ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRIs: న్యూయార్క్‌లో టీడీపీ కూటమి విజయోత్సవ వేడుకలు

ABN, Publish Date - Jun 25 , 2024 | 10:12 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ(TDP Alliance) కూటమి ఘన విజయం సాధించడంతో ఎన్ఆర్ఐలు గెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు. న్యూయార్క్ నగరంలో తెలుగు తమ్ముళ్లు, ఎన్టీయే సానుభూతి పరులు కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజావిజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.

అమెరికా: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ(TDP Alliance) కూటమి ఘన విజయం సాధించడంతో ఎన్ఆర్ఐలు గెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు. న్యూయార్క్ నగరంలో తెలుగు తమ్ముళ్లు, ఎన్టీయే సానుభూతి పరులు కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజావిజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.

జూన్ 23 న న్యూయార్క్ నగరంలోని జేరికో పట్టణంలో వెంకటేశ్వరావు వోలేటి, ప్రసాద్ కోయి, అశోక్ అట్టాడ, దిలీప్ ముసునూరు కలసి పెద్దల సహకారంతో వేడుకలను ఘనంగా నిర్వహించారు.


ఈ వేడుకల్లో వక్తలు డా. తిరుమలరావు తిపిర్నేని, కోటేశ్వరరావు బొడ్డు, అంజు కొండబోలు, డా. జగ్గారావు అల్లూరి, డా. పూర్ణచంద్ర రావు అట్లూరి, డా. కృష్ణారెడ్డి గుజవర్తి, మాజీ తానా ప్రెసిడెంట్ జయ్ తాళ్లూరి, సత్య చల్లపల్లి, ఉదయ్ దొమ్మరాజు, సుమంత్ రామిశెట్టి, ఆర్గనైజర్లు వేంకటేశ్వర రావు వోలేటి, ప్రసాద్ కోయి, అశోక్ అట్టాడ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

రామోజీ రావు గారికి ఘన నివాళి

ఈనాడు సంస్థల ఛైర్మన్ , మీడియా మొఘల్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, చెరుకూరి రామోజీ రావుకి ఎన్నారైలు ఘన నివాళులు అర్పించారు. తెలుగు జాతికి ఆయన తెచ్చిన గుర్తింపుని వక్తలు స్మరించుకున్నారు.

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 10:13 AM

Advertising
Advertising