ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం - అతిరుద్ర మహాయాగం

ABN, Publish Date - Dec 28 , 2024 | 07:12 AM

వందేండ్ల క్రితం ప్రారంభమైన సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ శతాబ్దిక (1924 -2024 ) వార్షికోత్సవం సందర్భంగా అతిరుద్ర మహాయాగం నిర్వహించింది.

ఎన్నారై డెస్క్: లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో వందేండ్ల క్రితం ప్రారంభమైన సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ శతాబ్దిక (1924 -2024 ) వార్షికోత్సవం సందర్భంగా అతిరుద్ర మహాయాగం నిర్వహించింది. మార్గశిర కృష్ణ షష్ఠి 21-12-2024 నుండి కృష్ణ ఏకాదశి 26-12-2024 వరకు 6 రోజుల పాటు ఘనంగా పిజిపి హాల్, పెరుమాళ్ దేవాలయ ప్రాంగణంలో ఈ మహాయాగం జరిగింది. గత 5 రోజుల నుండి అత్యంత విశేషంగా జరుగుతూ కృష్ణ ఏకాదశి 26-12-2024 రోజున మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. సభ నిర్వహించిన అతి రుద్రం కార్యక్రమం ఇది మొదటిది, సింగపూర్‌లో రెండవది. సింగపూర్‌లో మొట్టమొదటి మహారుద్రం సభ 80వ వార్షికోత్సవాలలో భాగంగా 2004లో నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు (NRI).

NRI: సింగపూర్‌లో కిరణ్ ప్రభ దంపతులు.. ఆహ్లాదకరంగా ముఖాముఖీ కార్యక్రమం..


ఈ సందర్భముగా కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీల లోహిత, ఈశాన, విజయ, భీమ, దేవ దేవ, భవోద్భవ, ఆదిత్యమఖ మొదలైన ఏకాదశ(11) కలశ రుద్రఘన మండపముల వద్ద 121 ఋత్విక్వరేణ్యులు ఏక కాలంలో రెండు ఏకాదశ రుద్రములు పారాయణ చేస్తూ ఉండగా మరో 11 మంది ఋత్విక్కులు రుద్ర హావనము చేస్తూ ఐదు రోజుల పాటు ప్రతి రోజు 2662 రుద్రముల పారాయణ చేసి మహా పూర్ణాహుతి అయిన 6వ రోజు 1331 రుద్రమల పారాయణతో 16,896 రుద్రములు జపించారు. ఇది ఒక అతిరుద్రం, ఒక మహారుద్రం, ఏడు ఏకాదశ రుద్రాలకు అవసరమైన సంఖ్య కంటే కొంచెం ఎక్కువ. అనంతరం ఏకాదశ కలశ మండపములవద్ద రుద్రముతో అభిమంత్రించిన 121 కలసములతో శ్రీ శ్రీ శ్రీ పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వర మహా స్వామి వారికి అభిషేకము తదనంతరం రుద్రార్చన మహా పూర్ణాహుతులతో అత్యంత వైభవోపేతముగా జరిపించారు. ఈ ఆరు రోజులు సాయంత్రం, వేద పురోహితులు క్రమార్చన చేశారు, తరువాత సామవేద జపం, అవధారయాలు జరిగాయి.

