Healthy Recipe : రాగి మొలకల జావ
ABN, Publish Date - Oct 29 , 2024 | 04:52 AM
రక్తహీనత తొలగాలంటే ఐరన్ ఎక్కువగా తీసుకోవాలి. రాగులను ఎండబెట్టి, పిండి కొట్టించి వాడుకోడానికి బదులుగా,
హెల్తీ రెసిపి
రక్తహీనత తొలగాలంటే ఐరన్ ఎక్కువగా తీసుకోవాలి. రాగులను ఎండబెట్టి, పిండి కొట్టించి వాడుకోడానికి బదులుగా, వాటిని మొలకెత్తించి జావ కాచుకుంటే, సమృద్ధిగా ఐరన్ సమకూరి, రక్తహీనత తొలగిపోతుంది.
రాగులను శుభ్రం చేసుకుని, రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి.
మరుసటి రోజు శుభ్రమైన పలుచని కాటన్ టవల్‌లో రాగులను మూటగట్టి పైన బరువుంచాలి.
తర్వాతి రోజుకి రాగులు మొలకెత్తుతాయి.
ఇలా మొలకెత్తిన రాగులను ఒక రోజంతా నీడలో ఎండబెట్టి, పిండి కొట్టుకోవాలి.
ఈ పిండితో జావ లేదా సంకటి తయారు చేసుకుంటే రెట్టింపు పోషకాలు, ఐరన్ అందుతాయి.
Updated Date - Oct 29 , 2024 | 04:52 AM