Navya : చర్మం మర్మం
ABN, Publish Date - Jun 09 , 2024 | 12:15 AM
చిట్కాలు అన్ని సమయాల్లో ఫలితాన్నివ్వవు. పైగా కొన్నిసార్లు వికటిస్తాయి కూడా! మరీ ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం అనుసరించే చిట్కాల పట్ల రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి.
చిట్కాలు అన్ని సమయాల్లో ఫలితాన్నివ్వవు. పైగా కొన్నిసార్లు వికటిస్తాయి కూడా! మరీ ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం అనుసరించే చిట్కాల పట్ల రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి. చర్మానికి హానిని కలుగజేసే కొన్ని సాధారణ చిట్కాల గురించి తెలుసుకుందాం!
సోషల్ మీడియాలో చర్మ సౌందర్యాన్ని పెంచే ఎన్నో రకాల చిట్కాలు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటి ప్రామాణికతలను తెలుసుకోకుండా, అనుసరిస్తే చర్మం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. చర్మం సున్నితమైన అవయవం కాబట్టి, తోచిన చిట్కా అనుసరించడం ప్రమాదకరం. మరీ ముఖ్యంగా ముఖ చర్మపు మెరుపు కోసం, తెల్లదనం కోసం చర్మపు తత్వంతో సంబంధం లేకుండా తోచిన పదార్థాలను పూసుకోవడం కరెక్టు కాదు. కొన్ని పదార్థాలు ముఖ చర్మానికి నేరుగా పూసుకోవడం వల్ల ఊహించని స్థాయలో నష్టం జరగవచ్చు.
చర్మ సౌందర్యాన్ని పెంచే ఉత్పత్తుల్లో నిమ్మరసం ప్రధానమైనది. ఎన్నో రకాల సౌందర్య సాధనాల్లో నిమ్మ కచ్చితంగా ఉంటూ ఉంటుంది. విటమిన్ సిని కలిగి ఉండే నిమ్మరసానికి చర్మపు మెరుపును పెంచే స్వభావం ఉన్నా, నేరుగా చర్మానికి పూసుకోకూడదు. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని కందిపోయేలా చేస్తుంది. పొడిచర్మ తత్వం ఉన్నవాళ్ల చర్మం పగులుతుంది.
నిమ్మరసం నేరుగా పూసుకోకూడదు
చర్మ సౌందర్యాన్ని పెంచే ఉత్పత్తుల్లో నిమ్మరసం ప్రధానమైనది. ఎన్నో రకాల సౌందర్య సాధనాల్లో నిమ్మ కచ్చితంగా ఉంటూ ఉంటుంది. విటమిన్ సిని కలిగి ఉండే నిమ్మరసానికి చర్మపు మెరుపును పెంచే స్వభావం ఉన్నా, నేరుగా చర్మానికి పూసుకోకూడదు. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని కందిపోయేలా చేస్తుంది. పొడిచర్మ తత్వం ఉన్నవాళ్ల చర్మం పగులుతుంది.
మొటిమలకు టూత్‌పేస్ట్ వద్దు
టూత్‌పేస్ట్ తయారీలో ఎన్నో రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. దంతాలను శుభ్రం చేయడం కోసం ఉద్దేశించిన టూత్‌పేస్ట్‌ను మొటిమల మీద పూసుకోవడం సరి కాదు. టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్, మెంథాల్, గరుకుగా ఉండే పదార్థాలు ఉంటాయి. వీటి వల్ల చర్మం మీద దద్దుర్లు, అలర్జీలు రావచ్చు. టూత్‌పేస్ట్‌లోని ఆల్కహాల్‌తో చర్మంలోని సహజసిద్ధ నూనెలు తగ్గిపోయి, చర్మం పొడిబారిపోవచ్చు. కాబట్టి మొటిమల సమస్యను వైద్యంతోనే చక్కదిద్దుకోవాలి.
చక్కెర, ఉప్పు స్క్రబ్బర్స్ కావు
మృత కణాలను తొలగించుకోవడం కోసం చక్కెర, లేదా ఉప్పులతో చర్మాన్ని రుద్దుకోకూడదు. ఎక్స్‌ఫోలియేషన్ కోసం వీటిని ఉపయోగిస్తే, చర్మం పగిలి, ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. చర్మం ఎర్రబారి, పొట్టు తేలి, దద్దుర్లు, దురదలు మొదలవుతాయి. కాబట్టి ఎక్స్‌ఫోలియేషన్ కోసం ఉద్దేశించిన స్క్రబ్బర్స్ మాత్రమే ఉపయోగించాలి.
Updated Date - Jun 09 , 2024 | 03:19 AM