ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అలనాటి కథ : ఆయనంటే నిజాంకు ఎంతో గౌరవం

ABN, Publish Date - May 12 , 2024 | 02:23 AM

స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రజా సేవలో నిమగ్నమైన అనేకమంది సమర్థులు నిజాం ప్రభుత్వంలో ఉన్నత స్థానాలు పొందారు. అలాంటివారిలో నవాబ్‌ చహతారి ఒకరు.

స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రజా సేవలో నిమగ్నమైన అనేకమంది సమర్థులు నిజాం ప్రభుత్వంలో ఉన్నత స్థానాలు పొందారు. అలాంటివారిలో నవాబ్‌ చహతారి ఒకరు. నిజాం ప్రభుత్వంలో ప్రధానిగా పని చేసి, రజాకార్‌ ఉద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చేసిన నవాబ్‌ చహతారి గురించి అతి తక్కువ మందికి తెలుసు. మహరాజా కిషన్‌ప్రసాద్‌ తర్వాత హైదరాబాద్‌ ప్రధానిగా పదవి చేపట్టిన చహతారితో నాకు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది.

డిసెంబర్‌ 1944... చలికాలం. ఒకప్పుడు హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నీ పొలాలే ఉండేవి. దీనివల్ల చలి కూడా ఎక్కువగా ఉండేది. తేదీ గుర్తు లేదు కానీ ఒక రోజు మా నాన్న రాజా ధన్‌రాజ్‌గిర్‌ నన్ను పిలిచి... ‘‘మనకు కొత్త ప్రధానమంత్రి వచ్చారు. ఆయన గౌరవార్థం మనం పార్టీ ఇస్తున్నాం. నువ్వు వారికి ఆతిథ్యం ఇవ్వాలి’’ అని చెప్పారు. ఆ మర్నాడు ప్యాలెస్‌ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్యాలెస్‌ అంతా దీపాలతో అలంకరించారు. సాయంత్రం అతిథులు అందరూ రావటం మొదలుపెట్టారు. ప్యాలెస్‌ పోర్టికోలో ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. నాన, నేను, తమ్ముళ్లు కలిసి నవాబ్‌ సాబ్‌కు స్వాగతం చెప్పటానికి పోర్టికోలోకి వెళ్లాం. నాన్న నవాబ్‌ సాబ్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి... ‘‘వెల్‌కం టూ హైదరాబాద్‌’’ అని స్వాగతించారు. నవాబ్‌ సాబ్‌ ఒక తెల్లటి షెర్వానీ వేసుకున్నారు. వాటికి డైమండ్‌ బటన్స్‌ మెరుస్తూ కనిపించాయి. ఆ తర్వాత నాన్న, నవాబ్‌సాబ్‌ అతిథులందరూ వేచి చూస్తున్న డిన్నర్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్లిపోయారు. తమ్ముళ్లిద్దరూ నన్ను వదిలేసి ఆడుకోవటానికి పారిపోయారు.


