ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: బే ఏరియాలో ‘దేవర' ఫీవర్.. ఫ్యాన్స్ హంగామా!!

ABN, Publish Date - Sep 27 , 2024 | 08:24 PM

దేవర సినిమా ఫివర్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌నూ తాకింది. అమెరికాలోని బే ఏరియాలో 'దేవర' ఫీవర్ వేరే లెవల్‌లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలకు కొబ్బరికాయలు కొట్టి, కటౌట్‌కు పాలాభిషేకం చేసి, కేక్ కటింగ్ చేసి హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నారై డెస్క్: మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివల కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ఫుల్‌లెంగ్త్‌ మాస్ మూవీలో నటించడంతో జనతా గ్యారేజ్ తరహాలో ఈ చిత్రం కూడా బంపర్ హిట్ కొట్టిందని ఫ్యాన్స్ హంగామా చేశారు (NRI).

NRI: ప్రతిభకు జేజేలు! తానా బ్యాడ్మింటన్‌ పోటీలు విజయవంతం


ఈ క్రమంలోనే ఈ సినిమా ఫివర్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌నూ తాకింది. అమెరికాలోని బే ఏరియాలో 'దేవర' ఫీవర్ వేరే లెవల్‌లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలకు కొబ్బరికాయలు కొట్టి, కటౌట్‌కు పాలాభిషేకం చేసి, కేక్ కటింగ్ చేసి హర్షం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, తన నట విశ్వరూపం చూపించి డబుల్ రోల్‌లో అదరగొట్టడంతో ఫ్యాన్స్‌కు థియేటర్‌లో పూనకాలు వస్తున్నాయి.

NRI: తానా కళాశాల పరీక్షలు విజయవంతం


జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అజయ్ యార్లగడ్డ పర్యవేక్షణలో శ్రీకాంత్ దొడ్డపనేని, కళ్యాణ్ కోటా, లక్ష్మణ్ పరుచూరి, సాయి కిరణ్ యనమదల, మధు కందేపి, రవి ఆలపాటి, కిషోర్ కొండ్రగుంట, స్వరూప వాసిరెడ్డి, వెంకట్ అడుసుమల్లి, సతీష్ బొల్లా, సందీప్ ఇంటూరు, వంశీ కరుటూరి, అశోక్ కూరపాటి, హరీష్ అయినంపూడి, శ్రీకర్ కేతినేని, వెంకట్ కోగంటి, వంశీ గొల్లపూడి, అన్నారు చల్లగుండ్ల, అమర్ చిమిరి తదితరులు పాల్గొన్న ఈ సంబరాలు అంబరాన్నంటాయి.

NRI: తెలంగాణ సీఎంకు గల్ఫ్ టీపీసీసీ, దుబాయి అంబేద్కర్ సంఘం కృతజ్ఞతలు

Read Latest and NRI News

Updated Date - Sep 27 , 2024 | 08:24 PM