ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వినాయకుడి మండపాల అలంకరణ ఇలా!

ABN, Publish Date - Sep 05 , 2024 | 04:10 AM

వినాయకచవితికి వినాయకుడిని పెద్ద పెద్ద మండపాల్లో మాత్రమే కాదు.. ఇళ్లలో కూడా అందంగా అలకరించుకుంటారు. అయితే ఆ అలంకరణ ఎలా చేయాలనే విషయంలో చాలా మందికి సందిగ్దత ఉంటుంది. దీనిని తొలగించటానికి...

వినాయకచవితికి వినాయకుడిని పెద్ద పెద్ద మండపాల్లో మాత్రమే కాదు.. ఇళ్లలో కూడా అందంగా అలకరించుకుంటారు. అయితే ఆ అలంకరణ ఎలా చేయాలనే విషయంలో చాలా మందికి సందిగ్దత ఉంటుంది. దీనిని తొలగించటానికి నాలుగు రకాల అలంకరణలను మీకు సూచిస్తున్నాం..

పూల మండపం

మండపానికి పూలు ఇచ్చినంత శోభ- మరే ఇతర అలంకారాలతోను రాదు. అంతే కాదు పువ్వులు పాజిటివిటీకి, స్వచ్ఛతకు ప్రతిరూపాలు కూడా! రకరకాల పువ్వులను తీసుకువచ్చి.. వాటిని గణపతి వెనక అందంగా పేరిస్తే- అద్భుతమైన మండపం అవుతుంది. బంతి పువ్వులు, చేమంతులతో పాటుగా గులాబీలను అందమైన బొకేలుగా తయారుచేసి మండపం ముందు పెడితే చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.

దుప్పట్టాలతో...

ఎరుపు, పసుపు, ఆకుపచ్చ- ఇలా మన ఇళ్లలో రకరకాల దుప్పట్టాలు ఉంటాయి. వీటిలో తీసుకొని మండపాన్ని జాగ్రత్తగా అలంకరిస్తే- మొత్తం లుక్‌ మారిపోతుంది. ఒక వేళ ఇంట్లో కొత్త దుప్పట్టాలు లేకపోతే- ప్రత్యామ్నా యంగా శాలువాలను కూడా ఉపయోగించవచ్చు.


లైట్లతో అందం...

చిన్న చిన్న అరటి మొక్కలు.. వెనక ధగధగలాడే లైట్లు- ముందు అందమైన వినాయకుడు.. ఈ తరహా మండపాన్ని ఊహించుకుంటేనే ఆనందంగా అనిపిస్తుంది. అయితే లైట్ల కనెక్షన్‌ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. దీనికి కూడా అయ్యే ఖర్చు తక్కువే!

రంగు రంగుల కాగితాలతో...

రంగు కాగితాలు మనకు స్టేషనరీ షాపుల్లో దొరుకుతాయి. వీటిని అందంగా కట్‌ చేయటం ఎలాగో యూట్యూబ్‌లో అనేక మంది నేర్పుతున్నారు. కొన్ని కాగితాలు కొని- వాటిని అందమైన ఆకృత్తుల్లో కట్‌ చేసి గణేష్‌ మండపానికి వెనక అందిస్తే చూడటానికి చాలా బావుంటుంది. దీనికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.

Updated Date - Sep 05 , 2024 | 04:10 AM

Advertising
Advertising