NRI News: అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లో దీపావళి వేడుకలు నిర్వహించిన తానా న్యూ ఇంగ్లాండ్ విభాగం
ABN, Publish Date - Nov 10 , 2024 | 11:35 AM
తానా న్యూ ఇంగ్లండ్ విభాగం సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలో అతిచిన్న రాష్ట్రమైన ‘రోడ్ ఐలాండ్’లో దీపావళి వేడుకలు జరిగాయి. ఉత్సాహభరితంగా, సంతోషకరంగా ఎన్నారైలు ఈ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.
తానా న్యూ ఇంగ్లండ్ విభాగం సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలో అతిచిన్న రాష్ట్రమైన ‘రోడ్ ఐలాండ్’లో దీపావళి వేడుకలు జరిగాయి. ఉత్సాహభరితంగా, సంతోషకరంగా ఎన్నారైలు ఈ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంవత్సరం దీపావళి వేడుకల కార్యక్రమం రోడ్ ఐలాండ్ నడిబొడ్డున జరిగింది. న్యూ ఇంగ్లండ్ సందర్శకులను ఈ వేడుకలు ఆకర్షించాయి. విద్యుత్ కాంతులు, సంగీతం, సంప్రదాయాలతో కూడిన వేడుకల్లో విభిన్న సాంస్కృతిక నేపథ్యాలు ఉన్న కార్యక్రమాలను నిర్వహించారు. న్యూ ఇంగంల్డ్‌లో నలువైపుల నుంచి వచ్చిన కుటుంబాలతో వేడుకల ప్రాంగణం కళకళల్లాడింది.
దీపావళి పండగనును ‘ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’ అని కూడా పిలుస్తారు. చీకటిపై కాంతి, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. రోడ్ ఐలాండ్‌లో జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ భారతీయ నృత్యాలు, సంగీతం, బాణాసంచాతో పాటు గొప్ప ప్రదర్శనలతో కూడిన అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయి. సందర్శకులు భారతీయ వంటకాలను ఆస్వాదించారు.
తానా న్యూ ఇంగ్లాండ్ నాయకులు, అమెరికన్ స్కూల్ కమిటీ సభ్యులు కృష్ణ ప్రసాద్ సోంపల్లి, తానా ఫౌండేషన్ ట్రస్టీ నాయకులు యెండూరి శ్రీనివాస్.. సభికులందరికి అభివాదం తెలుపుతూ స్వాగతించారు. నేపథ్యాలు, విశ్వాసాలు లేదా ఇతర భేదాలతో సంబంధం లేకుండా చేతులు కలిపితే ఎలాంటి చీకటినైనా పారద్రోలవచ్చని ఈ పండుగ గుర్తు చేస్తుందని తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి అన్నారు. ‘‘ఐక్యత మన గొప్పబలం, ఐక్యతకు చిహ్నం కోసం ఈ పండుగ అందరం కలిసి జరుపుకోవాలి. ఒకరికొకరు అండగా ఉండాలి. ఒకరినొకరు సహాయం చేసుకోవాలని ఈ పండుగ మనకు బోధిస్తోంది’’ అని సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘ఐక్యత మన ఎదుగుదలకు పరమావధి. తానా న్యూ ఇంగ్లాండ్ విభాగం మన సంస్కృతి కార్యక్రమాలని ఎప్పుడు ప్రోత్సహిస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా రోడ్ ఐలాండ్‌లో జరిగిన వేడుకులకు స్థానిక అధికారులు హాజరయ్యారు. దీపావళి పండగ సాంస్కృతిక గొప్పతనాన్ని వీక్షించారు. వైవిధ్యం, సమగ్రతకు రోడ్ ఐలాండ్ నిబద్ధతకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా దీపావళి ఈవెంట్ సక్సెస్ కావడం రోడ్ ఐలాండ్ రాష్ట్రం స్వాగతించే స్ఫూర్తి నిదర్శనంగా నిలిచింది. కాగా తానా న్యూ ఇంగ్లాండ్ నాయకులు దీపావళి వేడుకను రోడ్ ఐలాండ్‌కు ఒక వార్షిక హాల్‌మార్క్ ఈవెంట్‌గా మార్చాలని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం మరింతమంది సందర్శకులను ఆకర్షించాలనుకుంటున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో దీపావళి ఉత్సవాలకు రోడ్ ఐలాండ్‌ను ప్రధాన గమ్యస్థానంగా నిలపాలని భావిస్తున్నారు. అందర్నీ ఒకచోట కలపడంలో సఫలీకృతం అవడంతో తానా న్యూ ఇంగ్లాండ్ నిర్వాహకులను అందరూ అభినందించారు. తానా న్యూ ఇంగ్లాండ్ నాయకులు, వలెంటీర్లు, స్పాన్సర్స్, వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన కుటుంబాలకు ధన్యవాదాలు చెబుతూ అందరికీ ప్రత్యేక స్వీట్లు పంచిపెట్టారు.
Updated Date - Nov 10 , 2024 | 11:35 AM