UK: బ్రిటన్‌లో భారత సంతతి టీనేజర్‌కు సీఏఆర్ టీ థెరపీ.. ఈ చికిత్స పొందిన తొలి బాలుడిగా గుర్తింపు
ABN, Publish Date - Mar 31 , 2024 | 09:49 PM
లుకేమియా క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత సంతతి బ్రిటన్ (NRI) టీనేజర్ యువన్ ఠక్కర్‌కు బ్రిటన్‌లో అత్యాధునిక చికిత్స లభించింది.
ఎన్నారై డెస్క్: లుకేమియా క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత సంతతి బ్రిటన్ (NRI) టీనేజర్ యువన్ ఠక్కర్‌కు అత్యాధునిక సీఏఆర్ టీ థెరపీ (CAR T Therapy) చికిత్స లభించింది. ఈ చికిత్స పొందిన తొలి చిన్నారిగా అతడు అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈ థెరపీతో తన జీవితంలో చాలా మార్పు వచ్చిందంటూ అతడు సంబరపడ్డాడు. ప్రభుత్వ నిధులతో నడిచే నేషనల్ హెల్త్ సర్వీస్ ఏర్పాటు చేసిన క్యాన్సర్ డ్రగ్స్ ఫండ్ ద్వారా బాలుడికి ఈ అరుదైన చికిత్స లభించింది.
Cyber Slaves: భారీ స్కామ్.. కాంబోడియాలో చిక్కుకుపోయిన 5 వేల మంది ఎన్నారైలు
లండన్‌కు సమీపంలోని వార్ట్‌ఫర్ట్‌కు చెందిన యువన్ ఠక్కర్ ఆరేళ్ల వయసులోనే లుకేమియా బారినపడ్డాడు. ఆ తరువాత అతడు కీమో థెరపీ చేయించుకున్నా వ్యాధి తిరగబెట్టింది. దీంతో, అతడు స్కూలు, ఆటపాటలకు దూరం కావాల్సి వచ్చింది. అయితే, సీఏఆర్ టీ థెరపీతో అతడి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. స్నూకర్ ఆడటం, ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లడం వంటి పనులు ఇప్పుడు తాను చేయగలుగుతున్నానని బాలుడు చెప్పుకొచ్చాడు. తమ బిడ్డ జీవితంలో కొత్త వెలుగులు నింపిన వైద్యులకు ఠక్కర్ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. దేవుడు ఎట్టకేలకు తమ ప్రార్థనలు ఆలకించాడని వ్యాఖ్యానించారు (Indian-Origin Teen In UK Gets CAR T Therapy).
ఏమిటీ సీఏఆర్ టీ థెరపీ
ఈ చికిత్సలో రోగిలోని టీ సెల్స్‌నే (ఒకరకమైన తెల్ల రక్తకణాలు) క్యాన్సర్‌పై ఆస్త్రంగా ప్రయోగిస్తారు. ఇందుకోసం ముందుగా రోగి నుంచి టీ సెల్స్ సేకరించి కొన్ని మార్పులు చేస్తారు. రోగిలోని క్యాన్సర్ కణాలను గుర్తించేలా వాటిని రెడీ చేసి తిరిగి రోగి శరీరంలో ప్రవేశపెడతారు. దీంతో, అవి క్యాన్సర్ కణాలను కచ్చితంగా గుర్తించి అంతం చేస్తాయి.
NRI: కాంబోడియాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించాం: విదేశాంగ శాఖ
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 31 , 2024 | 09:55 PM