NRI: ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు
ABN, Publish Date - May 20 , 2024 | 03:54 PM
హాంగ్‌కాంగ్‌లో తెలుగు వారంతా కలిసి ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఎన్నారై డెస్క్: హాంగ్‌కాంగ్‌లో తెలుగు వారంతా (NRI) కలిసి ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు కే. వెంకట రమణ - కాన్సల్, కన్సుల్టే జనరల్ అఫ్ ఇండియా, హాంగ్‌కాంగ్, మకావ్; మాస్. ఏమి యుంగ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (ఐలాండ్స్), హాంగ్‌కాంగ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్; లాల్ హర్దసాని - ప్రెసిడెంట్, ది హిందూ అసోసియేషన్; ఉస్తాద్ గులాం సిరాజ్, చైర్మన్, పుంహక, కె. వెంకట వంశీధర్, రీజినల్ హెడ్, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ముఖ్య అతిథులుగా విచ్చేసారు.
NRI: సెయింట్ లూయిస్‌లో బ్రహ్మోత్సవాలకు భారీగా నిధుల సేకరణ!
గౌరవనీయ అతిథులు కాన్సల్ వెంకట రమణ, మిస్ మాస్. ఏమి యుంగ్ సమాఖ్యలోని స్వచ్ఛంద సేవకులకు, తెలుగు బడి గురువులకు, స్థానికంగా జరిగే జాతీయ అంతర్జాతీయ మారథాన్లలో, ఆక్స్‌ఫామ్ ట్రయిల్ వాకర్‌లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన వారి ప్రతిభను గుర్తిస్తూ వారికి మొమెంటోలు అందించారు.
సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి కార్యక్రమ వివరాలిస్తూ, హాంగ్‌కాంగ్‌లో నివసిస్తున్న తెలుగువారు సంప్రదాయ వస్త్రధారణతో హాజరైన సభ్యులతో తెలుగుతనం వెల్లివిరిసిన ఈ వేడుకలతో తెలుగు నేలను మరిపించిందని హర్షం తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరం కనుక ఇక్కడ తమకి పెద్ద హాల్ల్స్ అందుబాటులో ఉండవని, ప్రభుత్వ వసతులు లభ్యమైనప్పుడు వేడుకలు చేసుకుంటున్నామని, అందుకీ ఉగాది వేడుకలు చేసుకోవడం కొంత ఆలస్యమయ్యిందని వివరించారు. జూన్‌లో తమ సంస్థ క్రీడా దినోత్సవానికి సిద్ధమవుతున్నామని చెప్పారు.
Read Latest NRI News and Telugu News
Updated Date - May 20 , 2024 | 03:54 PM