నేను, మా గవర్నెస్‌ మాత్రం గేటు దగ్గరే ఉండిపోయాం. ఈ లోపు నాన్న నా కోసం కబురు పంపారు. ఆ సమయంలో నేను చిన్నపిల్లనే అయినా... ఏవైనా పార్టీలు అయినప్పుడు చీర కట్టేవారు. నాకు ఆ చీర ఊడిపోతుందనే భయం ఉండేది. దాంతో నా దృష్టంతా చీర మీదే ఉండేది. అటు ఇటూ కదలాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. నెమ్మదిగా నడుచుకుంటూ నాన్న దగ్గరకి వెళ్లా. నాన్న నన్ను నవాబ్‌ సాబ్‌కు పరిచయం చేశారు. నేను ఆయనకు ఆదాబ్‌ చేసి, ఆశీర్వాదం తీసుకున్నా. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. దూరంగా ఒక కుర్చీ లాక్కొని కూర్చున్నా. మా అమ్మ కోసం వెతికా. ఆ రోజుల్లో పార్టీలు అయితే మహిళలు పై అంతస్తులో వేరుగా కూర్చుని, కింద ఉన్న మగవాళ్లను చూస్తూ ఉండేవారు. అమ్మ పై అంతస్తులో కూర్చుని మిగిలిన అతిథులతో మాట్లాడుతోంది. నాకు ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చుండిపోయా. కాసేపటి తర్వాత ప్రముఖ గాయని కేసరిబాయ్‌ ఖేడ్కర్‌ కచేరీ కోసం అందరూ మ్యూజిక్‌ రూమ్‌ వైపు వెళ్లారు. ఆ రోజుల్లో కేసరీబాయ్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉండేది. ఆమె చాలాసార్లు జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌కు వచ్చి నెల రోజుల వరకూ ఉండేవారు. ఆమె గానాన్ని వినటానికి అనేకమంది అతిథులు వస్తూ ఉండేవారు. నవాబ్‌ సాబ్‌కు సంబంధించి ఇది నా తొలి జ్ఞాపకం.

ఆ తర్వాత కాలంలో కూడా నేను చాలాసార్లు నవాబ్‌ సాబ్‌ను కలిశాను. ఆయన ఇతరులు చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినేవారు. ఆ తర్వాత సమాధానం కూడా చాలా సూటిగా ఉండేది. బహుశా ఈ గుణాలవల్లే ఆయన జాతీయోద్యమంలో ఒక ముఖ్య పాత్ర పోషించగలిగారేమో. అవిభాజ్య భారత దేశంలోని యునైటెడ్‌ ప్రావెన్స్‌లో ఆయన మంత్రిగా పని చేశారు. 1930లో లండన్‌లో జరిగిన తొలి రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ముస్లిం డెలిగేషన్‌లో నవాబ్‌ సాబ్‌ కూడా సభ్యుడు. ఆయనకు గాంధీజీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. జిన్నా సిద్ధాంతాలతో ఆయన విభేదించేవారు. కానీ, ఆయనకు ఉన్న విషయ పరిజ్ఞానాన్ని నిజాం చాలా మెచ్చుకొనేవారు.


ప్రస్తుతం ఖైరతాబాద్‌లో ఉన్న ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ భవనానికి పునాది వేసింది నవాబ్‌ సాబే. 1947 జూలైలో హైదరాబాద్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌ను కోరటానికి నవాబ్‌ సాబ్‌ను, తన రాజ్యాంగ సలహాదారు వాల్టర్‌ మానక్‌టన్‌ను ఢిల్లీ పంపాలనుకున్నారు. అయితే ఈలోపే రజాకార్ల దాడులు ప్రారంభమయ్యాయి. దీంతో నవాబ్‌ సాబ్‌ తన పదవికి రాజీనామా చేశారు. అయితే దీన్ని నిజాం అంగీకరించలేదు. నవాబ్‌ సాబ్‌ పట్ల నిజాంకు ఉన్న గౌరవాన్ని ఈ సంఘటన తెలియజేస్తుంది.

నా చిన్నప్పుడు రాజ కుటుంబాలలోని మహిళలు పరదా పద్ధతిని పాటించేవారు. సాధారణంగా రాజ కుటుంబాలకు చెందిన మహిళలు బయటకు వెళ్లాల్సి వస్తే నల్ల అద్దాలు ఉన్న కార్లనే వాడేవారు. ఎప్పుడైనా మేము బొంబాయికి వెళ్తే... అక్కడ రైల్వే స్టేషన్‌లో మా కోసం ఒక పెద్ద గొడుగు పట్టుకొని ఒక మహిళ ఉండేది. ఆ గొడుగును అడ్డం పెట్టి మమ్మల్ని కార్ల దాకా తీసుకువెళ్లేవారు.

రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌

Updated Date - May 12 , 2024 | 02:23 AM

Advertising
Advertising