ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: దుబాయ్‌లో వేడుకగా ఎన్టీఆర్ సినీవజ్రోత్సవం!

ABN, Publish Date - Dec 22 , 2024 | 09:42 PM

యూఏఇ ఎన్.ఆర్.ఐ. టీడీపీ ఆధ్వర్యంలో దుబాయ్ వేదికగా డిసెంబర్ 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

  • ముఖ్య అతిథిగా పాల్గొన్న టి.డి. జనార్దన్

ఎన్నారై డెస్క్: యూఏఇ ఎన్.ఆర్.ఐ. టీడీపీ ఆధ్వర్యంలో దుబాయ్ వేదికగా డిసెంబర్ 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్, తణుకు నియోజక వర్గ శాసన సభ్యులు అరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు (NRI).

NRI: ప్రధాని మోదీ సభలో రెపరెపలాడిన తెలుగుదేశం జెండా


దుబాయ్‌లోని బిర్యానీమోర్ వేదికగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఇందులో ఎన్టీఆర్ టీడీపీ సభ్యులు, ఐక్య శెట్టి బలిజ సంఘం సభ్యులు, ఐక్య క్రిస్మస్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టి.డి. జనార్దన్ మాట్లాడుతూ... విదేశాలలో ఉంటూ కూడా స్వదేశం పట్ల అభిమానం చూపిస్తున్న ఎన్నారైల మాతృభూమి భక్తి గొప్పదన్నారు. క్రిందటేడాది జరిగిన ఎన్నికలలో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడి విజయం కోసం యుఏఇ నుంచి ఎందరో ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కొచ్చి నెల రోజులకు పైగా పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అందరి సమష్ఠి కృషితోనే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ప్రజాప్రభుత్వం ఏర్పాటయిందని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, ఎన్డీఏ భాగస్వామి పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, పురందేశ్వరిలు పని చేస్తున్నారన్నారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని, క్రీస్తు ప్రవచించిన శాంతి, కరుణ, సామరస్యంతోనే మానవాభివృద్ధి సాధ్యం అవుతుందని టి.డి. జనార్దన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాసన సభ్యులు అరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు.

NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు


ఇక ఎన్నారై టిడిపీ నేతలు నిర్వహించిన 'మీట్ అండ్ గ్రీట్' వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమాన్ని జరిపారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వెలువరించిన 'తారకరామం' పుస్తకాన్ని టి.డి. జనార్దన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య నటుడు, రాజకీయ నాయకుడైన నందమూరి తారకరామారావు శతజయంతి సంవత్సరాన్ని క్రిందటేడాది ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఘనంగా జరుపుకున్నారని, ఎన్టీఆర్ సినీ ప్రస్థానం మొదలై 75 సంవత్సరాలైన సందర్భంగా ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని అన్ని చోట్ల జరుపుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అంగీకరించిన విషయాన్ని టి.డి. జనార్దన్ తెలియజేశారు.

ఈ వేడుకలలో పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన టిడిపి యుఎన్ఐ అధ్యక్షుడు మోత్కురు విశ్వేశ్వరరావు, డాక్టర్ రవి గారు, కోడి రాజాకిరణ్, పాడిపిరెడ్డి దాసు, డాక్టర్ ముక్క తులసి కుమార్, ఖాదర్ బాషా, సామ్యూల్ రత్నం, కుడుపూడి సత్య, కేత శెట్టి, జుత్తుగ శ్రీను, కోడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest and NRI News

Updated Date - Dec 22 , 2024 | 09:46 PM