TDP: ఖతర్లో వైభవంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం
ABN, Publish Date - Mar 29 , 2024 | 09:29 PM
ఖతార్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 42వ ఆవిర్భావదినోత్సవ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, అభిమానులు
ఖతార్ తెలుగుదేశం (TDP) పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 42వ ఆవిర్భావదినోత్సవ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పవిత్ర రంజాన్ మాసం కావడంతో పెద్దఎత్తున ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేసారు.
జ్యోతి ప్రజ్వలనతో, దివంగత నేత, తెలుగువారి ఆత్మగౌరవం, అన్న తారకరాముడి చిత్రపటానికి పాలాభిషేకం, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో ప్రారంభమైన సభాకార్యక్రమం ఎన్టీఆర్ మొట్టమొదటి రాజకీయ ఉపన్యాసం.. "తెలుగు జనతకు వందనం.. తెలుగు యువతకు అభినందనం .. తెలుగు మమతకు అభివాదం .. తెలుగు జాతికి సుభాబి నందనం" స్క్రీన్ మీద చూడగానే ..శ్రోతలు తన్మయత్నం చెందారు. 1982లో ఆయన ఇచ్చిన పిలుపునకు తెలుగు జాతి మొత్తం ఏకతాటిపైకివచ్చి, పార్టీ స్థాపించిన 9 మాసాలలో అధికారంలోకి వచ్చిన విషయం జ్ఞప్తికి తెచ్చింది.
AP News: టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో భువనేశ్వరి
ఈ సందర్భంగా జూమ్ కాల్‌లో పలువురు నాయకులు సభను ఉద్దేశించి తమ ప్రసంగాలతో శ్రోతలను ఉత్తేజపరిచారు.
జూమ్ కాల్‌లో మాచర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. ఖతర్ తెలుగుదేశం నాయకులూ, శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహించటం చూస్తుంటే మిక్కిలి సంతోషం కలుగుతుందని అన్నారు. ఆంధ్రరాష్ట్రంలో అరాచకపాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైనదని అన్నారు. ఈ పోరాటంలో ప్రవాసులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కూటమిని గెలిపించుకోవడం తామందరి కర్తవ్యమని గుర్తుచేశారు.
జూమ్ కాల్‌లో జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రసంగిస్తూ.. ఖతర్ తెలుగుదేశం.. ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తుందని కొనియాడారు. నిస్వార్ధంగా పార్టీ పైన అభిమానం, తెలుగునేలపై ప్రేమతో ప్రవాసులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారని అన్నారు. ఖతర్ టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవసందర్భంగా అయన ఖతర్ పర్యటన.. మీటింగ్‌లో నాయకులు, శ్రేణులు చూపిన ప్రేమ అభిమానాలను నెమరువేసుకొన్నారు.
తేజస్వి పొడపాటి మాట్లాడుతూ.. ఖతర్లో పార్టీ 42వ ఆవిర్భావదినోత్సవం.. పండగ వాతావరణాన్ని తలపించిందనీ వ్యాఖ్యానించారు. పార్టీ జెండాలు, తోరణాలు, అన్న ఎన్టీఆర్, అధినేత చంద్రబాబు, లోకేష్ బాబు ఫ్లెక్సీలతో సభాలంకరణ కనులపండువగా ఉందని కొనియాడారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, అప్రమత్తంగా లేకపొతే రాక్షసుడు రాష్ట్రాన్ని యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తాడని హెచ్చరించారు.
బీవీఆర్ (బబ్బూరి వెంగళరావు), ఖతర్ టీడీపీ అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ.. ఖతర్ టీడీపీ నాయకులు, శ్రేణులు ఆవిర్భావదినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఆంధ్రరాష్ట్రంలో అరాచకం, దుర్మార్గం, కక్షసాధింపు తప్ప పాలనే లేదని విమర్శించారు. దీనికి బీవీఆర్ అనుభవమే నిదర్శనమని చెప్పుకొచ్చారు.. పార్టీ గెలుపుకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞలు తెలియచేశారు.
