NRI: ప్రధాని కువైత్ పర్యటనతో తిరుపతికి అంతర్జాతీయ విమానాలు నడపాలి.. ఎన్నారైల విజ్ఞప్తి
ABN, Publish Date - Dec 19 , 2024 | 06:53 PM
అంతర్జాతీయ విమానశ్రాయ హోదా కల్గిన తిరుపతి విమానశ్రాయాన్ని కార్యచరణలో కూడా ఆ దిశగా మార్చాలని తద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు, గల్ఫ్ దేశాలలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న రాయలసీమ జిల్లాల ప్రవాసీయులకు ప్రయోజనం చేకూరుతుందని సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా-సెంట్రల్) ప్రముఖుడు రంజీత్ చిట్టలూరి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పేరుకు మాత్రమే అంతర్జాతీయ విమానశ్రాయ హోదా కల్గిన తిరుపతి విమానశ్రాయాన్ని కార్యచరణలో కూడా ఆ దిశగా మార్చాలని తద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు, గల్ఫ్ దేశాలలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న రాయలసీమ జిల్లాల ప్రవాసీయులకు ప్రయోజనం చేకూరుతుందని సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా-సెంట్రల్) ప్రముఖుడు రంజీత్ చిట్టలూరి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు (NRI).
ప్రధాని నరేంద్ర మోదీ కువైత్ పర్యటన సందర్భంగా ఆయన ప్రకటన చేస్తూ కువైత్ – భారత్‌ల మధ్య ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉన్న విమానం సీట్ల కోటాకు ప్రధాని పర్యటనలో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. వారానికి 12 వేల సీట్ల కోటాను 28 వేలకు పెంచాలని కువైత్ డిమాండ్ చేస్తుంది ఆయన చెప్పారు. దీంతో తిరుపతితో పాటు విజయవాడ, విశాఖపట్టణాలకు కూడా గల్ఫ్ నుండి కనెక్టివిటి పెంచడం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని రంజీత్ అన్నారు.
NRI: గల్ఫ్ రోడ్డు ప్రమాదంలో 9 మంది కార్మికుల మృతి
కువైత్ కేంద్రంగా పని చేసే అల్ జజీరా ఎయిర్ లైన్సు తన వద్ద ఉన్న ఎయిర్ బస్ రకం విమానాలతో కువైత్ మీదుగా గల్ఫ్‌లోని ఆరు దేశాలకు తిరుపతి నుండి నేరుగా విమానాలు నడపవచ్చని ఆయన సూచించారు. రేణిగుంట విమానశ్రాయంలో ప్రస్తుతం ఉన్న రన్ వే సామర్ధ్యంలో దీన్ని విజయవంతంగా అమలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. విస్తృతమైన అనుసంధాన వ్యవస్థ కల్గి ఉన్న ఇతర గల్ఫ్ ఎయిర్ లైన్సులు లేదా ఎయిర్ ఇండియా కూడా ఈ దిశగా అలోచించాలని రంజీత్ కోరారు.
ఆయోధ్యలోని శ్రీరామచంద్రుని సందర్శానార్థం విమానశ్రాయం పట్ల చూపుతున్న శ్రద్ధలో కొంచం దక్షిణాదిన భక్తుల మన్ననలను పొందిన ఏడు కొండల స్వామి పట్ల కూడా చూపాలని రంజీత్ వ్యాఖ్యానించారు.
NRI: సేవా ఇంటర్నేషనల్ అట్లాంటా చాప్టర్ వార్షిక గాలా ఈవెంట్ విజయవంతం!
ఈ మేరకు కువైత్‌తో పాటు గల్ఫ్‌లోని ఇతర దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, ఒమాన్, బహ్రెయిన్‌లలో నివసించే రాయలసీమ జిల్లాల ప్రవాసీయులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తున్నామని రంజీత్ వెల్లడించారు.
తిరుపతికి అంతర్జాతీయ విమానాలను నడిపై విషయమైన త్వరలో తిరుపతిలో ప్రవాసీయుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లుగా వెల్లడిస్తూ ఆసక్తి కల్గిన వారు 00966559636179 నెంబర్‌పై సంప్రదించవచ్చని అన్నారు.
Updated Date - Dec 19 , 2024 | 06:53 PM