ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పతకాల వేటలో ఐరన్‌ లేడీ

ABN, Publish Date - Sep 04 , 2024 | 04:18 AM

‘ఎంచుకున్న రంగంలో కృషి చెయ్యడమే విజయానికి మార్గం. కానీ ‘ఏది, ఎందుకు ఎంచుకున్నాం?’ అనే ప్రశ్నకు సమాధానాలు భిన్నంగా ఉంటాయి. నేను స్విమ్మింగ్‌ను ఎంచుకోవడం, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం వెనుక ఉన్నది... ఒక అవమానం

ఆకాంక్ష, అంకితభావం ఉంటే... లక్ష్యాన్ని చేరుకోవడానికి వయసుతో పని లేదు... ఇది రంజితా గొగోయ్‌ తన జీవితానుభవంతో చెప్పే మాట. దాదాపు యాభయ్యేళ్ళ వయసులో ఈత కొలనులోకి దిగిన ఆమె పట్టుదలతో సాధన చేశారు. అరవై రెండేళ్ళ వయసులోనూ వివిధ క్రీడల్లో పతకాలు గెలుస్తూ ‘అసోం ఐరన్‌ లేడీ’గా ఖ్యాతిని సాధించారు.

‘‘ఎంచుకున్న రంగంలో కృషి చెయ్యడమే విజయానికి మార్గం. కానీ ‘ఏది, ఎందుకు ఎంచుకున్నాం?’ అనే ప్రశ్నకు సమాధానాలు భిన్నంగా ఉంటాయి. నేను స్విమ్మింగ్‌ను ఎంచుకోవడం, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం వెనుక ఉన్నది... ఒక అవమానం. అలాగని పనిగట్టుకొని నన్ను ఎవరూ అవమానించలేదు. నాకు ఎదురైన ఒక సందర్భం... నాకే అవమానంగా అనిపించింది. దాని గురించి వివరించేముందు... నా నేపథ్యం గురించి చెప్పాలి.


ఆ సంఘటన ఆత్మన్యూనత పెంచింది...

గోలాఘాట్‌... అసోం రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం. నేను అక్కడే పుట్టాను. మేము అయిదుగురు తోబుట్టువులం. తోటి పిల్లలతో కలిసి ఆటపాటలతో నా బాల్యం గడిచింది. చదువుతోపాటు ఆటల్లోనూ నేను నేనే ఫస్ట్‌. మా కాలేజీ వాలీబాల్‌ జట్టుకు నేను కెప్టెన్‌ని. ఇంటర్‌ కాలేజీ పోటీల్లో మా టీమ్‌ ఎన్నో విజయాలు సాధించింది. కానీ క్రమంగా చదువుకు, కెరీర్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో క్రీడల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేశాక... ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. కొన్నాళ్ళకు పెళ్ళయింది. నా భర్తకు ఫిలిప్పీన్స్‌లో పిహెచ్‌డి చేసే అవకాశం రావడంతో... ఉద్యోగం మానేసి ఆయన వెంట వెళ్ళాను. అక్కడ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ కోర్సులో చేరాను. అక్కడ చాలామంది మిత్రులయ్యారు. పార్టీలు కూడా జరిగేవి. ఒక పార్టీలో ‘దంపతులు కలిసి ఈత కొట్టడం’ అనే ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. నా భర్త కూడా నాతోపాటు ఈత కొలనులో దిగారు. కానీ నాకు ఈత రాదు. అందరు నన్ను ఈత కొట్టాలని అరుస్తున్నారు. నేను కొలను అంచులో ఉన్న గట్టుని పట్టుకొని భయంగా నిలబడిపోయాను. అది నాకు చాలా అవమానంగా అనిపించింది. నాలో ఆత్మన్యూనతను పెంచిన సంఘటన అది. దాంతో ఎలాగైనా ఈత నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈలోగా నా భర్త పిహెచ్‌డి పూర్తి కావడంతో... మేము తిరిగి ఇండియా వచ్చేశాం. నేను మళ్ళీ ఉద్యోగంలో చేరాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. నాకు స్విమ్మింగ్‌ రాదనే న్యూనత మాత్రం అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఇదంతా జరిగింది 1990ల్లో. అప్పట్లో స్విమ్మింగ్‌ శిక్షణ సదుపాయాలు చాలా తక్కువ. మాకు అస్సలు అందుబాటులో లేవు. కాబట్టి ఆ ఆలోచన దాదాపు వదిలేసుకున్నాను. కానీ కొన్నేళ్ళ తరువాత నా కోరిక నెరవేర్చుకొనే అవకాశం వచ్చింది.


క్రౌడ్‌ ఫండింగ్‌తో ఆ కల నెరవేరింది...

