ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Saudi Arabia: కన్న కూతురిని చూడడానికి ఏడేళ్ల పాటు నిరీక్షణ.. తెలుగు ప్రవాసీకి ఎట్టకేలకు ఊరట

ABN, Publish Date - Dec 29 , 2024 | 04:09 PM

దళారుల మోసం కారణంగా ఏడేళ్ల పాటు సౌదీలో చిక్కుకుపోయిన ఓ తెలుగు ప్రవానీ సాటా సంస్థ ఆపన్న హస్తంతో ఒడ్డునపడ్డాడు. ఎట్టకేలకు భారత్‌కు చేరుకోగలిగాడు.

  • ఎడారిలో మోసపోయిన పశ్చిమ గోదావరి ప్రవాసీ గాథ

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కళ్ళు చెదిరిపోయే మండే ఎండలు .. ఎముకలు కొరికే చలిలో బిక్కు బిక్కుమంటూ రాత్రి పూట పడుకోవడానికి కొంచెం స్థలం లభిస్తే చాలు అంటూ కూలీనాలీ పనులు చేసుకోంటూ గడిపే ఆ ఆభాగ్యుడు.. తాను ప్రవాసానికి బయలుదేరే రోజు జన్మించిన కూతురిని కళ్ళారా చూడడానికి ఏళ్ళ తరబడి తపించిపోయాడు. కన్న కూతురిని స్పర్శ కోసం సప్త సముద్రాలు కాదు సప్త సంవత్సరాలు ఎదురు చూస్తూ ఏదో ఒక రోజు తనకు అదృష్టం దక్కి స్వదేశానికి వెళ్ళకపోతానా అనుకుంటూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అతని ఆశ మొత్తానికి నెరవేరింది (NRI).

YV Reddy: మన్మోహన్ సింగ్ కు మార్గదర్శకుడు మన వైవీ రెడ్డి


ఆంధ్రప్రదేశ్‌లో దళారులు మోసం చేయడంతో ఏడు సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వచ్చి చిక్కుకుపోయిన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన శేఖ్ ఇస్మాయిల్, బస్సు డ్రైవర్‌గా పని చేయడానికి వచ్చాడు. వాస్తవానికి ఇంట్లో డ్రైవర్‌గా ఉద్యోగం ఉన్నప్పటీకీ ఏలూరు లోని దళారులు అతన్ని కంపెనీలో బస్సు డ్రైవర్ ఉద్యోగం ఉందని చెప్పి పంపించారు. తీరా ఇక్కడకు వచ్చాక తెల్లవారు నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు పని ఉండడంతో అలిసిపోయాడు. ఇంట్లో పని చేయడంతో పాటు ఇంటి యాజమానికి చెందిన బయటి పనులు కూడా చేయిస్తూ బస్సులు, ఇతర భారీ వాహానాలు కూడా నడిపించమని ఒత్తిడి చేయడానికి తోడుగా సకాలంలో వేతనం అందక యాజమాని నుండి పారిపోవడంతో యాజమాని ఇస్మాయిల్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాడు. అఖమా గడువు కూడా ముగియడంతో ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అతను అక్రమమైపోయాడు. దీంతో ఇతనికి ఆశ్రయం ఇవ్వడానికి కూడా వెనుకంజవేశారు. తాను సౌదీకి బయలుదేరే రోజు జన్మించిన కూతురు ప్రస్తుతం స్కూల్‌కు వెళ్తూ ప్రతి రోజూ తన తండ్రి ఎక్కడ, ఏ విధంగా ఉంటాడని ప్రశ్నిస్తుండటంతో ఇస్మాయిల్ మరింత కృంగిపోయాడు. అందరి తండ్రులు స్కూల్‌కు అప్పుడప్పుడు వచ్చి తమ పిల్లలను తీసుకెళ్ళినా తన తండ్రి ఒక్కసారి కూడా రాకపోవడం ఆ చిన్నారిని చిన్నబుచ్చింది.

NRI: తానా ‘టాయ్‌ అండ్‌ గిఫ్ట్‌’ డ్రైవ్‌ విజయవంతం


కూలీనాలీ పనులు చేసుకోంటూ అతి కష్టంగా దినాలు లెక్కిస్తున్న ఇస్మాయిల్ దీనస్థితి గురించి అతని భార్య నగీనా అమరావతిలోని ఏపీ ఎన్నార్టీస్ సంస్థతో మొర పెట్టుకొంది. అదే సమయంలో మాతృదేశానికి తిరిగి వెళ్ళడానికి తాను ఎదుర్కొంటున్న పాట్లు గురించి ఇస్మాయిల్ తనకు కలిసిన తోటి తెలుగు వారితో ప్రస్తావిస్తూ కన్నీరుమున్నీరు కాగా వారు సౌదీలో తెలుగు ప్రవాసీయులకు తగు సహాయసహకారాలందించే సాటా సెంట్రల్ ప్రవాసాంధ్ర సంఘం గురించి చెప్పడంతో స్వదేశానికి తిరిగి వెళ్ళే ఆశ చిగురించింది.

ఏపీ ఎన్నార్టీస్ సంస్థ.. సౌదీ అరేబియాలోని తమ ప్రతినిధి అయిన ముజ్జమ్మీల్ శేఖ్‌ను సంప్రదించగా ముజ్జమ్మీల్, సాటా సెంట్రల్ ముఖ్య బాధ్యుడు అయిన రంజీత్‌లు కలిసి ఇస్మాయిల్ కేసును సౌదీ అరేబియా అధికారుల సహాయంతో పరిష్కరించి వీసాను రద్దు చేయించారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో అతనికి సాటా సెంట్రల్ విమాన టిక్కెట్ ను సమకూర్చినట్లుగా కూడా రంజిత్, ముజ్జమ్మీల్‌లు తెలిపారు.

తెలుగు ప్రవాసీయులకు అపన్న హస్తం అందించడంలో సాటా సెంట్రల్ ఎప్పుడు అగ్రభాగాన ఉంటుందని వారు పేర్కొన్నారు.

Read Latest and NRI News

Updated Date - Dec 29 , 2024 | 05:34 PM