OTT: ఈ వారమే విడుదల
ABN, Publish Date - Dec 29 , 2024 | 04:33 AM
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ప్రేమ కోసం తపించే హృదయాలు
‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. కేన్స్ చిత్రోత్సవంలో రెండో అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ ప్రిక్స్’ను అందుకుంది. ఒక భారతీయ చిత్రం ఈ అవార్డును అందుకోవడం ఇదే తొలిసారి. అలాగే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో రెండు నామినేషన్స్ సాధించింది.
ఈ చిత్రాన్ని తెలుగులో నటుడు రానా విడుదల చేశారు. కేరళ నుంచి ముంబైకు వచ్చి అక్కడ నర్సులుగా పనిచేస్తున్న ప్రభ, అను అనే ఇద్దరమ్మాయిల కథ ఇది. ఓ రోడ్ ట్రిప్ వారి జీవితాల్లో ఎలాంటి మార్పుకు కారణమైందనేది కథ. ప్రేమ కోసం తపించే హృదయాలను, ముంబై నగరంలో ఓ గూడు కోసం అలమటించే పేదల ఆవేదనను కపాడియా అద్భుతంగా ఆవిష్కరించారు.
Updated Date - Dec 29 , 2024 | 04:33 AM