మేము అసోంలోని జోర్హాట్‌ నగరంలో స్థిరపడ్డాం. 2011లో ‘స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌ఎ్‌ఫఐ) అక్కడ ఒక ఈత కొలను ఏర్పాటు చేసి, శిక్షణ ప్రారంభించింది. అప్పటికి నాకు నలభై తొమ్మిదేళ్ళు. నేను నేర్చుకోవడానికి ఇబ్బంది పడతానని ట్రైనర్స్‌ అనుకున్నారు. కానీ విద్యార్థిగా ఉన్నప్పుడు క్రీడల్లో చురుగ్గా ఉండడమే కాదు... ఆ తరువాత కూడా వ్యాయామాన్ని కొనసాగించాను కాబట్టి నాకది కష్టంగా అనిపించలేదు. నా రోజువారీ కార్యక్రమాల్లో స్విమ్మింగ్‌ ఒక భాగమైపోయింది. కొన్ని నెలల్లోనే ప్రావీణ్యం సంపాదించాను. ఎస్‌ఎ్‌ఫఐ ప్రోత్సాహంతో... తొలిసారిగా జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని గెలిచాను. నా విజయపరంపర అప్పటి నుంచి మొదలయింది. అనేక అంతర్‌ జిల్లా పోటీల్లో బంగారు పతకాలు సాధించడంతో... నాకు మంచి గుర్తింపు వచ్చింది. నా కోచ్‌లకు నా మీద పూర్తిగా నమ్మకం కుదిరింది. బ్రెస్ట్‌ స్ట్రోక్‌, బ్యాక్‌ స్ట్రోక్‌, బట్టర్‌ ఫ్లై స్ట్రోక్‌ ... ఇలా భిన్నమైన అంశాల్లో నా ప్రతిభకు మెరుగుపెట్టుకున్నాను. పాల్గొన్న ప్రతి పోటీలో ఏదో ఒక పతకం అందుకుంటున్నాను. అంతర్జాతీయ స్థాయికి వస్తే.... గత ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా ఫసిఫిక్‌ మాస్టర్‌ గేమ్స్‌లో... ఒక రజతాన్ని, ఒక కాంస్యాన్ని అందుకున్నాను. ఆ పోటీల్లో పాల్గొనడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడు మా అబ్బాయి... క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నా కల నిజం చేశాడు. ఫిట్‌నెస్‌ కోసం రోజూ జిమ్‌కు వెళ్తాను. ఈ క్రమంలోనే ఒక అథ్లెటిక్స్‌ అంటే ఆసక్తి ఏర్పడింది. పవర్‌ లిఫ్టింగ్‌, ఆర్మ్‌ రెజ్లింగ్‌... ఇలా ఎన్నో సాధన చేశాను. ఈ ఏడాది ‘జాతీయ ఆర్మ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షి్‌ప’లో రజత పతకంతోపాటు ‘నేషనల్‌ మాస్టర్స్‌ గేమ్స్‌’లో... వివిధ అంశాల్లో స్వర్ణాలు, ‘పాన్‌ ఇండియా మాస్టర్స్‌ గేమ్స్‌ ఫెడరేషన్స్‌’ నిర్వహించిన స్విమ్మింగ్‌ ఈవెంట్స్‌లో మూడు స్వర్ణ పతకాలు అందుకున్నాను. ఇక రిలే పరుగు పందెంలో స్వర్ణం,లాంగ్‌ జంప్‌లో రజత, కాంస్య పతకాలు కూడా నా ఖాతాలో ఉన్నాయి. ఈ నెల 30 నుంచి గ్రీస్‌లో జరిగే ‘ఇఫా వరల్డ్‌ ఆర్మ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షి్‌ప్స’కు సిద్ధమవుతున్నాను.


కొత్తగా ప్రయత్నించడం ఇష్టం...

ఇప్పుడు నా వయసు అరవై రెండేళ్ళు. ‘ఐరన్‌ లేడీ ఆఫ్‌ అసోం’గా క్రీడా వర్గాలు, మీడియా నన్ను పిలుస్తూ ఉంటాయి. ‘‘ఇన్ని ఎలా చెయ్యలుగుతున్నావ్‌? వీటన్నిటికీ సమయం ఎలా దొరుకుతోంది?’’ అని నా బంధుమిత్రులు అడుగుతూ ఉంటారు. ఏదైనా కొత్తగా ప్రయత్నించడం అంటే ఇష్టం. నా భర్త రిటైర్‌ అయ్యారు. పిల్లలు పెద్దవారయ్యారు. కాబట్టి బాధ్యతలు కొంచెం తగ్గాయి. దీంతో పూర్తిగా క్రీడల మీదనే దృష్టి పెట్టగలుగుతున్నాను. రోజూ పొద్దున్న ఆరింటికి లేస్తాను. ఒక కప్పు జ్యూస్‌ లేదా టీ తాగుతాను. అయిదు నుంచి ఆరు వరకూ స్విమ్మింగ్‌... ఆ తరువాత జిమ్‌కు వెళ్ళి ఒక గంట వర్కవుట్స్‌ చేస్తాను. వారంలో కొన్ని రోజులపాటు పవర్‌ లిఫ్టింగ్‌, ఆర్మ్‌ రెజ్లింగ్‌ శిక్షణ తీసుకుంటాను. ఖాళీ సమయాల్లో నా భర్తతో కలిసి గార్డెనింగ్‌ చెయ్యడం అంటే ఇష్టం. ఇది నా ఒత్తిళ్ళను బాగా తగ్గిస్తుంది. ఆహ్లాదంగా ఉంటుంది. ఈ రోజు వరకూ నేను ఒక్క మాత్ర కూడా వేసుకోలేదు. నన్ను నేను బిజీగా ఉంచుకోవడమే నా ఆరోగ్య రహస్యం అనుకుంటున్నాను. ఏదైనా సాధించడానికి వయసు అవరోధం కాదు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆకాంక్ష, అంకితభావం ఉంటే చాలు. యువతకు నేను ఎప్పుడూ ఇదే చెబుతాను.’’

Updated Date - Sep 04 , 2024 | 04:18 AM

Advertising
Advertising