Kolla Ashok Babu Open letter: ఏపీ అభివృద్ధికి విరామం ప్రకటించిన ప్రభుత్వం
ABN, Publish Date - May 11 , 2024 | 05:38 PM
రైతులు క్రాఫ్ హాలీడే ప్రకటించినట్టు.. రాష్ట్రాభివృద్ధికి కూడా విరామం ప్రకటించినట్లుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఉందని ఎన్నారై కొల్లా అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రం పురోగామి దిశగా దూసుకు వెళ్లితే.. నేడు తిరోగమన దిశలో ఉందన్నారు.
రైతులు క్రాఫ్ హాలీడే ప్రకటించినట్టు.. రాష్ట్రాభివృద్ధికి కూడా విరామం ప్రకటించినట్లుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఉందని ఎన్నారై కొల్లా అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రం పురోగామి దిశగా దూసుకు వెళ్లితే.. నేడు తిరోగమన దిశలో ఉందన్నారు. అందుకు ప్రధాన కారణం.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న యూటర్న్ నిర్ణయాలే కారణమని తెలిపారు.
మైన్స్ కానివ్వండి.. మద్యం మాఫియా కానివ్వండి.. ఇసుక కానివ్వండి.. భూములు కానివ్వండి.. ప్రతీ అంశం కూడా ఈ ప్రభుత్వం తన చెప్పు చేతల్లో పెట్టుకుందని విమర్శించారు. అయితే ఈ ధోరణి అంత మంచిది కాదని.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుపై ఇది మరింత ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతే కాదు ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా మెజార్టీ ప్రజల్లో అభద్రతా భావం పెరిగిందన్నారు.
రాష్ట్రంలో హింస పెచ్చురిల్లుతోందని.. వేధింపులు పెరిగాయని.. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడం వల్ల ప్రజల ఆర్థిక కష్టాలు మరింత అధికమయ్యాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి సమాజ హితాన్ని కాంక్షించే అంశం కాదన్నారు. ఇటువంటి పరిస్థితుల వల్ల సాధారణ పౌరులంతా భయాందోళనల్లో బతుకుతూ.. దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు.
LokSabha Elections: తనయుడి భవిష్యత్తుపై స్పందించిన మేనకా గాంధీ
ఆంధ్ర్రప్రదేశ్‌లో మరికొద్ది గంటల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుందని... ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిస్థితులపై ఎన్నారై కొల్లా అశోక్ బాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం మన పరిస్థితి నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నట్లుగా ఉందన్నారు. మనం ఎవరికి ఓటు వేయాలన్నది మనం నిర్ణయించుకోవాల్సిన తరుణం అసన్నమైందని చెప్పారు.
నాయకులు ఇచ్చిన హామీలను బట్టి కాకుండా.. ఆ యా పార్టీల అధినేతలు అధికారంలో ఉన్న సమయంలో.. వారు చేసిన అభివృద్ధి ఏమిటన్నది ప్రశ్నించుకోని.. అందుకు అనుగుణంగా నాయకులను ఎంచుకొని.. వారికి ఓట్లు వేయాలని ఈ సందర్భంగా ప్రజలకు కొల్లా అశోక్ బాబు సూచించారు. విదేశాల్లో చదువుకునేందుకు తెలుగు యువతకు అవకాశాలు ఎవరు కల్పించారో కూడా ఆలోచించాల్సిన అవసరముందన్నారు.
Elections: ప్రయాణికులతో నిండిపోయిన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
ఎన్నికల్లో ఓటు వేయడమనేది మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. మార్పును తేవడం కోసం ఇదో అతి పెద్ద యుద్ధమని ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపు రేఖలను మార్చేందుకు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేందుకు మన వద్ద ఉన్న ఒకే ఒక్క శక్తి.. ఓటు అని కొల్లా అశోక్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఎన్నికలు భావి తరాల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఓటు వేసేందుకు ముందుకు రావాలని.. యువతకు కొల్లా అశోక్ బాబు పిలుపు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నిర్దేశించే శక్తి మీ ఓటేనని ఈ సందర్భంగా యువతకు ఆయన సూచించారు. ఓ మంచి పరిపాలనను తీసుకువచ్చే శక్తి మీ ఓటుకు ఉందని యువతకు గుర్తు చేశారు. ఊరూ వాడా ఏకంకండి.. ఓట్ల రూపంలో మీ గళాన్ని విప్పండంటూ యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన రావడంలో మీ వంతు పాత్రను పోషించినట్లు అవుతందని చెప్పారు.
LokSabha Elections: మోదీ రిటైర్ అవుతున్నారు.. మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు..?
సమాన అవకాశాలను కల్పించేలా.. సామూహిక ఆకాంక్షలు నెరవేరేలా.. భవిష్యత్తు బాగుండేలా మనల్ని మనమే తీర్చిదిద్దుకునేందుకు కలిసి నడుద్దామన్నారు. మన రాష్ట్రగతిని మనమే మార్చుకుందామని యువతకు ఆయన వివరించారు. ప్రగతి కోసం.. మన ఆంధ్రప్రదేశ్ కోసం ఓటు వేయాలని యువతకు కొల్లా అశోక్ బాబు విజ్జప్తి చేశారు. మరోవైపు గత నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో తాను పర్యటించానని కొల్లా అశోక్ బాబు తెలిపారు.
ఆ క్రమంలో వివిధ వర్గాల వారితో భేటీ అయ్యానన్నారు. అందులో అన్ని వయస్సుల వారు ఉన్నారని వివరించారు. అయితే ఇప్పటి వరకు చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోని వారు సైతం వారిలో ఉన్నారని చెప్పారు. అలాంటి వారికి ఓటు హక్కు గురించి అవగాహన పెంచడంతోపాటు.. ఒక్క ఓటు.. ఎంత విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదో.. వారందరికీ అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
LokSabha Elections: ఆ విషయాన్ని ఏ పిచ్చి ముఖ్యమంత్రి చెప్పడు..
దీంతో ఓటు అనేది ఎంత శక్తివంతమైన ఆయుధమో.. ప్రజలకు తెలిసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా.. నా రాష్ట్రం అన్ని విషయాల్లోనూ ముందుండాలని ఆశించే ఓ సగటు తెలుగు వాడిగా.. బరువెక్కిన గుండెతో మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి ఏంటన్నది చెప్పాలనుకుంటున్నానని కొల్లా అశోక్ బాబు.. తాను రాసిన లేఖలో వివరించారు.
Read Latest National News And Telugu News
Updated Date - May 11 , 2024 | 05:42 PM