ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: ఎడారిలో మోసపోయిన మరో ప్రవాసీని రక్షించిన నారా లోకేశ్!

ABN, Publish Date - Jul 26 , 2024 | 06:25 PM

ఖతర్‌లోని ఒక అరబ్బు ఇంట్లో పని చేయడానికి వచ్చి మోసపోయి సౌదీ అరేబియాలోని సువిశాల ఎడారిలో ఒంటెల కాపరిగా మారిన ఏపీ వాసిని సారెళ్ళ వీరేంద్రకుమార్ ఎట్టకేలకు మంత్రి నారా లోకేశ్ జోక్యం, అరబ్బు తెగల ప్రయత్నంతో శుక్రవారం స్వదేశానికి చేరుకున్నాడు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఖతర్‌లోని ఒక అరబ్బు ఇంట్లో పని చేయడానికి వచ్చి మోసపోయి సౌదీ అరేబియాలోని సువిశాల ఎడారిలో ఒంటెల కాపరిగా మారిన ఏపీ వాసి సారెళ్ళ వీరేంద్రకుమార్ (NRI) ఎట్టకేలకు మంత్రి నారా లోకేశ్ జోక్యం, అరబ్బు తెగల ప్రయత్నంతో శుక్రవారం స్వదేశానికి చేరుకున్నాడు. వాస్తవానికి, వీరేంద్ర కుమార్ రెండు రోజుల క్రితమే స్వదేశానికి రావాల్సి ఉన్నా ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులమంటూ చెప్పుకునే కొందరు ప్రవాసీయుల చిల్లర రాజకీయాల కారణాన జాప్యమైంది.

వీరేంద్ర కుమార్‌ది డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామం. ఖతర్‌లో ఒక సంపన్న అరబ్బు కుటుంబానికి చెందిన ఫాం హౌస్‌లో వంటమనిషిగా పని చేయడానికి వచ్చిన వీరేంద్రకుమార్‌కు తెలియకుండా అతని యజమాని పొరుగున ఉన్న సౌదీ అరేబియాలోని ఎడారిలోగల ఒంటెల క్షేత్రంలో తీసుకువచ్చాడు. ఎడారిలో ఒంటెల మధ్య తాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి వీరేంద్రకుమార్ వీడియో ద్వారా వివరిస్తూ తనను స్వదేశానికి రప్పించవల్సిందిగా కోరారు. అది మంత్రి నారా లోకేశ్ దృష్టికు రాగా ఆయన దాన్ని తెలుగుదేశం గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధకృష్ణాకు పంపుతూ సహాయం చేయవల్సిందిగా సూచించారు. తెలుగుదేశం ఎన్నారై విభాగం అధ్యక్షుడు వేమూరి రవి ఈ విషయమై ఇటు పార్టీ వర్గాలు అటు అధికార వర్గాలతోనూ చర్చించారు. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇటు వీరేంద్రకుమార్ కుటుంబంతో, అటు సౌదీ అరేబియాలోని భారతీయ ఎంబసీ అధికారులతో చర్చించారు.

NRI: టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డికి ప్రవాసాంధ్రుల సత్కారం


ఉపాధి ఒప్పందంపై వచ్చిన వీరేంద్రకుమార్‌ను గడువుకు ముందు వీసా రద్దు చేసి పంపించడంలో ఉన్న చట్టపరమైన ఆటంకాలు, సౌదీ అరేబియా, ఖతర్ దేశాల మధ్య ఉన్న వీసా నియమాలు అవరోధంగా మారాయి. దౌత్యమార్గాలలో అధికార ప్రక్రియల ద్వారా స్వదేశానికి వెళ్ళడానికి జాప్యం జరుగుతుంది.

దీంతో రాధాకృష్ణా, సౌదీ అరేబియాలోని నారియా అనే ఎడారి ప్రాంతంలోని అరబ్బు తెగల ప్రముఖుల సహాయం కోరగా, వారు పొరుగులోని ఖతర్‌లోని అదే తెగ వారితో సంప్రదించి వీరేంద్రకుమార్‌ను వెనక్కి పంపించవల్సిందిగా కోరడంతో ఖతరీ అరబ్బులు అంగీకరించారు. దీంతో వీరేంద్రకుమార్ వెనక్కి రావడం సాధ్యమైంది. సౌదీ అరేబియాలోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా వీరేంద్రకుమార్‌ను ఖతర్ సరిహద్దులోని నారియా ఎడారి నుండి తీసుకురావడంతో పాటు హైదరాబాద్ వరకూ విమానం టిక్కెట్‌ను సమకూర్చారు.

ఇదిలా ఉండగా, ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల ఆధారంగా మాతృభూమిలోని అధికార, రాజకీయ ప్రముఖుల దృష్టికి తమ సమస్యలను ప్రవాసీయులు తీసుకువచ్చె క్రమంలో మధ్యలో సామాజిక సేవ పేర వస్తూ వసూళ్ళ పర్వానికి పాల్పడే వారిని కూడా బహిర్గతం చేసింది. వీరేంద్ర కుమార్ గోడు పట్ల లోకేశ్ స్పందించిన వెంటనే ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానులమని చెప్పుకొనే కొందరు రంగంలో దిగారు. క్షేత్రస్థాయిలో కాకుండా, సామాజిక మాధ్యమాలలో మాత్రమే క్రియాశీలకంగా ఉండే వీరు ఖతర్‌లో వీరేంద్ర కుమార్‌కు సహాయం పేరిట వసూళ్ళ పర్వానికి తెర లేపారు. వీరేంద్రకుమార్ స్వదేశానికి రావడంలో జరిగిన జాప్యానికి కూడా ఈ చౌకబారు నాయకులే కారణమని తెలుస్తోంది.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jul 26 , 2024 | 07:05 PM

Advertising
Advertising
<