NRI: సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN, Publish Date - May 25 , 2024 | 04:01 PM
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో స్థానిక హిందూ దేవాలయంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఎన్నారై డెస్క్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో స్థానిక హిందూ దేవాలయంలో (NRI) శుక్రవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మే 24 నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం నాడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. తొలిరోజు ఉదయం కార్యక్రమాల్లో విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, పంచగవ్య ప్రసన్నం, అగ్ని ప్రతిష్ఠ, అకల్మష హోమం, యాగశాల వాస్తు హోమం, పూర్ణాహుతి, గోమాత పూజ, హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. నేటి సాయంత్రం రుత్విక్ వారణం, రక్షాబంధనం, మేదిని పూజ, అంకురార్పణ తదితర పూజలు నిర్వహించనున్నారు.
NRI: వైభవంగా తానా ప్రపంచసాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం
శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా, ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ఈ అయిదు రోజుల క్రతువు మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచ శాంతికి దోహదపడేలా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. బ్రహ్మోత్సవం అనేది హిందూ ధార్మిక పరిణతిలో ఒక ప్రముఖమైన ఉత్సవమని, దేవతల కృప భక్తులకు సమృద్ధిగా లభించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ కె. సాక్షి, బ్రహ్మోత్సవాల కార్యదర్శి పుట్టగుంట మురళీ తదితరుల సమన్వయంలో 500 మంది వాలంటీర్లు ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని మీడియా ఛైర్మన్ రాజా సూరపనేని తెలిపారు.
Updated Date - May 25 , 2024 | 04:01 PM