ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం.. స్పందించిన వివేక్ రామస్వామి

ABN, Publish Date - Jul 14 , 2024 | 05:36 PM

డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనను భారత అమెరికన్ టెక్ ఆంత్రప్రెన్యూర్ వివేక్ రామస్వామి ఖండించారు. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బటయపడటం దైవ సంకల్పమని వ్యాఖ్యానించారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా (USA) అధ్యక్ష రేసులో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనను భారత అమెరికన్ టెక్ ఆంత్రప్రెన్యూర్ వివేక్ రామస్వామి ఖండించారు. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బటయపడటం దైవ సంకల్పమని వ్యాఖ్యానించారు. దేశం కోసం, ట్రంప్ కోసం దేవుడే కల్పించుకున్నాడని తన మనసు చెబుతోందని వ్యాఖ్యానించారు. వెంట్రుకల వాసిలో అమెరికా భవిష్యత్తుకు ప్రమాదం తప్పిందని అన్నారు. కాబోయే దేశాధ్యక్షుడి నిజమైన వ్యక్తిత్వం దేశ ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కిందన్నారు. అగ్గిని, తూటాను ఎదుర్కొన్ని, రక్తాన్ని చూసి మళ్లీ తన ప్రజలు కోసం ట్రంప్ లేచి నిలబడ్డారని అన్నారు.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే.. అతని ఉద్దేశం ఏంటంటే?


మరోవైపు, అధ్యక్షుడు జోబైడెన్‌పై విమర్శలు గుప్పించారు. మొదట ట్రంప్‌పై కేసులు వేశారని, తరువాత ఎన్నికలకు దూరం చేసే ప్రయత్నం చేశారని అన్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే నేటి ఘటన పూర్తిగా ఆశ్చర్యకరమేమీ కాదన్నారు. బైడెన్ కంటితడుపు మాటలు, దాడిని ఖండించడాలు భవిష్యత్తులో ఎవరూ పట్టించుకోరని అన్నారు. ఈ పరిస్థితి దారి తీసిన విషపూరిత వాతావరణాన్ని ఎన్ని మాటల గారడీలు మరుగు చేయలేవని వ్యాఖ్యానించారు. ఎవరు ఏ నేతకు మద్దతు పలికినా నేటి ఘటన అమోదయోగ్యం కాదన్న అంశంపై అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు (Act Of God Vivek Ramaswamy After Trump Survives Assassination Bid ).

రామస్వామి పోస్టుపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. ఇలా జరుగుతుందని నువ్వు ముందే ఊహించావంటూ రామస్వామి పోస్టుకు మస్క్ రిప్లై ఇచ్చారు. అయితే, తన అంచనా తప్పు కావాలని మనస్ఫూర్తిగా అప్పట్లో కోరుకున్నట్టు వివేక్ బదులిచ్చారు. బట్లర్ టౌన్‌లో తన ట్రంప్ ప్రసంగాన్ని మొదలెట్టగానే తుటా ఆయన వైపు దూసుకొచ్చింది. చెవికి గాయం చేయడంతో ఆయన ముఖంపై రక్తం ధార కారింది. వెంటనే రంగంలోకి దిగిన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆయనను చుట్టుముట్టి స్టేజ్ పై నుంచి కిందకు దింపేశారు. నిందితుడిని 20 ఏళ్ల థామస్ మ్యాథ్యూ క్రుక్ గా గుర్తించారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 05:38 PM

Advertising
Advertising
<