ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Powerful passports: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల.. మాల్దీవులకు 58వ ర్యాంకు! భారత్ పరిస్థితి ఏంటంటే..

ABN, Publish Date - Feb 19 , 2024 | 04:18 PM

హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్-2024 జాబితాలో భారత్ 85వ ర్యాంకుకు పరిమితమైంది.

ఎన్నారై డెస్క్: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల (world's most powerful passports) జాబితా తాజాగా విడుదలైంది. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్-2024 (Henly passport Index) పేరిట విడుదలైన ఈ జాబితాలో భారత్ (India) గతేడాదితో పోలిస్తే ఒకస్థానం దిగజారి 85వ ర్యాంకుకు పరిమితమైంది. భారతీయ పాస్‌పోర్టుదారులను వీసా రహిత పర్యటనలకు అనుమతించే దేశాల్లో మరో రెండు కొత్తగా వచ్చి చేరినా భారత్ ర్యాంకు కాస్తంత తగ్గడం గమనార్హం. ప్రస్తుతం భారతీయ పౌరులకు 60 దేశాలు వీసాలేకుండానే తమ దేశాల్లో పర్యటించేందుకు అనుమతిస్తున్నాయి. ఇటీవల థాయ్‌ల్యాండ్, మలేషియా, ఇరాన్ దేశాలు భారత్‌కు ఈ పథకాన్ని వర్తింపచేశాయి. వీసాలేకుండా ఎన్ని దేశాలకు ప్రయాణించొచ్చన్న అంశం ఆధారంగా హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ జారీ చేస్తారన్న విషయం తెలిసిందే.

NRI: 30 ఏళ్ల నాటి వేశ్య హత్య కేసులో దోషిగా ఎన్నారై.. కొత్త టెక్నాలజీతో తాజాగా వీడిన మిస్టరీ!


ఈ జాబితాలో ఫ్రాన్స్ (France) తొలిస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్ పాస్‌పోర్టు ఉన్న వారు వీసా లేకుండా ఏకంగా 192 దేశాలకు వెళ్లొచ్చు. జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచాయి. మరోవైపు మన దాయాది దేశం పాకిస్థాన్ 106వ స్థానానికి పరిమితమైంది. ఇటీవల భారత్‌తో దౌత్యవివాదంతో వార్తల్లో నిలిచిన మాల్దీవులు మాత్రం ఏకంగా 58వ స్థానంలో నిలిచింది. మాల్దీవుల పాస్‌పోర్టు ఉన్న వారు వీసా లేకుండా 96 దేశాలకు వెళ్లొచ్చు.


గత 19 ఏళ్ల డాటా మొత్తాన్ని పరిశీలించి హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ తయారు చేస్తారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ అందుబాటులో ఉంచే సమాచారం ఈ సూచీ రూపకల్పనకు కీలకం. ప్రతి నెల ఈ డాటాను కొత్త సమాచారంతో తాజాపరుస్తూ ఉంటారు. మొత్తం 199 దేశాల్లోని 227 ప్రయాణగమ్యస్థానాల సమాచారం ఈ డాటాలో పొందుపరుస్తారు. ఈ డాటాకు ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక గుర్తింపు ఉంది. కొన్నేళ్లుగా వస్తున్న మార్పులకు ఈ సమాచారం సాక్షిగా నిలుస్తోంది. 2006లో ప్రజలు సగటున 58 దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడీ సంఖ్య దాదాపు రెట్టింపై 111కు చేరుకుంది.

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2024 | 04:22 PM

Advertising
Advertising