ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: బ్రిటన్‌కు పోటెత్తిన భారతీయులు.. గతేడాది ఎంత మంది వెళ్లారంటే..

ABN, Publish Date - May 24 , 2024 | 04:48 PM

గతేడాది బ్రిటన్‌కు భారతీయులు పోటెత్తారు. బ్రిటన్‌కు వెళ్లిన విదేశీయుల్లో సంఖ్యా పరంగా టాప్‌లో నిలిచారు. విద్యా ఉద్యోగాల కోసం సుమారు 2.5 లక్షల మంది అక్కడకు వెళ్లినట్టు తాజాగా గణాంకాలు చెబుతున్నాయి.

ఎన్నారై డెస్క్: గతేడాది బ్రిటన్‌కు భారతీయులు పోటెత్తారు. బ్రిటన్‌కు (Britain) వెళ్లిన విదేశీయుల్లో సంఖ్యా పరంగా టాప్‌లో నిలిచారు. విద్యా ఉద్యోగాల కోసం సుమారు 2.5 లక్షల మంది భారతీయులు అక్కడకు వెళ్లినట్టు తాజాగా గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది నికర వలసలు పది శాతం మేర తగ్గినా భారతీయులు టాప్‌లో ఉండటం గమనార్హం.

నేషనల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం గణాంకాల ప్రకారం, గతేడాది 127,000 మంది భారతీయులు ఉద్యోగాల కోసం బ్రిటన్‌కు వెళ్లారు. మరో 115,000 మంది పైచదువుల కోసం, 9,000 వేల మంది ఇతర కారణాల రీత్యా బ్రిటన్‌కు వెళ్లారు. భారతీయుల తరువాత నైజీరియన్లు (141,000) అత్యధిక సంఖ్యలో బ్రిటన్‌కు వలస వెళ్లారు. పాకిస్థానీయులు మూడో స్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో చైనీయులు, పాకిస్థానీలు, జింబాబ్వే వారు ఉన్నారు. ఇక నైజీరాయా, శ్రీలంక, భారత్, పాకిస్థాన్‌ దేశాల వారు తమ వెంట కుటుంబసభ్యులను కూడా తీసుకెళ్లారు. ఇలా వెళ్లిన వాళ్లల్లో 50 శాతం మంది 17 ఏళ్ల లోపువారేనని గణాంకాలు చెబుతున్నాయి (Most immigrants to UK in 2023 were from India).

NRI: వైభవంగా తానా ప్రపంచసాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం


గతేడాది బ్రిటన్ 337,240 ఉద్యోగ వీసాలు జారీ చేసింది. మరో 146,477 హెల్త్ కేర్ వీసాలు ఇచ్చింది. ఇక చదువు తరువాత ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా 114,409 గ్రాడ్యుయేట్ వీసాలు కూడా మంజూరు చేసింది. గ్రాడ్యుయేట్ వీసాలు పొందిన వారిలో 50,503 మంది భారతీయులు ఉన్నారు. ఈ వీసా లబ్ధిదారుల్లో సంఖ్యా పరంగా టాప్‌లో నిలిచారు. అయితే, కరోనా సంక్షోభం తరువాత బ్రిటన్‌కు ఐరోపాయేతరుల వలసల పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఉక్రెయిన్, హాంకాంగ్ నుంచి సుమారు 50 వేల మంది బ్రిటన్ కు వెళ్లారు.

అయితే, భారతీయులకు విద్యార్థి వీసాల జారీ తగ్గుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటివరకూ వీసాల జారీలో 21,800 వేల వరకూ కోత పడింది. బ్రిటన్ లోని దాదాపు 75 యూనివర్సిటీల్లో విదేశీ అడ్మిషన్ల సంఖ్య తగ్గింది.

Read Latest NRI News and Telugu News

Updated Date - May 24 , 2024 | 04:54 PM

Advertising
Advertising