:01 AM
ఒకసారి సోకే ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10% తరుగుతూ ఉంటుంది. పదే పదే ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం క్రమేపీ తగ్గిపోయి, తిరిగి సరిదిద్దలేని పరిస్థితి వస్తుంది.
వింటర్ కేర్
ఒకసారి సోకే ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10% తరుగుతూ ఉంటుంది. పదే పదే ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం క్రమేపీ తగ్గిపోయి, తిరిగి సరిదిద్దలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి లంగ్స్‌కు ఇన్‌ఫెక్షన్ సోకితే ‘మందులతో నయం చేసుకోవచ్చు’ అనే ధీమా వదులుకోవాలి. సమస్య వచ్చిన తర్వాత చికిత్స తీసుకునే బదులు, ఆ సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం....
ముక్కు, నోరు, చెవులకు చల్లగాలి సోకకుండా స్కార్ఫ్ కట్టుకోవాలి.
విపరీతమైన చల్లదనం ఉండే వేళల్లో బయటకు వెళ్లకూడదు. మరీ ఉదయాన్నే లేదా రాత్రి వేళ ఇంటిపట్టునే ఉండాలి.
రెండు రోజుల్లో జలుబు తగ్గకపోయినా, జ్వరం మొదలైనా వైద్యుల్ని కలవాలి.
ఆయాసం ఎక్కువైనా, కఫం రంగు మారినా వైద్యులను కలవటం తప్పనిసరి.
నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల కఫం తేలికగా కరిగి బయటకొస్తుంది. కాబట్టి నీళ్లు ఎక్కువ తాగాలి.
డీప్ బ్రీదింగ్ ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా కఫం బయటకు వచ్చేస్తుంది.
మూసి ఉండే గదుల్లో కాకుండా గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి.
ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు చలి కాలంలో ఏసి గదులకు దూరంగా ఉండాలి. సినిమా హాళ్లు, ఆడిటోరియంలు లాంటి జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవటమే మంచిది.
అగర్‌బత్తీలు, ఇతర పొగల వల్ల ఊపిరితిత్తులు అలసటకు లోనవుతాయి. కాబట్టి పొగలకు దూరంగా ఉండాలి.
కాలుష్యం కలగలసిన పొగమంచు...‘స్మాగ్’ ఊపిరితిత్తులకు చేటు చేస్తుంది. స్మాగ్ ఎక్కువగా ఉండే ఉదయం వేళల్లో బయటకు వెళ్లకపోవమే మంచిది.
Updated Date - Oct 29 , 2024 | 05:01 AM