ఖతర్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మద్దిపోటీ నరేష్ ప్రసంగిస్తూ అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం శ్రోతలకు వివరించారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలని, వారి వారి గ్రామాల్లో స్నేహితులకు, తెలిసినవారందరి సహాయంతో ఆంధ్రులు ఎక్కడ నివసిస్తున్నా మే 13th సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని కూటమి అభ్యర్థులకు ఓటు వేసే విధంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
షేక్ మొహమ్మద్ యాసిన్, మొహమ్మద్ బాషా మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీతో తమకున్న అనుబంధాన్ని ఎవ్వరూ విడదీయలేరని వ్యాఖ్యానించారు. ఉర్దూ యూనివర్సిటీని స్థాపించటంతోపాటు ఉర్దూను సెకండ్ లాంగ్వెజ్ చేసిన ఘనత టీడీపీదేనని గుర్తు చేశారు. రంజాన్‌తో పాటు, మక్కా పర్యటనకు ఆర్థిక సహాయం, ఉన్నతవిద్యకు పెద్దపీట వేసిన టీడీపీతోనే ముస్లిం సోదరుల పయనమని అన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీజేపీని బూచిగా చూపి మమ్ములను టీడీపీకి దూరం చేయలేరని చెప్పారు. తమ ప్రాణమున్నంతవరకు తెలుగుదేశంతో నడుస్తామని అన్నారు. కూటమి గెలుపునకు కృషిచేస్తామని, ఆ దిశగా ముస్లిం సోదరులు నడవాలనీ పిలుపునిచ్చారు.
ఖతర్ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ పొనుగుమాటి రవి, ప్రోగ్రామ్స్ ఆర్గనైజర్ దాసరి రమేష్. జీసీసీ కౌన్సిల్ మెంబెర్ మల్లిరెడ్డి సత్యనారాయణ, సీనియర్ లీడర్ శాంతయ్య యలమంచిలి, బోండ్లపాటి రజని, మాగులూరి రవీంద్ర, కోశాధికారి విక్రమ్ సుఖవాసి, అనిల్ మలసాని, సింగరాజు సంతోష్, ఎం.యెన్.ఎం నాయుడు, కళ్యాణ్, రావుల సాయి మోహన్ తదితరులు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల బలోపేతం కోసం, వారికి రాజ్యాధికారం చెరువు చేయటానికి పెట్టిన పార్టీ అని అన్నారు. పార్టీకి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుని, 1983 లోనే కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పేదలకు ఆసరా ఇచ్చిన ఘనత, 50 రూపాయలకే ఆస్పావెర్ కరెంటు రైతులకిచ్చిన పార్టీ తెలుగుదేశమని నేటితరానికి గుర్తుచేశారు. ఆంధ్రరాష్ట్ర భావి పౌరుల బౌషత్తు కోసం, పుట్టిన నెల, తెలుగు తల్లి, జన్మభూమి ఋణం తీర్చుకొనే సమయం ఆసన్నమైనదనీ, ప్రతి ఒక్కరు ఒక్కొక్క నాయకుడై వారి వారి నియోజకవర్గాలలో కూటమి గెలుపుకోసం తమ శక్తి వంచనలేకుండా కృషిచేయాలని అన్నారు.
రోజుకు కనీసం మూడు, నాలుగు గంటల సమయాన్ని కూటమి గెలుపు కోసం వెచ్చించాలని సూచించారు. అందరినీ మే 13న ఓటు వేసే విధంగా ప్రోత్సహించాలని వేడుకొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావాలన్నా, రాష్ట్రానికి తలమానికమైన అమరావతి కళ కార్యరూపం దాల్చాలన్నా, రాష్ట్రం తిరిగి అభివృద్ధి గాడిన పడాలన్నా, పక్కరాష్ట్రాలతో పోటీపడాలన్న, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను...’ అనే మాటా తెలుగునేలపైనా మరోసారి ప్రతిధ్వనించాలని వ్యాఖ్యానించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలే తెలుగు ప్రజల ఆశలకు చివరి అవకాశమని హెచ్చరించారు. పొరపాటున కూడా ఆదమరచి ఉండొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జై తెలుగుదేశం.. జై జనసేన.. జై బీజేపీ.. నినాదాలతో, ఇఫ్తార్ విందు.. గ్రూప్ ఫొటోలతో సభను దిగ్విజయంగా ముగించారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 29 , 2024 | 09:34 PM