NRI: తానా ‘టాయ్‌ అండ్‌ గిఫ్ట్‌’ డ్రైవ్‌ విజయవంతం


అతిరుద్రం 2024 నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్‌డీబీబీఎస్ నిర్వహణ కమిటీలో - ఎల్ కార్తికేయన్, డాక్టర్ ఐ స్వామినాథన్, ఎన్ ఆనంద్ చంద్రశేఖర్, బాలాజీ ఉన్నారు. రామస్వామి, గణేష్ రాధాకృష్ణన్, ఈశ్వర్ శ్రీనివాసన్, రాజా రామన్, ఎస్ కృష్ణన్, కె. సాయిరామ్, కె రామ ప్రసాద్, వేణు మాధవ్ మల్లవరపు సభ్యులుగా ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే వివిధ దక్షిణ భారత రాష్ట్రాల నుండి 22 మంది గౌరవనీయులైన పండితులు పాల్గొనడం, వారిలో ముగ్గురు హైదరాబాద్‌లోని స్కందగిరి నుండి విచ్చేసారు. సింగపూర్ నుండి 121 మందికి పైగా ఋత్విక్కులతో పాటు, 4 దశాబ్దాలుగా నివాసి సభ పురోహితులచే వేద సంప్రదాయాలలో శిక్షణ పొందారు. ఇందులో గత దశాబ్దముగా పరమేశ్వరుని సేవలో ఎన్నో వైదిక కార్యక్రమములు చేస్తున్న సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజము అతిరుద్రం 1వ రోజు మధ్యాహ్న భోజనం స్పాన్సర్ చేయడంతో పాటు అతిరుద్రం మహాయాగంలో చల్లా శ్రీ ప్రదాయ, చల్లా శ్రీకాంత్, అనంత్ బొమ్మకంటి, ధర్మారావు అక్కిపెద్ది, గంటి చంద్రశేఖర్, వాడాలి ప్రసాద్, బాలాజీ గరిమెళ్ళ, రాఘవేంద్ర దేవరకొండ, గిరి పిండిప్రోలు, వాసు జనపాటి, కృష్ణ అయ్యగారి, గోవర్ధన్, జగన్, ఫణీన్ద్ర, రమేష్ నేమాని, సుబ్రమణ్యం, గణపతి శాస్త్రి ఆకెళ్ళ, రామ సంతోష్ శ్రీకర్ ఆకెళ్ళ, కామేశ్వర రావు భమిడిపాటి, వెంకట రమణ పమిడిఘంటం, వంశీకృష్ణ శిష్ట్లా, రత్నకుమార్ కవుటూరు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిరోజు వేలాదిగా భక్తుల శివనామ స్మరణలో పీజీపీ హాల్ ప్రాగణం మార్మోగింది. భక్తులకు ఋత్విక్కులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించి వేడుకలకు పవిత్రతను చేకూర్చారు. ప్రతిరోజు అందరు పురోహితులకు సమారాధనై భోజనం వడ్డించారు. తిరుచ్చి నుండి పాల్గొన్న పురోహితులలో ఒకరు.. కంచి మఠం జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగళ్ ఆశీర్వదించిన ప్రసాదాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్‌కు అందజేశారు.

Express Entry System: కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్‌కు కీలక మార్పు.. భారతీయులపై ప్రతికూల ప్రభావం!


సభ అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్, కార్యక్రమ డైరెక్టర్ రాజారామన్, సభ కార్యదర్శి ఆనంద్ చంద్రశేఖర్, అందరి వాద్యార్లకు (పురోహితులు), ఋత్విక్కులకు, దాతలకు, స్వచ్ఛంద సేవకులకు, అన్ని సహాయక సంస్థలకు (శ్రీ శ్రీనివాస్ పెరుమాళ్ ఆలయం, పిజిపి హాల్, శ్రీ శివన్ ఆలయం, హిందూ ఎండోమెంట్ బోర్డు, కవిత స్టోర్ అండ్ ట్రేడింగ్, మరియు ఇతర మౌలిక సదుపాయాల ప్రదాతలు) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద, ఈ కార్యక్రమం గొప్ప విజయాన్ని సాధించిందని నిర్వాహకులు తెలియజేశారు. పరమశివుడు చాలా సంతోషించాడని, ఇందుకు నిదర్శనమే ఈ 6 రోజుల కార్యక్రమంలో 3వ రోజు భారీ వర్షం కురవడమని నిర్వాహకులు ఆనందం వ్యక్తంజేశారు.మరన్ని వివరములకు సభ వెబ్‌సైట్ www.sdbbs.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

Read Latest and NRI News

Updated Date - Dec 28 , 2024 | 07:12 AM